New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నిరీక్షణ పలిచింది – 5

నిరీక్షణ పలిచింది – 5

హాస్పిటల్ రాగానే అతనికి డబ్బులు ఇచ్చి తన తల్లిదండ్రిని నర్స్  సాయంతో జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లింది……

 

 ఎప్పుడు తీసుకెళ్లి డాక్టర్ దగ్గరికి వెళ్లారు…..

డాక్టర్ గారు వస్తున్న పూజ నీ చూసి బాగున్నవా తల్లి అని పలకరించి ప్రకాశం ని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి ఆయనని చెక్ చేశాడు ఎప్పుడు లాగానే నెగిటివ్ రిజల్ట్ రావడంతో ముఖం వేలాడేసుకుని పూజ దగ్గరికి వచ్చాడు…..

 

అయినా ఏదైనా మంచి విషయం చెప్తాడు ఏమో అని ఆత్రుతగా కుర్చీలో కూర్చొని ఎదురుచూస్తుంది పూజ…..

 

అయినా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని ఈసారి కూడా ఆయనలో ఎటువంటి చర్య లేదు తల్లి అని అన్నాడు……

 

ఐదు సంవత్సరాలుగా ఈ ఒక్క  మాట వింటున్న పూజకి పెద్దగా బాధ అనిపించలేదు అందుకు మౌనంగా కూర్చుంది……

 

అయినా మళ్లీ మాట్లాడుతూ ….అమ్మ పూజ ఇంక మీ నాన్నగారికి ఇక్కడ మందులు పనికిరావు రావు తల్లి… ఇలాంటి అంటే జబ్బుకి కేరళలో మంచి వైద్యం చేశారు……

 

కానీ కొంచెం ఖర్చుతో కూడుకున్న పని నువ్వు ఉ అను  నాకు తెలిసిన డాక్టర్ కేరళలో ఉన్నాడు నేను అతనితో మాట్లాడి మీ నాన్నగారికి ట్రీట్మెంట్ ఇచ్చేలా చేస్తాను అన్నాడు……. 

 

పూజ ఆ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది అంకుల్….

 

బాగా ఆలోచించు తల్లి…….

 

 

అంటే తల్లి దగ్గర దగ్గరగా ఒక పది లక్షలు దాక అవుతుంది అని ప్రకాశం గారికి ఎప్పుడు రాసి ఇచ్చే మందులు రాసి ఆ పేపర్ పూజ చేతికి ఇచ్చాడు……

 

పూజ పది లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకురాను ఎన్ని కుట్టినా ఓ 10   -20,000 అంటే సదుతాను…. కానీ లక్షలు అంటే ఎలా అని మనసులో అనుకొని…… మెడికల్ షాప్ కి వెళ్లి మెడిసిన్ అన్ని తీసుకొని డాక్టర్ దగ్గరికి వచ్చి ఏది ఎప్పుడు వేసి కావాలో అడిగి తెలుసుకుంది……

 

వాళ్ళ అమ్మని కూడా డాక్టర్ దగ్గర చెక్ చేయించి మెడిసిన్ తీసుకొని ఆటోలో ఇద్దరినీ కూర్చోబెట్టి ,కిరాణా షాప్ కి వెళ్లి కావలసినవి తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు………..

 

పూజ కూరగాయల సంచి పట్టుకుని ఇంటికి వచ్చి అరుగు మీద వాటిని పెట్టి….

తండ్రి దగ్గరికి వెళ్లి ఆయన పక్కన కూర్చొని ఆయన చేతిని చేతిలోకి తీసుకొని నాన్న మీరేం భయపడొద్దు… డాక్టర్ ని అడిగాను మీరు మళ్లీ  మామూలుగా తిరుగుతారని చెప్పారు…… మీరు ఇలా దిగులు పడొద్దని ఆయనకి ధైర్యం చెప్పింది……..

 

సుశీల మంచినీళ్లు తీసుకొచ్చి పూజకిచ్చి ఆయన దిగులంతా నీ గురించే తల్లి మేము పోయిన తర్వాత నిన్ను ఎవరు చూస్తారని ఆయన ఆలోచన అంతా……..

 

సుశీల ఇంకా ఏదో చెప్పబోతుంటే పూజ మధ్యలోనే అడ్డుకొని అమ్మ కిరాణా సామాన్లు కూరగాయలు ఆరుగు మీద పెట్టాను తీసుకెళ్లి లోపల పెట్టు అని మంచినీళ్లు తీసుకుని తాగుతూ అంది……..

 

సుశీల నిట్టూర్చి ఇంకా మాట్లాడకుండా ఆ కవర్లు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది……..

 

పూజ ముఖము కడుక్కొని జుట్టును కొప్పు పెట్టి మళ్ళీ మిషిన్ కొట్టడం స్టార్ట్ చేసింది………

 

 నీలిమ అశోక్ నందిని కి ఫోన్ చేసిన తర్వాత వెంటనే కారులో హైదరాబాదు నుంచి రామపురం బయలుదేరారు…...

 

 నీలు  ఇంతకీ మన బాస్  ఎక్కడికి వెళ్లారు  అంట వారం రోజుల నుంచి ఆఫీస్ కి రావట్లేదు…….

 

 అదా బాస్ వల నానమ్మ గారికి ఆరోగ్యం  బాలేదు అంట అందుకనే మన బాస్ విశాల్ సార్ ని తీసుకుని ముంబైకి వెళ్లారు…..

 

 ముంబై ఎందుకు వెళ్లారు వాళ్ళ నాయనమ్మ వాళ్ళు ముంబైలో ఉంటారా………

 

లేదు ఆవిడకి ఏదో ఆపరేషన్ చేయాలంట అది ఇక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి సరైన  ఫెసిలిటీస్ లేవంట అందుకనే బొంబాయికి వెళ్లారు……….

 

అశోక్ ఇది చెప్పు ఇంతకీ పూజకి పెళ్లయిందా లేదా……..

 

 లేదు లేదు అసలు అవ్వలేదు అని కంగారుగా అంది…….

 

అయిందా లేదా అని అడిగాను నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావ్…….

 

నీలు కూల్ నీలు  కూల్ ఎందుకంత కంగారు పడుతున్నావ్ నీ మనసులో అనుకుని……. అలా ఏమీ లేదు తనకి పెళ్లి 

 కాలేదు అని చెప్తున్నాను అంతే………

 

అంటే తనకు పెళ్లి కాలేదా తన వయసు నీ వయసు ఒకలాగే ఉంది పల్లెటూర్లో 18 ఏళ్లు రాకుండానే పెళ్లి చేశారు కదా నీలు…… మరి తను ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకోలే దో తెలుసుకోవచ్చా……….

 

తెలుసుకుని ఏం చేస్తావు తనని పెళ్లి చేసుకుంటావా ఏంటి అని వెటకారంగా అంది…………

 

ఏమో నచ్చితే చేసుకుంటానేమో అని లోపల అనుకునే మాట బయటికి అన్నాడు……….

 

అంత సీన్ లేదు బాబు అది వాళ్ళ నాన్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెళ్లి గురించి ఆలోచించలేదు………

 

అవునా …తను ఒక్కతేనా  కూతురు అని ఆరాగా అడిగాడు……..

 

లేదు తనకు ఒక అన్నయ్య ఉన్నాడు కానీ ఏం లాభం………

 

 అంటే అర్థం కాలేదే…..

 

అర్థం కావడానికి ఏం లేదురా తనకంటే పది సంవత్సరాలు పెద్ద పేరు రుద్ర పెళ్లి అయి పది సంవత్సరాలు కూతురు కూడా ఉంది……..

 

. మరి వాళ్ళ నాన్న కోసం పూజ ఎందుకు పెళ్లి చేసుకోలేదు……..

 

అంటే రుద్ర మాట వరసకు మాత్రమే కొడుకు కానీ ఎప్పుడు కూడా ఆయనని తండ్రిగా వాళ్ళ అమ్మని తల్లిగా తనను చెలిగా చూడలేదు కూడా………..

 

ఓయ్ నీలు అసలే నాకు కొంచెం తిక్క ఉంది ఇలా సగం సగం చెప్పి నాకు  చిప్పా దొబ్బకుండా అసలు స్టోరీ ఏంటో చెప్పు తల్లి………

 

.,……………………… ఇంకా ఉంది………………….

 

 

థాంక్స్ ఫర్ రీడింగ్ బంగారు కొండలు 🫂💞