Mr. ప్రవరాఖ్యుడు – 3
వైజాగ్ పక్కన చిన్న పల్లెటూరు పేరు సబ్బవరం… చంద్ర శేఖర్ గారు ఆ ఊరిలో ఉండే గవర్నమెంట్ హెడ్మాస్టర్ గారు…ఆయన భార్య వైదేహి గారు …ఒక అమ్మాయి ఒక అబ్బాయి ..రాత్రి 9 గంటల సమయంలో వైదేహి గారు కంగారు గా అటు ఇటు తిరుగుతూ చేతి పచ్చళ్ళు, సున్నుండలు ఇంకా కొన్ని అవసరమైన వస్తువులు చెక్ చేసుకుంటూ హైరానా పడుతూ ఉంటారు … హర్ష ( ఇంటర్ 2nd ఇయర్ ) .. అమ్మా ఎందుకంత హైరానా పడుతూ అంత లగేజ్ పెడుతున్నావ్..అక్క పక్కనే గా ఉండేది ..అరగంట జర్నీ ..అస్తమాను మనం వెళ్తూ ఉండొచ్చు ఇప్పుడే ఇన్ని పెట్టి పంపిస్తే అదింకా ఏడుస్తుంది..మనం ఏదో దాన్ని ఇష్టం లేకుండా ఇక్కడ నుండి తరిమేస్తున్నట్టు ఫీల్ అవుతుంది ..అసలే రెండు రోజుల నుండి ఒకటే ఏడువు సీన్లు చూసి చూసి బోర్ కొట్టింది అని అంటాడు .. రేయ్ నువ్వు కాసేపు నోరు ముస్తావా …నా బంగారం అంత దూరం లో మొదటి సారి ఉండబోతుంది ..దానికి అక్కడ ఏమవసరమో ఏంటో చూసుకోవాలి గా …ఇంకా ప్రతి వారం నేను నా బంగారం దగ్గరకి వెళ్తూనే ఉంటాను ఇంకా ఎందుకు ఏడుస్తుంది ??? కాకపోతే మొదటి సారి అందరినీ వదిలి వెళ్తుంది కాబట్టి అలా ఏడుస్తుంది కానీ నా బంగారం స్ట్రాంగ్ గర్ల్ రా…నాలాగే అంటూ మురిసిపోతారు వైదేహి గారు..అక్కడ జరిగే దానితో సంబంధమే లేనట్టు తండ్రిని కరుచుకుని ఏడుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి…చిట్టి తల్లి నువ్వలా ఏడుస్తూ ఉంటే నేనెలా పంపేది చెప్పు …నీకోసం ఫోన్ కూడా తీసుకున్నాను గా రోజు కాలేజ్ అయ్యాక ఫోన్ చేసి మాట్లాడుతుంటామ్..నువ్వు ఏడవకు చిట్టి తల్లి …M SET లో 3rd ర్యాంక్ వచ్చింది బెస్ట్ కాలేజ్ లో సీట్ సంపాదించావ్…ఇది నీ డ్రీమ్ కద రా ..పోనీ మన ఊరిలోనే ఆ చిన్న కాలేజ్ ఉందిగా అక్కడ చదువుతావా ..రోజు వెళ్ళి వచ్చేస్తూ ఉండొచ్చు అంటారు శేఖర్ గారు…లేదు నాన్న నేను వైజాగ్ లోనే చదువుతా…అక్కడ బాగా చెప్తారు … అన్ని సదుపాయాలు ఉంటాయి ..ఇక్కడ అంతగా ఏమి ఉండవ్ …క్యాంపస్ ఇంటర్వ్యూ లు కూడా ఉండవ్ ..నేను అక్కడే చదువుతా కాకపోతే మీ అందరిని వదిలి వెళ్ళాలంటే బాధ గా ఉంది అంటూ మళ్ళీ రాగం అందుకుంటుంది …ఆది చూసి హర్ష తల కొట్టుకుంటూ…చిట్టి అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఎలానే ….ఏదో ఒక దానికి డిసైడ్ అవ్వు ..ముందైతే వెళ్లి పడుకో లేట్ అవుతుంది అంటూ తన రూమ్ కి వెళ్ళిపోయాడు…చిట్టి తల్లి నీకిష్టం లేకుండా ఏది జరగదు … నువ్వు వెళ్ళి పడుకో ..రేపు అక్కడికి వెళ్ళాక నీకు నచ్చకపోతే వెంటనే వచ్చేద్దువు గాని అంటూ బ్రతిమాలి పంపిస్తారు రూమ్ కి… ఏవండీ బంగారాన్ని ఊరుకోపెట్టి ఇప్పుడు మీరు ఇలా అయిపోతే ఎలా చెప్పండి అంటూ డల్ అయిన శేఖర్ గారిని చూస్తూ అంటారు…ఏమో విధి నాకు చిట్టి తల్లి నీ పంపించడం అసలు ఇష్టం లేదు ..ఉన్న ఒక్క కూతురు అంత దూరంగా ఉంటే నేను ఉండగలనా అనిపిస్తుంది …ఒక రెండు రోజులు పోతే అదే ఫోన్ చేసి అక్కడ అలా ఉంది ఇలా ఉంది అంటూ మనతో సంతోషం గా మాట్లాడుతుంది మీరు ధైర్యం గా ఉండండి అంటారు విధి గారు…
ఉదయం ఆరు గంటలు సమయం…..ఆ అమ్మాయి లేచి హెడ్బాత్ చేసి పొడవాటి కురులను టవల్ లో చుట్టి వైట్ కలర్ అనార్కలి వేసుకుని తన రూమ్ బాల్కనీ లో అప్పుడే వచ్చిన సూర్య కాంతికి నిలబడి తన జుట్టు ను ముందు కి వేసి ఆరబెడుతూ ఉంటుంది …బంగారం లేచావా అంటూ కాఫీ కప్ తో వస్తారు విధి గారు … హ అమ్మ అంటుంది ఆ అమ్మాయ్…
సరే నువ్వు ఈ కాఫీ తాగి రెడీ అవ్వు అంటూ ఆ రూమ్ సర్దుతూ కాలేజ్ లో ఎలా వుండాలో బయటకు వెళ్లేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు గురించి చెప్తూ ఉంటారు…ఆ అమ్మాయి కాఫీ తాగి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని రెడీ అవుతుంది .. విధి గారు బెడ్ నీట్ గా సర్ది ఆ అమ్మాయి వెనక నిలబడి జడ దువ్వి లూస్ గా అల్లి లాస్ట్ లో వైట్ కలర్ రబ్బర్ బాండ్ టై చేస్తారు..ఇద్దరు కిందకి వచ్చి కిచెన్ లో ఇంకా కొంచెం మిగిలిన వర్క్ చూసుకుని శేఖర్ గారు , హర్ష వచ్చాక అందరూ కలిసి టిఫిన్ చేసి బయలు దేరి బైక్స్ మీద దగ్గరలో వున్న శివాలయానికి వెళ్తారు… ( హర్ష బాబు కి కూడా బైక్ ఉంది లెండి …ఇంటర్ స్టూడెంట్ కదా..పైగా చిట్టి కి హర్ష కి 1 ఇయర్ డిఫరెన్స్ అంతే..)
శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని నలుగురు నాలుగు కోరికలు కోరుకుని బయటకు వచ్చి అప్పటికే 8 గంటలు అవుతుంటే మళ్ళీ వైజాగ్ స్టార్ట్ అవుతారు … అరగంట లో కాలేజ్ కి పక్కనే ఉన్న హాస్టల్ దగ్గర ఆగి గేట్ దగ్గర వివరాలు చెప్తే జెంట్స్ నీ లోపలికి పంపించమని చెప్పి విధి గారిని మాత్రమే చిట్టి తో లోపలికి అల్లో చేస్తారు…దానికి శేఖర్ గారు , హర్ష హ్యాపీ గా ఫీల్ అవుతారు … అంటే జెంట్స్ కి ఎలో లేదంటే మంచి విషయమే కదా వాళ్ళకి కూడా ఎలాంటి భయం వుండదు ..అందుకే అనమాట…
చిట్టి వాళ్ళు లోపలికి వెళ్ళి తనకి ఇచ్చిన రూమ్ లో లగేజ్ పెట్టి రూమ్ అంత చూస్తారు … సింపుల్ రూమ్ కబోర్డ్స్ తో ఒక సైడ్ టూ బెడ్స్ ఉండి ఆ బెడ్ పక్కన దేనికి దానికే స్టడీ టాబ్లెట్స్ ఉంటాయి ..ఇంకొక సైడ్ అటాచ్డ్ వాష్రూమ్…వెనుక భాగం లో చిన్న సందు ల బాల్కనీ..బట్టలు అరేసుకోవడానికి … చిన్నగా ఉన్న అన్ని వసతులతో ఆ రూమ్ చాలా అందంగా ఉంది ..ఒక బెడ్ మీద ఆల్రెడీ ఎవరో ఉన్నట్టు లగేజ్ పెట్టి ఉంది ..ఇంకా మిగిలిన బెడ్ మీద చిట్టి తన లగేజ్ పెట్టి వాష్ రూమ్ కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి నీట్ గా క్లీన్ చేసుకుని దుపట్ట సరిగా వేసుకుని బ్యాగ్ తీసుకుని విధి గారితో బయటకి వస్తుంది ..ఎలా ఉంది రా రూమ్ ..?? బావుందా లేదంటే దగ్గరలో ఇంకొకటి ఉంది అక్కడ చూద్దాం అంటారు శేఖర్ గారు.. లేదు నాన్న బావుంది అని చెప్పి పక్కనే కాలేజ్ కాబట్టి బై వాక్ వెళ్తారు … గేట్ వరకు వచ్చి అక్కడ నుండి కాలేజ్ ను చూస్తారు…5 అంతస్తులతో లైట్ పింక్ అండ్ వైట్ తో చుట్టూ గ్రీనరీ తో చాలా బావుంది కాలేజ్…చిట్టి అలా చూస్తూ ఉండగా పక్కనుండి ఒక కారు వాళ్ళని క్రాస్ చేస్తూ లోపలికి వెళ్తుంది ……
Swipe left/right or tap the sides to turn pages