The Devil’s promise 😈 – 3
వాళ్లు బ్యాగ్ కిందకి దించారు
అందులో ఒక వ్యక్తి మొహం మొత్తం పచ్చడి అయిపోయి గుర్తుపట్టలేని విధంగా భయంకరంగా ఉంటే వాళ్లు కూడా కొన్ని నిమిషాలు భయపడి తర్వాత వాళ్లకి వాళ్లే ధైర్యం చెప్పుకొని ఆ బాడీని అక్కడి నుంచి తీసేసి ఆ బ్యాగ్ మొత్తాన్ని క్లీన్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు
దయ అక్కడి నుంచి నేరుగా తన రూమ్ లోకి వెళ్లిపోయాడు
కొంతసేపటికి రూమ్ డోర్ బయట నుంచి నాక్ చేయడంతో ఫోన్లో మెయిల్ ఏదో చెక్ చేస్తూనే వచ్చి డోర్ ఓపెన్ చేశాడు దయ
ఎదురుగా 21 సంవత్సరాల తన చెల్లి ఇంకా 24 ఏళ్ల తన తమ్ముడు
వాళ్లని చూడడంతోనే దయా బ్రుకుటి ముడిపడింది
ఏమైంది అడిగాడు దయ
అన్నయ్య మాతో పాటు రా ముందు నువ్వు తన అన్నయ్య చేతిని పట్టుకొని అక్కడి నుంచి టెర్రస్ మీదకి తీసుకొని వెళ్లారు ఇద్దరు
ఏమైంది చిన్ని ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావ్ అడిగాడు దయ సీరియస్గా
అబ్బా అన్నయ్య కామ్ గా ఉండు అని అన్నయ్యని సైలెంట్ గా ఉంచి తన చిన్నన్నయ్య వైపు చూసి కన్ను కొట్టింది
తన చిన్నన్నయ్య గబగబా దయా ముందుకి ఒక కేక్ తీసుకుని వచ్చి హ్యాపీ బర్త్డే అన్నయ్య అంటూ తనని విష్ చేశాడు
ఏంటి ఇది చేయడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా అడిగాడు దయ చాలా అంటే చాలా కోపంగా
అంటే అన్నయ్య అది మరి అంటూ ఉండగానే
ఏంట్రా ఏంటి అన్నయ్య ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏమైనా చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అక్కడే నేల మీద పడేసి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు దయ
అదంతా చూసిన దయ చెల్లి తమ్ముడు ఇద్దరూ చాలా బాధపడ్డారు
చిన్ని వదిలేయవే అన్నయ్య గురించి తెలిసింది కదా మనమే ఎక్కువగా రియాక్ట్ అయిపోయాము అంతేతప్ప ఇంకేం లేదు అన్నాడు తన చిన్నన్నయ్య రుద్ర
ఎందుకు అన్నయ్యకి ఎప్పుడు ఏమి నచ్చవు పోనీ అన్నయ్యకి నచ్చవు వదిలేయ్ పోనీ మన సంతోషం కోసమైనా కూడా ఆలోచించాలి కదా అంటూ మేఘన
సరేలే అన్నయ్య ఏదో టెన్షన్ లో ఉండి ఉంటాడు లే చిన్ని. అందుకే అన్నయ్య అలా రియాక్ట్ అయ్యాడు నువ్వేం బాధపడకు అని చెల్లెల్ని తీసుకొని కిందకి వచ్చాడు రుద్ర
అదంతా చూసిన దయ తల్లి అసలు పెద్దోడు రోజురోజుకీ ఎలా తయారవుతున్నాడు అంటే ఏమీ అర్థం కావట్లేదు లేదు ఒకసారి నేను వెళ్లి మాట్లాడాలి అనుకుంటూ అక్కడి నుంచి కిందకి వెళ్లారు ఆవిడ
నేరుగా పెద్దకొడుకు రూమ్ లోకి వెళ్లి పెద్దోడా అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా పాపం వాళ్లు ఈ రోజు నీ పుట్టిన రోజు అని నీకు కూడా గుర్తులేదు అలాంటిది వాళ్ళు గుర్తు పెట్టుకొని నీ చేత కేక్ కట్ చేయించి వాళ్ళు ఆనందం పొందాలి అనుకున్నారు ఒక రెండు నిమిషాలు కేక్ కట్ చేసి వాళ్ళకి తినిపించేసి వచ్చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్దోడా
ఆ పని కూడా నువ్వు చేయలేకపోతున్నావా అంటూ సీరియస్ గా అడిగారు దయ తల్లి విశాలాక్షి గారు
అమ్మ నేనే నా ఆఫీస్ పెన్షన్ లో ఉన్నాను ఇలాంటి టైం లో వచ్చి అడిగితే ఏం చేయాలి ఎలా రియాక్ట్ అవ్వాలి అది కూడా చెప్పా పెట్టకుండా పైకి తీసుకొని వెళ్తే ఏమనుకోవాలి అడిగాడు దయ సీరియస్గా
నీవల్ల వాళ్ళిద్దరూ బాధపడుతున్నారు వెళ్లి ముందు కేక్ కట్ చేసి రా అన్నారు విశాలాక్షి గారు
సరే వెళ్తున్న అని చెప్పేసి అక్కడి నుంచి కిందకి వెళ్ళాడు దయ
ఇంకొక కేక్ ఆర్డర్ పెట్టి చెల్లిని తమ్ముడిని పిలిచి తల్లిని కూడా పిలిచి వాళ్ళ ముగ్గురు సమక్షంలో కేక్ కట్ చేసి ముగ్గురికి తినిపించాడు
ఇప్పుడు హ్యాపీ ఆ ముగ్గురు అడిగాడు దయ ముగ్గురి వైపు చూస్తూ
మేఘన తన అన్నయ్యని గట్టిగా హగ్ చేసుకుని లవ్ యు అన్నయ్య అని అన్నయ్య బుగ్గ మీద ముద్దు పెట్టింది
దయ పెదాల మీద చిన్న చిరునవ్వు ఇలా వచ్చి అలా మాయమైపోయింది ఆమె నుదుటునా ముద్దు పెట్టుకుని చిన్నగా చెల్లెలి తలనిమిరి తమ్ముడి వైపు చూస్తూ ఎలా సాగుతుంది యూనివర్సిటీలో క్లాసెస్ అడిగాడు దయ
ఆల్ గుడ్ అన్నయ్య పీహెచ్డీకి నిన్న ఎగ్జామ్ రాసాను రిజల్ట్ వస్తే దాన్నిబట్టి జాయిన్ అయిపోతాను అన్నాడు రుద్ర అన్నయ్య వైపు చూస్తూ
సరే వాట్ అబౌట్ యు నేను మిమ్మల్ని మానిటర్ చేయట్లేదు అని అనుకోకండి ప్రతి సెకండ్ మీరిద్దరు నా అండర్ లోనే ఉంటారు అది మాత్రం అస్సలు మర్చిపోకండి
మీరు ఏం చేసినా నీ ప్రతి యాక్షన్ నెక్స్ట్ సెకండ్ నా కంట్లో పడుతుంది జాగ్రత్తగా ఉండండి అంటూ చెల్లి కి తమ్ముడికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు
——–continues……………….
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ
Swipe left/right or tap the sides to turn pages