విలన్ హస్బెండ్ {2}-6

Sravani Naramala

Author

అబ్బా జై వదులు…… ఆ…..!! నన్ను వదులు జై అంటూ జై నుండి తప్పించుకోవడానికి కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆపసోపాలు పడుతూ ఉంటుంది….. !! వీళ్ళ ను బ్రేక్ఫాస్ట్ కి పిలవడానికి పైకి వస్తున్న రేణుక వీళ్ళను చూసి షాక్ తో నోరు తెరుస్తుంది….. !! చిచీ వీళ్ళకు పగలు రాత్రీ తేడా లేదా పట్టపగలు అందరూ ఇంట్లో ఉన్నారు అని కూడా లేకుండా పోయింది వీళ్ళకు….. ?? అని జై & ఆధ్య లను అలా చూసి హాల్ లో సరసాలు ఆడుతున్నారు అనుకుంటుంది రేణుక 😜🤭…… !! జై ❤️ ఆద్య కూడా అప్పుడే అక్కడ రేణుక చూసి షాక్ అవుతూ ఒకరిని ఒకరు చూసుకుంటారు……. ??

ప్చ్ ..!!! చెప్తుంటే అర్థం కావడం లేదా లీవ్ మీ జై అంటూ అరుస్తూ తల పక్కకు తిప్పిన ఆద్య కి తమనే కళ్ళు పెద్దవి చేసి బుసలు కొడుతూ చూస్తూ కనిపిస్తుంది రేణుక…. !! నా కన్నింగ్ అత్త ఎపుడు వచ్చింది అనుకుంటూ 32 పళ్ళు కనిపించేలా నవ్వుతూ జై తలను కూడా రేణుక వైపు తిప్పుతుంది….. !! అలా ఇద్దరూ రేణుక వైపు చూసి షాక్ అవుతూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుతూ జై ఆద్య ను కిందకు దింపగానే రేణుక ను సిగ్గు పడుతూ నుంచుంటారు….. !!