విలన్ హస్బెండ్{2} -102

విలన్ హస్బెండ్{2} -102

Sravani Naramala

Author

జై కళ్ళల్లో కనిపిస్తున్న  నిశ్శబ్దాన్ని & తన కళ్లల్లో ఎగసిపడుతున్న కోపాన్ని  చూడగానే మాయకు కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది……… !! ఊపిరి కూడా ఆడనంతగా గుండె వేగం పెరిగిపోతూ ఉంటే రుద్ర చేతుల్లో   ఉన్న తన చేతులు ఒక్కసారిగా వణికిపోతూ పక్కకు జారిపోయాయి……… !! మాయ ముఖం  టెన్షన్ తో తడిచిపోయి రక్తపు చుక్క లేనట్టు తెల్లబడిపోయింది………. !! ఇన్నాళ్లూ జై కి తెలియకుండా  ఎంతో సీక్రెట్ గా ఉంచిన తమ ప్రేమ గురించి ఇలా బయటపడుతుందని మాయ ఎక్స్పెక్టె చేయలేదు………. !! జై కోపాన్ని కంట్రోల్ చేయడానికి దగ్గర్లో ఆధ్య కూడా కనిపించక పోయేసరికి ఇంకొంచెం టెన్షన్ పడిపోతూ చేతులు నలుపుకుంటూ ఉంటుంది………. !! జై చూపులు రుద్రను సూటిగా చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటాడు…….. !!