విలన్ హస్బెండ్-61

Sravani Naramala

Author

అవునవును చాలా ఇన్నోసెంట్ ఎంత ఇన్నోసెంట్ అంటే….. ?? అంటూ తన మొబైల్ ఓపెన్ చేసి మాదేష్ కి చూపించగానే మాదేష్ కి తన నుంచున్న చోట భూమి చీలిపోయినట్టు అనిపించి నుంచున్న వాడల్ల చైర్ లో కూలబడతాడు….. !! అది చూసిన మహిదర్ నవ్వుతూ ఏంటి మాదేష్ అలా పడిపోయావ్ షాక్ అయ్యేవా ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి అని తన మొబైల్ లో స్క్రోల్ చేస్తూ ఒక్కోటి చూపిస్తూ ఉంటే అప్పటి వరకు నవ్వుతున్న హరిణి కి నుదుటిన చమటలు పడుతుంటాయి అవన్నీ చూసిన రేణుక కూడా షాక్ అవుతుంది….. !!

తన గురించి మొత్తం తెలిసిపోయింది అని కన్ఫర్మ్ అవ్వడం తో హరిణి టెన్షన్ గా మాదేష్ వైపు చూస్తూ ఉంటే అప్పటికే మాదేష్ తన వైపు గుడ్లు ఉరిమి చూస్తూ ఉంటాడు….. !! నేను చెప్తూ నే ఉన్నాను నీకు జై తో మ్యారేజ్ అయ్యే వరకూ ఈ తిరుగుళ్ళు అన్ని తగ్గించి బుద్దిగా ఇంట్లో ఉండు అని విన్నావా ఇప్పుడు అనుభవించు అని హరిణి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది శ్వేత….. !!