ఏసీపీ ధర్మ రూమ్ అంతా చెక్ చేస్తూ స్వర్ణ బుక్స్ కలెక్షన్ దగ్గరికి వెళ్ళాడు… చాలా బుక్స్ ఉన్నాయ్ ఆ కబోర్డ్ లో యద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ.. మీనా… యండమూరి గారి వెన్నెల్లో ఆడపిల్ల… చలం గారి ప్రేమలేఖలు లాంటి నవల పుస్తకాలని చూస్తుంటే పక్కనే స్వర్ణ రాసుకున్న కవితల పుస్తకం కనిపించింది…