ప్రేమలో పడితే – 2
ప్రేమలో పడితే -2
తను వెళ్లేసరికి కరెక్టుగా అదే టైంలో ఒక ట్రైన్ స్పీడుగా వెళ్తూ ఉండటం చూసి తన గుండె ఆగి ఆగి కొట్టుకున్నట్లుగా అనిపించింది. తన వల్ల తన మేనకోడలు చనిపోయింది ఏమో అని భయంతో కంటి నుండి కన్నీరు కారుతున్నాయి. ఆ కన్నీరు వర్షంలో కలిసిపోతున్నాయి అడుగులు తడబడుతుంటే స్టేషన్లోకి వచ్చే చూశాడు.
అక్కడ బెంచ్ మీద ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తన వల్ల తన ఫ్యామిలీ పరువు పోయింది, ఇక పైన తన తండ్రి తన వైపు కన్నెత్తి కూడా చూడడు, తన తండ్రి ప్రేమను ఇక పొందలేను, తన కుటుంబంతో కలిసి ఇక జీవించలేను ఇక నేను కుటుంబాన్ని కోల్పోయినట్లేనా..! ఏ తప్పు చేయని నేను శిక్ష అనుభవించాల్సిందేనా అని బాధలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఒంటరిగా కూర్చుని ఉంది మహాలక్ష్మి..
చనిపోయింది ఏమో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్టేషన్ లోకి వచ్చిన శ్రీహరికి అక్కడ బెంచ్ మీద కూర్చొని పైకి చూస్తూ ఉన్న మహాలక్ష్మి కనిపించడంతో పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లుగా గుండె మీద చేతులు పెట్టుకొని గట్టిగా గాలి పీల్చుకొని మోకాళ్ళ మీద ఒక్క క్షణం అలా చేతులు పెట్టుకుని నిలబడి ఆ తర్వాత నిదానంగా నడుచుకుంటూ మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు.. కానీ ఏమీ మాట్లాడలేదు
శ్రీహరి కూర్చున్న పది నిమిషాల తర్వాత తల పక్కకు తిప్పి చూసిన మహాలక్ష్మికి అక్కడ తన మామయ్య తన వైపే చూస్తూ కనిపించడంతో “నువ్వైనా నేను తప్పు చేయలేదు అని నమ్ముతున్నావా..?” అని అడిగింది.
“నేను ఎప్పుడూ నీ పక్కన అండగానే ఉంటాను రా. నా కోడలు తప్పు చేసింది అంటే నేను ఎలా నమ్ముతాను. పది మందితో మంచిగా ఉంటూ పదిమంది మంచి కోరుకునే తను ఎప్పుడు తప్పు చేయదు. ఎక్కడ ఏం జరిగిందో నేను తర్వాత తెలుసుకుంటాను, కానీ నువ్వు ఇలా వచ్చేయడం కరెక్ట్ కాదు కదా..;” అని బేలగా అడిగాడు. తను పుట్టిన తరువాత తన మామయ్య అలా బేలగా నిస్సహాయంగా అడగడం ఇదే మొదటిసారి.
“ఏం చేయను మామయ్య నేను ఉంటే నావల్ల నీకు కూడా మాటలు వస్తాయి. నేను ఏ తప్పు చేయకపోయినా శిక్షని నా తండ్రి నుండి పొందాను. ఆడపిల్లకి తండ్రి నుండి ప్రేమ సెక్యూరిటీ దొరుకుతుంది కానీ నాకు మాత్రం అవమానం నింద, చెడ్డది అనే పేరు దక్కింది.
నిజంగా ఆడపిల్ల లైఫ్ లో అండగా ఉండాల్సిన సమయంలోనే పరువు ప్రతిష్ట అంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఎందుకు చేస్తారో ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఇక నా జీవితం కూడా ఇంతే నాన్న నన్ను క్షమించి దగ్గరకు తీసుకుంటారు అన్న ఆశ చచ్చిపోయింది” అని శ్రీహరి భుజం మీద వాలిపోయి అన్నది.
“అదేంటిరా అలా మాట్లాడతావ్, జరిగింది నిన్న, బావకు తెలిసింది ఈరోజు ఇంటిలో నుంచి బయటకు వెళ్లిపొమ్మని చెప్పింది ఇప్పుడు, ఇంతలోనే అంత నిరాశగా ఎలా మాట్లాడుతున్నావ్?” అని మహాలక్ష్మి చుట్టూ చేతిని వేసి ఆమె మనసులో ఉన్నది ఏంటో తెలుసుకోవటానికి అడిగారు.
“నువ్వు ఏ తప్పు చేసావో నాకు తెలియదు మామయ్య. కానీ నాన్న మాత్రం నిన్ను ఇప్పటికి దూరం పెడుతూనే ఉన్నారు కదా, నిన్ను క్షమించారా లేదు కదా, ఇక నన్ను ఎలా క్షమిస్తారా..? నాన్న చాలా మొండి వారు. నాకు తెలుసు ఇక జీవితాంతం వాళ్ళ జ్ఞాపకాలే నాకు మిగిలాయి అందరు ఉన్న ఒంటరి దానిని అయిపోయాను” అని శ్రీహరి నుండి దూరం జరుగుతూ స్ట్రైట్ గా కూర్చుంటూ చెప్పింది.
“మీ నాన్నకి నేను నువ్వు ఒకటే నంటారా..! కచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను క్షమించి దగ్గరకు తీసుకుంటారు. అంతకు మించి నువ్వు ఏ తప్పు చేయలేదు అని అర్థం చేసుకొని నిన్ను ప్రేమగా ఇంతకుముందులా దగ్గరకు తీసుకుంటారు” అని మహాలక్ష్మిని దగ్గరకు తీసుకుంటూ నుదుటిమీద ముద్దు పెట్టి చెప్పారు.
“ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మామయ్య త్వరగా రావాలి అని కోరుకుంటున్నాను” అని విరక్తిగా అన్నది మహాలక్ష్మి.
ఎందుకంటే తన నాన్న మొండితనం గురించి తనకు బాగా తెలుసు ఏదైనా ఒకటి నమ్మారు అంటే ఇక ఎవరు ఎన్ని చెప్పినా సరే అది కాదు అని చెప్పరు అంత మొండి అలాంటి జగమొండిని మార్చడం కష్టం కాదు అసాధ్యం అని కూడా తెలుసు.
ఐదు నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం ఆ తర్వాత మహాలక్ష్మిని దూరం జరిపి పేస్ ని రెండు చేతుల్లోనికి తీసుకొని “ఒక్క క్షణం నువ్వు రైల్వే స్టేషన్ కి వచ్చావు అని తెలిసి, అంతకు మించి నేను వచ్చే ముందే రైల్ అలా వెళుతుంటే నాకు ప్రాణం పోయినంత పనైంది తెలుసా..;” అని అన్నారు
“నేను చనిపోయాను అనుకున్నావా..?” అని ఫేసులో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా బేలగా అడిగింది.
అవును అని చెప్పలేక కాదు అని మనసుని చంపకోలేక అలా మౌనంగా కన్నీళ్ళతో చూసారు శ్రీహరి..
“నాకు నువ్వు ధైర్యంగా ఉండటం ఎలాగో నేర్పించావు, కానీ చనిపోవడం ఎలాగో నేర్పించలేదు కదా మామయ్య” అని మహాలక్ష్మి నోటి నుంచి మాట వచ్చిన మరుక్షణం ఆమెను తన గుండెలకు హత్తుకుని గట్టిగా ఏడ్చేశారు శ్రీహరి..
మహాలక్ష్మీ మామయ్య అంటూ గట్టిగా వెక్కిళ్లు పెట్టి మరి ఏడుస్తూ “నేను చనిపోతే, ఒకవేళ నేను తప్పు చేయలేదు అని నాన్నకు తెలిస్తే నాన్న నా దగ్గరకు రాలేడు కదా, అప్పుడు నాన్న తప్పు చేశాను అని ఏడుస్తారు, అది నాకు ఇష్టం లేదు మామయ్య. అందుకే అందుకే చనిపోవాలి అని ఇక్కడ వరకు వచ్చిన నేను చనిపోలేకపోయాను” అని అన్నది.
“వద్దురా వద్దు నువ్వు ఎప్పుడు ఇలాంటి ఆలోచన కూడా చేయొద్దు. నీకు తోడుగా నేను ఉంటాను. ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడే నువ్వు నిలబడాలి. నువ్వు తప్పు చేశావు అని మీ నాన్న ఎక్కడైతే అనుమానించారో అక్కడే అక్కడే నువ్వు నీ తప్పులేదు అని నిరూపించుకుని మీ నాన్నకి చూపించాలి, పద వెళ్దాం” అంటూ శ్రీహరి పైకి లేచి మహాలక్ష్మి చేతిని పట్టుకొని అన్నారు..
“అది జరుగుతుంది అంటావా మామయ్య” అని మనసులో తన మామయ్య మాటలకి ఆశ చిగురిస్తుంటే కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది.
“కచ్చితంగా జరుగుతుంది రా” అని చెప్పి మహాలక్ష్మిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
కరెక్ట్ గా ఆరు సంవత్సరాల తర్వాత “శ్రీ త్వరగా లే ఈరోజు ఆఫీస్ లో ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంది. టీం లీడర్ గా నువ్వే దాన్ని ఇనిషియేట్ చేయాలి అని చెప్పావు కదా ఇంకా ఎంతసేపు పడుకుంటావు రా” అని శ్రీ మహాలక్ష్మి కప్పుకున్న దుప్పటిని తీస్తూ అన్నారు శ్రీహరి.
“తాడిచెట్టు ప్లీజ్ కాసేపు నేను పడుకుంటాను, నిద్ర వస్తుంది అయినా నాకు ఇలా ఆఫీసుకు వెళ్లి వర్క్ చేయాలి అని లేదు.. నేను కూడా నీతో పాటు లైబ్రరీలోనే ఉండిపోతాను” అని మరో వైపుకు తిరిగి పడుకొని అన్నది మహాలక్ష్మి.
“సరే సరే ఈ ఒక్కరోజు ఆఫీస్ కి వెళ్ళు రేపటి నుంచి నువ్వు వెళతాను అన్న నేను పంపించినులే” అనే మహాలక్ష్మి ని నిద్ర లేపి వాష్ రూమ్ లోనికి పంపించి డోర్ క్లోజ్ చేశారు శ్రీహరి.
కొనసాగుతుంది.
కొన్నిసార్లు ఎందుకో స్టోరీ రాయాలి అన్న రాయాలి అనిపించదు కానీ బ్రెయిన్ లో తిరుగుతున్న ఆలోచనలకి రాస్తే ఒక పని అయిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది.
Swipe left/right or tap the sides to turn pages