సోఫా వెనుక నుంచి పిల్లిలా పాక్కుంటూ బయటికి వచ్చిన లక్కీ కనబడ్డాడు. వెంటనే వికాస్ ను బయటికి పొమ్మనింది మీ ఇద్దరి మధ్యలో నేను ఎప్పుడు అడ్డమే కదా అని గుర్రుమంటూ కాఫీ కప్ తో వికాస్ బయటకు వెళితే తను కూడా వాష్ ఏరియాలోకి వెళ్ళింది. పాక్కుంటూ కిచెన్ వరకు వచ్చిన లక్కీ అక్కడ చైత్ర కనబడక పోవడంతో నెమ్మదిగా లేచి మోకాళ్ళ మీద చేతులతో పప్పీ లా నడుస్తూ వాష్ ఏరియాలోకి తొంగి చూసాడు. అక్కడ పిట్ట గోడ మీద నుంచి లక్కీ కోసం కింద వెతుకుతున్న…