New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
జ్వాలా ప్రజ్వలనం – 4

జ్వాలా ప్రజ్వలనం – 4

వీర్ వెటకారంగా ఏంటి “నీ కళ్లతోనా?”

అని అనడంతో రాహుల్ మళ్ళీ అలుకమొహం వేసుకొని సైలెంట్ గా కూర్చుంటాడు 

 

రాహుల్ ని ఆలా చూసి వీర్ నవ్వుకుంటున్నప్పుడే అప్పుడే హాల్‌లోకి అడుగుపెట్టింది జ్వాలా..

 

ఆమెను చూడగానే వీర్ చూపు క్షణం పాటు ఆమె మీద నిలిచిపోయింది..

చేతిలో కొన్ని ఫైల్స్ పట్టుకుని, తన కో సైంటిస్ట్ లతో మాట్లాడుతూ స్టేజ్ వైపు వెళ్తోంది.. ఆమె..

 

ఆ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. తన పరిశోధన మీద ఉన్న నమ్మకం ఆమె నడకలోనే కనిపిస్తోంది..

 

మరో వైపు ఆడియన్స్ మధ్యలో వున్నా కావ్య జ్వాలా రావడం చూసి చిన్నగా అక్క అని అరవడం విన్న రాహుల్ కళ్ళు పెద్దవి చేసి తన ముందే వున్నా కావ్యని ఆనందంగా చూస్తాడు..

 

వీర్ మాత్రం తన చేతిలో ఉన్న టాబ్లెట్‌లో జ్వాలా ఫోటోను సీక్రెట్ గా తీసి.. ఆ ఫొటోను మరోసారి చూసి,ఎదురుగా వున్నా జ్వాలాని గమనిస్తాడు..

 

అప్పుడే జ్వాలా తన తీసిస్ సెమినార్ స్టార్ట్ చేస్తుంది..

కావ్య జ్వాలా సెమినార్ ని తన పేరెంట్స్ కి చూపించడానికి మొబైల్ లో రికార్డ్ చేస్తుంది..

 

“గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్!”

అంటూ మైక్ అందుకుంది జ్వాలా.

 

“ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న పరిశోధన పేరు సెల్యులార్ రెసిలియన్స్.. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, రేడియేషన్, అలాగే కొన్ని విషపూరిత వాతావరణ పరిస్థితుల వల్ల మానవ కణాల్లో కలిగే మార్పులను అర్థం చేసుకోవడం, వాటి నుంచి కణాలు కోలుకునే విధానాలను అధ్యయనం చేయడమే నా పరిశోధన ప్రధాన ఉద్దేశం.”

 

అంటూ స్క్రీన్ మీద తన రీసెర్చ్ కి సంబంధించిన కొన్ని గ్రాఫ్స్ ని చూపించింది..

 

 

 

జ్వాలా మాట్లాడుతూ “ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలు, రేడియేషన్ థెరపీ తర్వాత ఆరోగ్యకరమైన కణజాలానికి కలిగే నష్టాన్ని తగ్గించే దిశగా నా పరిశోధన సాగుతుంది.. ఈ పరిశోధన మానవాళికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను .” అని అంటున్నా 

 

ఆమె వివరించే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది.

 

వీర్ మాత్రం ఆమె మాటలకంటే ఎక్కువగా ఆమె చూపిస్తున్న డేటా మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు..

 

కొన్ని గ్రాఫ్స్‌ను గమనించిన అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి.

 

ఒకే పరిశోధనకు సంబంధించిన డేటాలో రెండు వేర్వేరు యాక్సెస్ రికార్డులు కనిపిస్తున్నాయి.. అది సాధారణ విషయం కాదు.

 

వీర్ వెంటనే తన టాబ్లెట్‌లో కొన్ని వివరాలను నోట్ చేసుకున్నాడు.

 

ఇంతలో ఒక సీనియర్ సైంటిస్ట్ జ్వాలాను ప్రశ్నించాడు.

 

“డాక్టర్ జ్వాలా! మీ పరిశోధన భవిష్యత్తులో ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు?”అని అడుగుతారు..

 

జ్వాలా చిరునవ్వు నవ్వుతూ..

 

“ఎస్ సార్, మీరు రైజ్ చేసిన క్వశ్చన్ వాలిడ్ నె.. ఒక ప్రయోగం యొక్క ఉపయోగం తెలిస్తేనే ఆ ప్రయోగం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది అని..

 

నా రీసెర్చ్ ఎలా ఫ్యూచర్ లో యూస్ అవుతుంది అనే మీ ప్రశ్నకి నా సమాధానం.. 

 

ఇప్పుడు వున్నా వాతావరణ పరిస్థితులు గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరిగే ఉష్ణోగ్రతలు, రేడియేషన్ ప్రభావం, అలాగే పునరుత్పత్తి చెందని న్యూరల్ లేదా మెమొరీ సెల్స్ ఎదుర్కొనే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వంటివి నిజంగానే మన ముందున్న పెద్ద సవాళ్లు..

 

అయితే, నా ‘సెల్యులార్ రెసిలియన్స్’ ప్రాజెక్ట్ ద్వారా ప్రస్తుతానికి ప్రధానంగా సెల్యులార్ లెవెల్‌లో జరిగే DNA రిపేర్ మెకానిజమ్స్ మరియు హీట్ షాక్ ప్రోటీన్ల స్పందనలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది..

 

అయినప్పటికీ, భవిష్యత్తులో నా రీసెర్చ్ మరింత విస్తృతమైతే, ఈ మల్టీపుల్ రూట్స్ వల్ల కణాలు దెబ్బతినకుండా ఆపడానికి ఇది ఒక బలమైన సైంటిఫిక్ ఫౌండేషన్ వేయగలదని నేను భావిస్తున్నాను.”

 

“సర్! ఒక పరిశోధన విజయవంతమైందని చెప్పడానికి అది గొప్పగా కనిపించడం ఒక్కటే సరిపోదు. దాని వల్ల కలిగే ప్రయోజనాలే ఆ పరిశోధనకు నిజమైన అర్దాన్ని తీసుకువస్తాయి అని “అంటూ తన సమాధానం ముగించింది జ్వాలా.

 

ఆమె మాటలకు హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది.

 

ఆమె వైపు చూస్తున్న వీర్ పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు మెరిసింది..

 

అలా సీనియర్ సైంటిస్ట్స్ ఒక్కొక్కరుగా అడుగుతున్న అన్ని క్వశ్చన్స్ కి కాన్ఫిడెంట్ గా ఆన్సర్స్ ఇస్తుంది జ్వాలా..

 

ఇక సెమినార్ ఫినిష్ అవ్వడంతో జ్వాలా స్టేజ్ దిగి కిందికి వెళ్ళగా కావ్య, సిద్దు ఇంకా నందులు జ్వాలాని చుట్టూముట్టి వాళ్ళ హ్యాపీనెస్ ని కూడా షేర్ చేసుకుంటారు..

 

కావ్య నవ్వుని చూస్తున్న రాహుల్ పెదవులు కూడా ఆటోమేటిక్ గా నవ్వితే.. జ్వాలాని హత్తుకున్న సిద్ధుని మాత్రం జెలస్ తో చూస్తాయి వీర్.. నయనాలు..

 

జ్వాలా మాత్రం ఫుల్ హ్యాపిగా ఉంటే.. కావ్య అంతకన్నా హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఆ న్యూస్ ని రాఘవన్ గారికి ఇంకా సుమిత్ర గారికి షేర్ చేస్తుంది..

 

జ్వాలాని హత్తుకున్న కావ్య అక్క సెమినార్ మాత్రం అదరగోట్టేసావే.. ఈ రేంజ్ సక్సెస్ కి నాకు బ్రౌని ట్రీట్ సరిపోదు నైట్ డిన్నర్ పార్టీ చేసుకుందాం అని అంటుంది..

 

నందు కూడా హా కావ్య తప్పకుండా ఈసారి ఎలాగైనా మీ అక్కతో ఖర్చు పెట్టించాలి అని అనడంతో..

 

సిద్దార్థ్ ఐతే ఓకే నైట్ డిన్నర్ కోసం రెస్టారెంట్ లో సూట్ బుక్ చేస్తాను ఆఫ్టర్ డిన్నర్ పబ్ కి కూడా వెళ్దాం అని.. 

 

జ్వాలా పేరు మీదే డిన్నర్ ఇంకా పార్టీ కోసం అన్ని అరెంజ్మెంట్స్ చేస్తాడు సిద్దార్థ్..

 

జ్వాలా అండ్ కావ్యతో క్లోజ్ గా వున్నా సిద్దార్థ్ ని చూస్తూ రాహుల్ ఓపెన్ గా.. వీర్ మనసులో కుళ్ళుకొగా..

 

తనని చాలా సమయం నుండి ఎవరో చూస్తున్నట్టు అనిపించడంతో.. జ్వాలా ఒకసారి చుట్టూ చూస్తుంది..

 

అప్పుడే రాహుల్ అండ్ వీర్ వాళ్ళ ఫేస్ లని మాస్క్ లతో కవర్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు..

 

జ్వాలాకి లెట్ అవ్వుద్ది అనడంతో కావ్య తన ఫ్రెండ్స్ తో కలిసి బయటికి లంచ్ కి వెళ్లగా..

 

ఈవినింగ్ వరకు వుండే సెమినార్స్ కోసం నందు, సిద్దార్థ్ ఇంకా జ్వాలా ల్యాబ్ లోనే ఉంటారు..

 

ల్యాబ్ లో వర్క్ అయిపోయాక.. నందు జ్వాలాని చూస్తూ డిన్నర్ పార్టీ గురించి అడగడంతో.. సిద్దు నందినితో నువ్వు రెడీ అయ్యి ఉండు నందు నేను పిక్ చేసుకుంటాను అని..

 

జ్వాలను ని చూస్తూ టైమ్ అండ్ వెన్యూ చెప్పి.. ఇంకో టూ హౌర్స్ లో రావాలి తల్లి లేదు అంటే నేను మీ ముగ్గురిని వదిలేసి ఎంచక్కా పబ్ కి వెళ్తాను అనడంతో..

 

జ్వాలా ఇంకా నందు ఇద్దరు కూడా సిద్ధుని కొడతారు.. వాళ్ళు రెడీ అవ్వడానికి టైమ్ తీసుంటారు అని వెక్కిరిస్తుంటే..

 

సిద్దు నవ్వుతూ ఓకే.. ఓకే.. చాలు ఇక్కడే లెట్ అయ్యేలా వుంది అని చెప్పి.. జ్వాలా కార్ లైన్ వస్తుంది అని తెలిసి..

 

నందిని చూస్తూ.. మేడం మిమ్మల్ని ఏమైనా డ్రాప్ చేయమంటారా అని పోలైట్ గా అడిగితే..

 

నందు సిద్ధుని చూస్తూ ఎస్ ప్లీజ్ అని అంటుంది.. నందుని కొట్టేసేలా చూస్తూ.. డైలీ నిన్ను పిక్ అప్ డ్రాప్పింగ్ చేయడమే నా పని ఐయిందే..

 

పర్సనల్ డ్రైవర్ ని చేసి ఆడుకుంటున్నావ్ రాక్షసి అని అంటూ.. జ్వాలాని సేఫ్ గా ఇంటికి వెళ్లి ఆ చిట్టీ రాక్షసిని తీసుకొని త్వరగా రారా అని చెప్పి..నందుని తీసుకొని వెళ్తాడు సిద్దు..

 

వెళ్తున్న నందుని,సిద్ధుని చూస్తూ.. నవ్వుకుంటూ తను కూడా ఇంటికి వెళ్తుంది జ్వాలా..

 

జ్వాలా ఇంటికి వెళ్లేసరికి కావ్య ముందే ఇంటికి వస్తుంది ఆఫ్టేర్నూన్ డిన్నర్ పార్టీ కోసం తనకి ఇంకా జ్వాలా నందు ఇంకా సిద్దార్థ్ కోసం..

 

బయట లంచ్ చేసాక షాపింగ్ చేసి.. నందు డ్రెస్స్ ని నందు వాళ్ళ అడ్రెస్ కి సిద్దు డ్రెస్స్ సిద్దు అడ్రెస్ కి సెండ్ చేసి..

 

తిరిగ్గ ఇంటికి వచ్చాకా.. జ్వాలా ప్రెసెంటేషన్ గురించి తన పేరెంట్స్ కి చెప్తూ.. వాళ్ళు నైట్ డిన్నర్ పార్టీకి వెళ్తున్నట్టు చెప్పి..

 

తన పేరెంట్స్ ఇద్దరిని కూడా ఇంట్లోనే కాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసుకోండి అని చెప్పి..

 

టెర్రస్ మీద ఆ ఏర్పాట్లు కూడా చేసిన కావ్య.. జ్వాలా ఇంటికి వచ్చే లోపు అన్ని ఆరెంజ్మెంట్స్ చేసి పార్టీకి రెడీ అవ్వడానికి అని తన రూమ్ కి వెళ్తుంది..

 

జ్వాలా ఇంట్లో కనిపిస్తున్న ప్లేసెంట్ ఫీల్ కి సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న రాఘవన్ గారిని చూస్తూ..

 

ఏంటి నాన్న ఇంట్లో ఏదో తెలియని ప్లేసెంట్ ఫీలింగ్ తెలుస్తుంది ఏంటి సంగతి అని అనడంతో..

 

రాఘవన్ గారు జ్వాలాని దగ్గరికీ తీసుకుంటూ.. అంతా కవి పనేరా కన్నమ్మ అని అంటూ..

 

కావ్య చేసిన షాపింగ్ నుండి నైట్ వాళ్ళ కోసం చేసిన కాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ గురించి కూడా చెపుతూ..

 

మీ మమ్మీ కిచెన్ లో డిన్నర్ కోసం నాకు నచ్చే డీషెస్ చేస్తుంది.. ని చెల్లెలు ఇప్పుడే డిన్నర్ మీద డెకొరేషన్ అంతా చేసి ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళింది రా అని అనడంతో..

 

చెల్లలు చేసిన పనికి మనసులో మెచ్చుకున్నా జ్వాలా రాఘవన్ గారిని చూస్తూ.. మరి మీరేం చేస్తారు నాన్న..

 

అమ్మ మీకోసం మీకు నచ్చిన డీషెస్ చేస్తుంది కవి ఏమో కాండిల్ లైట్ డిన్నర్ కోసం డెకొర్ చేసింది అని అంటూ..

 

హ్మ్మ్ నువ్వు, నేను మాత్రమే ఏమ్ చెయ్యట్లేదు నాన్న అని డల్ గా అంటే..

 

ఈసారి వాళ్ళిద్దరికీ ఛాన్స్ ఇద్దాం కన్నమ్మ.. నెక్స్ట్ టైమ్ మనం సర్ప్రైస్ చేద్దాం లే..

 

వాళ్ళు అది చేశారు అని మనం కూడా ఏదోటి చేయాలి అనుకుంటే అది ఒక షేరింగ్ ఫీల్ వస్తుంది రా..అని అంటారు..

 

మనం వాళ్ళ ఎఫర్ట్స్ ని ఫీల్ అవ్వలేము అని అంటూ.. మనం కూడా వాళ్ళ కోసం ఇంకో రోజు ఏదైనా స్పెషల్ గా ప్లాన్ చేద్దాం అని అంటారు..