New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
జ్వాలా ప్రజ్వలనం – 5

జ్వాలా ప్రజ్వలనం – 5

వాళ్ళు అది చేశారు అని మనం కూడా ఏదోటి చేయాలి అనుకుంటే అది ఒక షేరింగ్ ఫీల్ వస్తుంది రా..అని అంటారు..

 

మనం వాళ్ళ ఎఫర్ట్స్ ని ఫీల్ అవ్వలేము అని అంటూ.. మనం కూడా వాళ్ళ కోసం ఇంకో రోజు ఏదైనా స్పెషల్ గా ప్లాన్ చేద్దాం అని అంటారు..

బాగా టైర్డ్ గా కనిపిస్తున్నావు వెళ్ళు వెళ్లి నువ్వు కూడా ఫ్రెషప్ అయ్యి రెడీ అవ్వు మళ్ళీ లెట్ చేసావ్ అంటూ అలుగుతుంది ని చెల్లి అని అంటారు..

 

అప్పుడే జ్వాలా రావడం తెలిసి జ్వాలా కోసం కాఫీ తీసుకొని వస్తారు సుమతి గారు..

 

థాంక్స్ మా అని కాఫీ కప్ తీసుకొని తాగిన జ్వాలా ఖాళీ కప్ సుమతి గారికి ఇచ్చి ఫ్రెషప్ అవ్వడానికి రూమ్ లోకి వెళ్తుంది జ్వాలా..

 

తన బెడ్ మీద రేడ్ కలర్ మిని ఫ్రాక్ ని చూస్తూ డిన్నర్ పార్టీకి ఇది అవసరమా అనుకున్న జ్వాలా.. వేసుకొకపోతే కావ్య అలుగుతుంది అని తెలిసి..

 

అదే ఫ్రాక్ లో ఫాస్ట్ గా రెడీ అయ్యి బయటికి వస్తుంది.. ఇటు కావ్య కూడా రాయల్ బ్లూ కలర్ సేమ్ మోడల్ మిని లో రెడీ అవుతూ..

 

నందు ఇంకా సిద్దు నుండి వచ్చిన కాల్స్ కి తనే డ్రెసెస్ సెండ్ చేశాను అని అవే వేసుకొని రావాలి అని సీరియస్ గా చెప్పి.. నందుకి కొన్ని ఇంస్ట్రుక్షన్స్ ఇచ్చాకా..

 

సిద్ధుని ఫాస్ట్ గా నందుని పిక్ అప్ చేసుకొని రమ్మని చెప్తూ బయటికి వస్తుంది..

 

ఇటు జ్వాలా అటు కావ్య ఇద్దరు కూడా ఒకేసారి బయటికి రావడంతో.. రాఘవన్ గారు ఇద్దరు సుమతి గారు.. జ్వాలా ఇంకా కావ్య ఇద్దరిని రెప్పవేయక చూస్తారు..

 

గులాబీలా జ్వాలా.. నీలి కలువలా కావ్య ఇద్దరిని కన్నుల నిండుగా చూస్తూ దిష్టి తీస్తారు సుమతి గారు..

 

 

 

రాఘవన్ గారు జ్వాలా ఇంకా కావ్యల పిక్స్ తీసుకొని మురిసిపోతే.. కావ్య ఫ్యామిలీ పిక్స్ కూడా తీసుకొని..

 

వాళ్ళు వచ్చే వరకు లెట్ అవుతుంది అని చెప్పి.. వాళ్ళ కాండిల్ లైట్ డిన్నర్ బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి.. జ్వాలా ఇంకా కావ్య ఇద్దరు కలిసి డిన్నర్ పార్టీకి స్టార్ట్ అవుతారు..

 

అటు నందిని కూడా వైన్ కలర్ ఫ్రాక్ లో రెడీ అయితే సిద్దు కూడా క్రీమ్ కలర్ ట్రోజర్ వైన్ కలర్ షర్ట్ లో హ్యాండ్సమ్ లుక్ లో నందుని పిక్ అప్ చేసుకోవడానికి వెళ్లి..

 

నందుని చూసి అలానే స్టన్ అయ్యిపోతాడు అతడి చూపులకి బిడియంగానే చూస్తూ.. కార్ లో కూర్చుంటుంది నందు..

 

ఆమెని కొన్ని క్షణాలు క్షుణ్ణంగా పరిశీలించి కావ్య నుండి కాల్ రావడంతో డైవర్ట్ అవుతూ నందు నుండి చూపు మరల్చుకుంటూ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ తను బుక్ చేసిన రెస్టారెంట్ దగ్గరికీ వెళ్తాడు..

 

@@@

 

ఎప్పుడు అయితే కావ్య డిన్నర్ పార్టీ ఇంకా పబ్ అని అందో రాహుల్ ప్రజ్వల్ ని బ్రతిమిలాడి.. ప్రజ్వల్ రాను అంటే చివరికి బ్లాక్మెయిల్ చేసి పిడించి చివరికి ఒప్పించి..

 

సిద్దార్థ్ ఏ రెస్టారెంట్ డిన్నర్ ప్లాన్ చేశాడో అదే రెస్టారెంట్ లో వాళ్ళకి కూడా టేబుల్ బుక్ చేసిన రాహుల్..

 

కావ్య వాళ్ళ కంటే ముందు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు.. మరో వైపు ప్రజ్వల్ కి అదంతా అసహనంగా అనిపిస్తుంటే…

 

రాహుల్ ని తిట్టుకుంటూ ఎంట్రన్స్ వైపు చూసిన ప్రజ్వల్ బ్రెయిన్ ఒక్కసారి షాక్ అవుతుంది.. వేల గులాబీలు ఒకటిగా చేరి నడిచి వస్తున్నాయా అన్నట్టుగా కావ్యతో నవ్వుతూ మాట్లాడుతూ వస్తున్న జ్వాలాని చూడగానే 

 

స్కిడ్ అవుతున్న హార్ట్ ని గట్టిగా హోల్డ్ చేస్తూ.. నేను ఇందుకే డిన్నర్ కి రాను అనుకున్నాను.. ఈ రాక్షసి నన్ను మాయ చేస్తుంది అని అనుకుంటూ..

 

తన డ్రెస్స్ ఎరుపు మెరుపులో అందంగా మెరుస్తున్న ఆ రోజీ పేటల్ లిప్స్ నే చూస్తున్న ప్రజ్వల్ ఉఫ్ అనుకుంటూ చూడకూడదు చూడకూడదు అంటూ జ్వాలానే రెప్ప వేయక చూస్తుంటే..

 

ఇటు రాహుల్ పరిస్థితి అందుకు అతితం కాదు.. రాయల్ బ్లూ ఫ్రాక్ లో బట్టర్ ఫ్లై లా వున్నా కావ్యని చూస్తూ రెప్ప వేయడం మరిచిపోతాడు రాహుల్..

 

జ్వాలా ఇంకా కావ్య ఇద్దరు కూడా రాహుల్ ఇంకా ప్రజ్వల్ ని పట్టించుకోకుండా వాళ్ళని క్రాస్ చేస్తూ వెళ్తుంటే ఊపిరి అక్కడే ఆగిపోతున్న ఫీలింగ్ వస్తుంది రాహుల్ ఇంకా ప్రజ్వల్ కి..

 

వాళ్ళిద్దరికీ ఆపొసిట్ టేబుల్ లో కూర్చున్న జ్వాలా ఇంకా కావ్య ఇద్దరు కూడా ఇంకా రాని సిద్దు ఇంకా నందు కోసం చూస్తారు..

 

లెట్ గా వస్తే ముగ్గురిని వదిలేసి పబ్ కి వెళ్తా అన్నవాడు ఇంకా రావట్లేదు ఏంటి అని సిద్దుకి కాల్ చేస్తుంది జ్వాలా..

 

కాల్ రింగ్ అవుతూంటే సిద్దు ఎత్తకపోవడం చూసి.. మళ్ళీ కాల్ చేస్తుంది..

 

మరోవైపు నందిని పిక్ అప్ చేసుకొని రెస్టారెంట్ కి వచ్చిన సిద్దు దారి పొడువుగా నందుని చూస్తూనే ఉంటాడు..

 

సెల్లార్ లోకి వచ్చాకా కార్ ఆఫ్ చేసిన సిద్దు నందిని దిగాలి అని చూసేలోగా ఆమెని తన ఒళ్ళోకి లాక్కుంటాడు..

 

సిద్దు ఆలా చేస్తాడు అని ఉహించిక సిద్దు భుజాలని గట్టిగా పట్టుకున్న నందు.. తన పెదాలనే చూస్తున్న సిద్దు చూపుకి గూటకలు మింగుతూ దూరం జరగాలి అని చూసేలోపు..

 

ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా గట్టిగా ఇద్దరి పెదాలని ముడి వేస్తాడు సిద్దార్థ్.. ముందు గింజకున్న మనసైనా వాడు మనువాడే వాడు ఇస్తున్న ముద్దుకి సిద్దుకి సహకరిస్తుంది నందు..

 

క్షణాలు కరిగి నిమిషాలు గడుస్తున్న ఆ ముద్దు మైకం ఇద్దరిని వదలకుంటే.. వాళ్ళని డిస్టర్బ్ చేసేలా కాల్ వస్తుంది జ్వాలా నుండి..

 

మొదటి కాల్ మీ ఇగ్నోర్ చేసిన కాని.. మళ్ళీ మొబైల్ రింగ్ అవ్వడంతో జ్వాలా నేమ్ చూసి.. నందు పెదాలని వదిలి కాల్ లిప్ట్ చేస్తూ హా చెప్పారా అని అంటాడు సిద్దు..

 

బోటనా వేలితో నందు పెదవులని జెంటిల్ గా రబ్ చేస్తూ  

అటు వైపు నుండి జ్వాలా ఎక్కడ వున్నావ్ రా మెము వచ్చి చాలా టైమ్ అవుతుంది అని చెప్పడంతో..

 

నందు హెయిర్ సెట్ చేస్తూ హ మా వచ్చేస్తున్నా ఆల్రెడీ పార్కింగ్ లో వున్నాను రా అంటూ..

 

వస్తున్న అంటూ కాల్ కట్ చేసి నందిని వైపు చూస్తాడు ఆమె ఓకే అని అనుకున్నాక తన డ్రెస్స్ కూడా సెట్ చేసుకున్న సిద్దు నందుని తీసుకొని లోపలికి వెళ్లేసరికి..

 

కావ్య అందరికోసం ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళ కోసం కోపంగా చూస్తుంటే.. కావ్య కోపం తగ్గించడానికి..

 

పక్క టేబుల్ మీద వున్నా బ్లూ లిల్లి ఇంకా రోజ్ తీసుకున్న సిద్దు జ్వాలా ఇంకా కావ్యలకి ఇచ్చి సారి మై డియర్ బేబీస్ అని చెప్తుంటే..

 

నందు నాకు ఇవ్వాలెదు అని గుర్రుగా చూస్తుంటే.. తమ టేబుల్ మీద వున్నా ఫ్లవర్స్ తీసుకొని వాళ్ళు ఇష్టపడే అమ్మాయిలకే ఇస్తుంటే..

 

సిద్దుని కుమ్మేసేలా చూస్తారు రాహుల్ ఇంకా ప్రజ్వల్.. 

 

కావ్య ఫ్లవర్స్ తో నన్ను కూల్ చేయలేరు అని అంటే నవ్వతూ పాంట్ ప్యాకెట్ నుండి చాకొబార్ చోక్లేట్ తీసిన సిద్దు దీనితో కూల్ అవుతుంది అనుకుంట ఆ అల్లరి రాకాసి అని అంటే..

 

చాకొబార్ ని చుసిన కావ్య ముద్దుగా నవ్వుతూ ఈ ఒక్కసారికి వదిలేస్తాను లే అని అంటే.. 

 

మోకాళ్ళ మీద కూర్చొని చోక్లేట్ కావ్యకి ఇచ్చిన సిద్దు హ్మ్మ్ ఈ ఒక్కసారి మన్నించండి ప్రిన్సెస్ నెక్స్ట్ టైమ్ మళ్ళీ రిపీట్ చేయను అని అంటూ..

 

కావ్య చోక్లేట్ తీసుకోవడంతో కావ్య ఫోర్ హెడ్ మీద కిస్ చేసి థాంక్స్ మా అని అంటాడు..

 

సిద్ధుని సైడ్ హాగ్ చేసుకున్న కావ్య.. నవ్వుతూ చూస్తుంది.. వాళ్ళిద్దరినీ జ్వాలా ఇంకా నందు అలుకగా చుస్తే..

 

రాహుల్ మాత్రం పొగలు కక్కుతూ చూస్తాడు.. నందు ఇంకా జ్వాలా వైపు చూపిస్తుంది కావ్య..

 

సిద్దు చిన్నగా నవ్వుతూ ముందు జ్వాలా వైపు వెళ్లి జ్వాలా ఫోర్ హెడ్ మీద కిస్ చేసి జ్వాలాకి కూడా డైరీ మిల్క్ చోక్లేట్ ఇచ్చి.. జ్వాలా కంటి చివరన వున్నా కాటుకని జ్వాలా చెవి వెనుక పెట్టి.. అదే కాటుక చుక్కని కావ్య ఇంకా నందుకి కూడా దిష్టి చుక్కగా పెట్టి..

 

మై త్రి బ్యూటిఫుల్ రోజేస్ లెట్స్ హేవ్ డిన్నర్ అంటూ నందు పక్కన కూర్చుంటాడు..

 

నందు తనకి ఫ్లవర్ ఇవ్వలేదు చోక్లేట్ కూడా అని అలిగితే.. నందు ముందు కిట్ కాట్ పెట్టి నీకు నేను చాలదా చోక్లేట్ కూడా కావాలా బేబీ అని మెల్లిగా అంటే.. సిద్దు మాటలకి బుగ్గలు ఎర్రగా చేసుకుంటుంది నందు..

 

ఆర్డర్ రావడంతో నలుగురు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ఫినిష్ చేస్తే.. వాళ్ళని చూస్తూ సిద్దు ఒకడే దొరికితే కుమ్మేయాలి అన్నంత కచ్చిగా..

 

జ్వాలా ఇంకా కావ్యలని కన్నులతోనే కొరుక్కు తినేసేలా చూస్తూ వుంటారు ప్రజ్వల్ ఇంకా రాహుల్ లు..

 

డిన్నర్ అయ్యాక అందరూ పబ్ కి వెళ్తే వెనుకే వీళ్ళు వెళ్తారు..

 

కావ్య ఇంటికి దగ్గరగా వుండే పబ్ కి వెళ్దాం అనడంతో లెట్ అయినా పర్లేదు అని అందరూ ఓకే అంటారు..

 

కాని తీరా అక్కడికి వెళ్లాకా ఓన్లీ కపుల్ ఎంట్రీ అనడంతో బిక్క మొహం వేసుకొని చూస్తుంది కావ్య..

 

సిద్దు కావ్యని కొట్టేసేలా చూస్తుంటే.. వెయిట్ యార్ ఎవరైనా బకరా దొరుకుతారు అంటూ.. మాస్క్ వేసుకొని వస్తున్న రాహుల్ ని ఇంకా ప్రజ్వల్ ఇద్దరు ఒంటరిగా ఉండటం చూసి..

 

దొరికారు అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికీ వెళ్లిన కావ్య.. గయ్స్ విల్ యూ జాయిన్ విత్ అస్ అంటూ..

 

కపుల్ ఎంట్రీ అంట యార్ నాకు నా సిస్ కి పైర్స్ లేరు ఈఫ్ యూ డోంట్ మైండ్ అని రాహుల్ ని అడుగుతుంటే ఎస్ అంటూ గంగిరెద్దుల తల ఊపుతాడు రాహుల్..

 

అంతే రాహుల్ చేయి పట్టుకొని లాక్కొస్తుంది కావ్య.. రాహుల్ కూడా తోడు ప్రజ్వల్ చేయి పట్టుకోవడంతో తను కూడ వెనుకే వస్తాడు ప్రజ్వల్ జ్వాలాని చూస్తూ..

 

సిద్ధుని చూస్తూ ఏడవకు మాకు కూడా పైర్స్ దొరికారు అంటూ రాహుల్ తో కలిసి లోపలికి వెళ్తూ.. జ్వాలాని అనుకోకుండా ప్రజ్వల్ మీదకి తోస్తుంది..