నా సీత ప్రేమకై💕 – 1
పార్ట్ – 1
| సమయం |
| సోమవారం ఉదయం, 8:30 గంటలు |
“ఒరేయ్ రాము రాము రేయ్ ఏంట్రా వీడు ఇంకా లేవకుండా ఇలానే మొద్దు నిద్ర పోతున్నాడు” అంటూ అరుస్తూనే లోపలికి నడిచారు రాము మిత్ర బృందం అంతా.
వాళ్ళ అరుపులకి గుండెల వరకు జారిపోయిన దుప్పటిని ముఖంపై గబక్కున లాక్కుంటూ, “ఎహే! ఏంటి పొద్దున్నే మీ నస నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వరా?” అంటూ కసిరించుకుంటూనే మళ్లీ నిద్రలోకి జారుకోవాలని చూస్తుంటే,
“అరే! ఇంత ప్రశాంతంగా నీకు నిద్ర ఎలా పడుతుంది రా” అంటూ రావటమే నిండుగా కప్పుకున్న రాము దుప్పటిని పూర్తిగా లాగేసింది సీత.
ఉన్న పాటుగా అలా దుప్పటి లాగేయడంతో కోపం నషాలానికి ఎక్కి, “ఎవడ్రా దుప్పటి లాగింది?” అంటూ కోపంగా కళ్ళు తెరిచి ఎదురుగా తన వైపే చిరుకోపంగా చూస్తున్న సీతను చూసి ఒక్క క్షణంలో భగ్గుమంటున్న తన కోపాన్ని మెల్లగా కంట్రోల్ చేసుకుంటూ, రెండు క్షణాల పాటు సీత వైపు ఎటువంటి భావం లేకుండా అలానే చూసి వెంటనే కూల్ అయిపోయి మళ్లీ బెడ్ పై పడుకొని నిద్రని ఆహ్వానించాడు.
వాడి కోపాన్ని చూసి చిరునవ్వు చిలికిస్తూ, “అరే! రాము లేరా టైం చూసావా ఎంత అయ్యిందో?” అంటూ మళ్లీ తన భుజం తట్టుతూ లేపడం మొదలు పెట్టింది సీత.
తన పై గట్టిగా అరవలేక, “రేయ్! చరణ్ నాకు నిద్రొస్తుంది ఊరికే నన్ను గెలగకండి వెళ్లండి ఫస్ట్ ఇక్కడ నుంచి” అంటూ ఇన్ డైరెక్ట్ గా సీతని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పాడు రాము.
తన భావాన్ని అర్థం చేసుకున్న సీత, “ఒరేయ్! ఇది మరి టూ మచ్ రా నేనేం చేసినా మన కోసం మన కాలేజ్ కోసమే చేస్తాను అని నీకు కూడా బాగా తెలుసు కదా. అయినా కూడా ఎందుకు ఇంత మొండి పట్టు పడుతున్నావు?”
అనిందో లేదో సర్రున పైకి లేచి, “నేనా నేనా మొండి పట్టు పట్టేది అసలు ఎవరిని అడిగి బెట్ కట్టావే నువ్వు..? హా..! అది కూడా నా పైన నేను చెప్పానా? లేక నాకు చెప్పావా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ పనికిమాలిన పని చేసిందే కాక ఇప్పుడు వచ్చి మళ్ళీ కథలు పడుతున్నావు నా దగ్గర” అంటూ గై గై అంటూ అరుస్తూ తన మీద మీదకి వెళ్ళిపోతుంటే,
వాడి కోపం గురించి క్షుణ్ణంగా తెలిసిన సీత వాడు ఎంతలా అరుస్తున్న తన ముఖం పై వికసించిన చిరునవ్వుని మాత్రం వీడక, తాను ముందుకు వస్తుంటే తిను వెనక్కి అడుగులేస్తూ వాడి వైపే సూటిగా చూస్తూ,
“నీ కోసం, మన కోసం, మన కాలేజ్ కోసం వీటి కోసం మాత్రమే బెట్ కట్టాను అర్థమవుతుందా” అంటూ అంతే దాటిగా సమాధానం చెప్పింది సీత.
తన సమాధానానికి రాము కోపం ఇంకాస్త పెరిగి తిరిగి తనని ఏదో అనే లోపు, “రేయ్! రాము ప్లీజ్ ఆ టైంలో నువ్వు అక్కడ లేవు రా ఉండి ఉంటే….
“కచ్చితంగా ఇలా జరగనిచ్చే వాడిని కాదు” అంటూ తను చెప్పే కన్నా ముందే కోపంగా అరిచేసాడు రాము.
వాడి కోపాన్ని చూసిన మనోహర్, “అంత సీన్ లేదు బాబు ఆ టైంలో గనుక తమరు అక్కడ ఉండి ఉంటే ఇప్పటికీ వాడో నువ్వో ఇద్దరిలో ఎవరో ఒక్కడే మిగిలి ఉండేవాళ్ళు. అలా బిహేవ్ చేశాడు వాడు.”
అంటూ చెప్పిన మనోహర్ మాటలకి, “ఏంట్రా అంత బిల్డప్ ఇస్తున్నారు అంతగా ఏమన్నాడు వాడు హా…?” అంటూ అప్పటికే నశించిపోయిన సహనంతో అరిచేశాడు గట్టిగా.
“సీత నువ్వు వెళ్లి అందరికీ కాస్త మంచి నీళ్లు తీసుకురా పో రా” అంటూ రాము వైపే కాస్త చిరుకోపంగా కాస్త బాధగా చూస్తున్న సీతని లోపలికి పంపించేశాడు చరణ్ ఆ మాటలని మళ్లీ ఇక్కడ తను వింటే బాధ పడుతుంది అనేసి.
వెళ్తున్న తన వైపే కోపంగా చూస్తున్న రాముని ప్రశాంతంగా మంచంపై కూర్చోబెట్టి, “ఎందుకు రా అంత కోపం. అదీ ఎంతో ప్రాణంగా ప్రేమించిన నీ సీత పై అవసరమా చెప్పు నీకు?”
అంటున్న మనోహర్ తో, “లేకపోతే ఏంట్రా అది ఇట్లాంటి తల తిక్క వ్యవహారాలన్నిటిలో తల దూరుస్తుంటే మీరంతా చూస్తూ ఏం చేశారు..?”
“రేయ్! రాము నిజం తెలుసుకోకుండా ఏదీ మాట్లాడకు. వాడు ఆ గోపి గాడు కావాలనే వచ్చి సీతను గెలుక్కున్నాడు. అక్కడికి తను చాలా ఇగ్నోర్ చేయాలనే ప్రయత్నించింది ఆఖరికి తనని ఎంత హీనంగా, నీచంగా మాట్లాడిన సైలెంట్ గా తప్పించుకుని వెళ్ళిపోదామనే చూసింది. కానీ తన అడుగులు ఎక్కడ ఆగిపోయాయో తెలుసా…” అనగానే మనోహర్ వైపే తలెత్తి చూసాడు రాము.
ఇంకా ఉంది..
అసలేం జరిగింది?
సీత గోపీతో ఏమని బెట్ కట్టింది?
రాము ఎందుకు అంతా సీరియస్ అవుతున్నాడు?
తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే మరి..
నా కథ నచ్చితే చిన్న కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారాని ఆశిస్తున్నాను.. కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నా కథను షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలను ఒక చిన్ని కామెంట్ రూపంలో చెప్పమని చెప్పండి.. మీ కామెంట్స్ ఏ మా రైటర్స్ కి వచ్చే బూస్ట్ అప్ దాని ద్వారా మేము మరింత ఉత్సాహంతో కథలను రాయగలుగుతాం..
నన్ను సపోర్ట్ చేస్తారాని ఆశిస్తూ…
ఇట్లు
మీ కీర్తి ప్రియ✍️💕
Swipe left/right or tap the sides to turn pages