ప్రేమలో పడితే – 5
ప్రేమలో పడితే -5
“ఏమి జరగదు మహా అయితే జాబ్ తీసేస్తారు అంతే కదా..!” అని మహా అంటున్నప్పుడే శ్రీరామ్ కరెక్టుగా ఆమె ముందు నుంచి వెళ్తూ ఆమె అన్న మాట విని ఒక సెకండ్ ఆగి, మహా వైపు చూసి ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
“అమ్మో సార్ మనల్ని కోపంగా చూసి వెళ్లిపోయారు, నీకేమీ జాబ్ పోయిన ప్రాబ్లం లేదు కానీ మా పరిస్థితి అలా కాదు కదా” అని భయంగా అన్నాడు గణేష్.
“నీకు అండగా నేను ఉన్నాను లే లైట్ తీసుకో” అని చెప్పి ఇంకా అప్పటికి కూడా బుగ్గ మీద వేలు పెట్టుకుని తెగ ఆలోచిస్తూ ఉన్న రమ్యను చూసి “ఏంటే ఏం ఆలోచిస్తున్నావ్ ఇక్కడే ఉన్నావా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయావా..?” అని అడిగింది.
“నాకు ఏదో తేడా కొడుతుంది మన మేనేజర్ గారు నువ్వు అలా మాట్లాడిన సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు అంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది” అని అంటూనే ఉంది రమ్య..
“తేడా కాదు అక్కడ లంచ్ టైం దాటిపోతుంది పదండి వెళ్లి తిందాం” అని వాళ్ళిద్దరిని తీసుకొని క్యాంటీన్ కి వెళ్ళిపోయింది మహా.
రమ్య గణేష్ ఇద్దరూ ఎక్కడ వాళ్ళ జాబ్ పోతుంది ఏమో అని భయపడుతున్నారు కానీ మహాలక్ష్మి మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగానే ఉంది..
మహాలక్ష్మి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీహరి తన లైబ్రరీని క్లోజ్ చేసేసి ఇంటికి వచ్చేసాడు..
తాడిచెట్టు అని తన మామయ్యని తన ముందు ఉన్న చైర్ లో కూర్చోబెట్టుకొని తను అతని కళ్ళవైపే చూస్తూ ఉంది..
మహా తన మామయ్యని తాడిచెట్టు కరెంటు పోల్ అని ఎందుకు పిలుస్తుంది అంటే అతను 6.2 ఉంటారు. ఇక మహాలక్ష్మి 5 ఫీట్ మాత్రమే ఉంటుంది అందుకే అలా పిలుస్తుంది. తనని పొట్టి అంటే మాత్రం అస్సలు ఒప్పుకోదు. కానీ తల మాత్రం తన మామయ్యని తాడిచెట్టు కరెంటు పోల్ అను పిలుస్తూనే ఉంటుంది.
“ఏంట్రా కళ్ళు పరీక్షిస్తున్నావా..? అలా చూస్తున్నావ్” అని నవ్వుతూ అడిగారు శ్రీహరి.
“లేదు మామయ్యా ఈ కళ్ళు మీకు ఒక్కరికే ఉన్నాయా..!” అని బుగ్గ మీద వేలు పెట్టుకొని అమాయకంగా అడిగింది..
శ్రీహరి గట్టిగా నవ్వుతూ “ఏంట్రా ఈ క్వశ్చన్” అని మహాలక్ష్మి తల మీద చిన్నగా కొట్టి లేచి కిచెన్ లోకి వెళ్లి స్నాక్స్ తీసుకొని వచ్చి మహా కి ఇచ్చారు.
“అది కాదు తాడిచెట్టు ఈరోజు మా మేనేజర్ ని చూశాను, సేమ్ అతని కళ్ళు నీ కళ్ళు ఒకేలా ఉన్నాయి తెలుసా” అని కళ్ళు టపటత కొడుతూ చెప్పింది..
“నీకు అలా అనిపించింది అంతేలే” అని ఇక ఇంటిలో మిగిలిన పని చేసుకోవడంలో బిజీ అయిపోయారు.
“అంతే అయ్యుంటుందిలే నా మామయ్య లాగా ఎవ్వరూ ఉండరు, నా మామయ్య గ్రేట్ ఎప్పుడు నవ్వుతూ కళ్ళల్లో ఆశాజ్యోతి నింపుతూ ఉంటారు. కానీ ఆ మేనేజర్ నిప్పులు కురిపిస్తుంటాడు, పోల్చుకోవడం కంపారిజన్స్ అస్సలు ఉండకూడదు” అని అనుకుంది.
శ్రీహరి మహాలక్ష్మికి గోరుముద్దలు తినిపిస్తుంటే మహాలక్ష్మి బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ “తాడిచెట్టు అత్తయ్య చనిపోయిన తర్వాత నువ్వు మరొక పెళ్లి చేసుకోవచ్చు కదా ఎందుకు చేసుకోలేదు” అని అడిగింది..
“ఆ ఆలోచన నాకు రాలేదు రా ఇక పెళ్లి ఏం చేసుకుంటాను” అని నవ్వుతూ అన్నాడు.
“అత్తయ్య నాలాగే పొట్టిగా బొద్దుగా కాదు కాదు లావుగానే ఉంటుంది అనుకో మరి నీకు ఎలా నచ్చింది” అని అమాయకంగా అడిగింది.
“మనసు అవన్నీ చూడదు రా, మీ అత్తయ్య ఫస్ట్ టైం నన్ను ఎలా కలిసిందో తెలుసా, నేను మీ ఊరికి పని మీద వచ్చాను అక్కడ ఫస్ట్ డే మీ అత్తయ్య వేరే వాళ్ళ ఇంటిలో మామిడి చెట్టుకి ఉన్న కాయల దొంగతనంగా కోసుకోవాలి అని ట్రై చేస్తుంది, ఆ విషయం నాకు తెలియదు. కానీ మీ అత్తయ్య పొట్టిది కదా అందటం లేదు అప్పుడే నాకు నా ఊరి ప్రెసిడెంట్ అడ్రస్ కావాలి అని మీ అత్తయ్య ని అడిగాను.
తను నడుం మీద రెండు చేతులు పెట్టుకొని నన్ను పైనుండి కింద వరకు చూసి, హైట్ బాగా ఉన్నాను కాయలు కొయ్యడానికి పనికొస్తాను అనుకుందో ఏంటో కిందకు దిగు అని బెదిరించింది.
ఊరికి కొత్త నన్ను అలా ఎందుకు అంటుందో తెలియక అయోమయంగానే నేను బైక్ మీద నుంచి కిందకు దిగాను.
నన్ను మరొకసారి పైనుంచి కింద వరకు చూసి హైట్ చాలా బాగా పెరిగావు. ఫస్ట్ ఆ కాయ కొయ్, నువ్వు అడిగిన అడ్రస్ చెబుతాను అని అన్నది..
పొట్టిది కదా అందట్లేదు అందుకని హెల్ప్ అడుగుతుంది. నాకు అవసరం ఉంది కాబట్టి నేను కూడా మామిడికాయ కోసి మీ అత్త చేతుల్లో పెట్టి, ఇప్పటికైనా అడ్రస్ చెప్తావా లేదా అని అడిగాను..
అప్పుడే ఊర్లో ఉన్న పదిమంది పిల్లలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్క మరి మాకు అని అడిగారు. మీ అత్త చిన్నగా ఫేస్ నావైపు తిప్పి, ఏంటి అలా చూస్తున్నావ్ వాళ్ళకి కూడా కోయ్ అని చెప్పి పక్కన నిలబడి హ్యాపీగా మామిడికాయ తింటుంది..
నేనేమో పిల్లలకి కాయలు కోసిస్తున్నాను. అప్పుడే ఆ ఇంటి ఓనర్ బయటకు వచ్చి ఎవడ్రా మా చెట్టు కాయలు కోస్తున్నారు అని కర్ర తీసుకొని మా దగ్గరకు వచ్చారు. పిల్లలు మీ అత్త జంప్ నాకేమో అవేమీ తెలియక అమాయకంగా అయోమయంగా వెర్రి ముఖం వేసుకొని నిలబడ్డాను,
ఆ ఇంటి ఓనర్ నా దగ్గరకు వచ్చి ఏంటయ్యా ఇది చూస్తుంటే ఊరికి కొత్త వాడిలా ఉన్నావ్, ఇలా కాయలన్నీ కోసేస్తున్నావేంటి అని నామీద గైమన్నాడు.
నేనేమో నాకేమీ తెలియదు వాళ్ల చెట్టు అనుకున్నాను అందటం లేదు అని నన్ను కొయ్యమంటే కోశాను అని చెప్పాను. అవునా ఇంకొకసారి ఎప్పుడూ ఇలా చేయొద్దు చూస్తుంటే నిన్ను ఎప్పుడూ ఈ ఊరిలో చూడలేదు ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఊరి ప్రెసిడెంట్ ను కలవాలి అంటే,
ఆ ప్రెసిడెంట్ ని నేనేనయ్యా రా ఇంతకీ నాతో ఏం పని అని ఇంట్లోనికి తీసుకొని వెళ్ళాడు.
అప్పటివరకు గోడ చాటునుండి నన్ను ఆ ప్రెసిడెంట్ కొడతాడేమో నేను పారిపోతాను ఏమో అని తొంగి తొంగి చూస్తూ ఉన్న మీ అత్తయ్య నన్ను ఇంటి లోపలికి ప్రెసిడెంట్ తీసుకొని వెళ్లడంతో ఛాన్స్ మిస్ అయింది అన్నట్లుగా చూసి పిల్లలతో కలిసి వెళ్లిపోయింది.
ఆ క్షణం మీ అత్తయ్య ఫేస్ చూస్తే ఎందుకో చాలా అమాయకంగా క్యూట్ గా ముద్దుగా అనిపించింది. నవ్వుకుంటూ నేను నా పనిలో బిజీ అయ్యాను” అని వాళ్ళ పరిచయం చెప్పాడు శ్రీహరి.
“అవునా అత్త అల్లరి కూడా బాగా చేసేదా.?” అని మహాలక్ష్మి అడుగుతుంటే,
” అవును నీలాగే అల్లరి కోతి మీ అత్తని నేను ఏడిపించటానికి గిటకా గిటకా అని పిలిచేవాడిని, పాపం అలా పిలిచినప్పుడు మీ అత్త ఫేస్ చూడాలి భలే ఉంటుంది తెలుసా” అని గట్టిగా నవ్వుతూ తన భార్యని గుర్తుచేసుకొని మరి చెప్పాడు శ్రీహరి.
గిటక అని వింతగా శ్రీహరి వైపు చూసింది మహాలక్ష్మి.
“అవున్రా, గిటకా అంటే ఎత్తు తక్కువ పొట్టిది అని అర్థం వస్తుంది. మీ అత్తని చూసిన క్షణం నాకు ఎందుకో అలా పిలవాలి అనిపించి పిలిచాను” అని అప్పటికే మహాలక్ష్మికి తినిపించడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నారు శ్రీహరి.
కొనసాగుతుంది…
Swipe left/right or tap the sides to turn pages