ప్రేమలో పడితే – 3
ప్రేమలో పడితే -3
“సరే సరే ఈ ఒక్కరోజు ఆఫీస్ కి వెళ్ళు రేపటి నుంచి నువ్వు వెళతాను అన్న నేను పంపించినులే” అని మహాలక్ష్మి ని నిద్ర లేపి వాష్ రూమ్ లోనికి పంపించి డోర్ క్లోజ్ చేశారు శ్రీహరి.
ఈ తాడిచెట్టు ఎప్పుడు ఇంతే ,నాకు ఇష్టం లేని పని చేయమంటాడు అని కష్టంగా స్నానం చేసి బయటకు వచ్చి, “కరెంటు పోల్ ఈరోజు టిఫిన్ ఏంటి” అని అరిచింది.
“ఈరోజు నీ ఫేవరెట్ పొంగల్, వచ్చి త్వరగా తిను” అని కిచెన్లో నుంచి డైనింగ్ టేబుల్ మీద బౌల్స్ అన్ని పెడుతూ అన్నారు శ్రీహరి..
“వావ్ అవునా అయితే ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తాను” అని చెప్పి ఆఫీస్ కి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చొని తను ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకుంటూ కూడా ఆఖరి సెకండ్ లో ఆగిపోయి తాడిచెట్టు అని సాగదీస్తూ పిలిచింది.
చెప్పరా అని కిచెన్లోనికి వెళుతున్న శ్రీహరి ఆగి ఆమె తల మీద చేతులు వేసి ఆప్యాయంగా అడిగారు.
“నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను టిఫిన్ తినేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వెళ్ళేది నా పక్కనే కూర్చోవాలి అని, నా మాట నువ్వు అస్సలు వినటం లేదు” అంటూ ఆమె శ్రీహరి చేతులు పట్టుకుని పక్కన ఉన్న చైర్ లో కూర్చోబెట్టి ఫస్ట్ అతనికి తినిపించి ఆ తర్వాత తను తిని,
” ఒకే ఆఫీస్ కి లేట్ అయిపోతుంది. అసలే టీమ్ లీడర్ గా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను నా ప్రాజెక్ట్ ని ఇనిషియేటివ్ చేస్తున్నాను సక్సెస్ఫుల్ కావాలి అని దీవించు.. నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకే ఉంటాయనుకో కాకపోతే ఫార్మాలిటీ” అని అల్లరిగా చెప్పి శ్రీహరి కాళ్ళకి దండం పెట్టుకొని హడావిడిగా వెళ్లిపోయింది.
వెళుతున్న మహాలక్ష్మిని చూసి మనసులో ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ ఉండటం మీ అత్తయ్య నుండే నీకు వచ్చింది రా అని అనుకుంటూ విశ్వనాథ్ గారికి ఫోన్ చేశారు. కానీ అటువైపు నుండి ఫోన్ లిఫ్ట్ చేసి శ్రీహరి హలో అన్న తర్వాత గొంతు గుర్తుపట్టి వెంటనే ఫోన్ కట్ చేశారు.
మరొకసారి ఫోన్ చేస్తే ఈసారి ఫోన్ బిజీ అని రావటంతో ఇక చేసేది ఏమీ లేక తన కోడలని తన ఫ్యామిలీతో ఇక కలపలేనేమో అని అనుకుంటూనే కింద ఉన్న లైబ్రరీకి వెళ్ళిపోయారు.
లైబ్రరీ తనే ఆరు సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశారు. కాకపోతే అప్పుడు ముంబైలో స్టార్ట్ చేసి బ్రాంచెస్ 3 పెట్టారు. ఇప్పుడు హైదరాబాదులో ఉన్నది మూడోవది. మహాలక్ష్మికి హైదరాబాద్లో జాబ్ రావటంతో ఆమెను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక ఇక్కడ లైబ్రరీ తను స్టార్ట్ చేశాడు. అక్కడ దొరకని బుక్ అంటూ లేదు పాత బుక్స్ నుంచి ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయ్యే ప్రతి బుక్ కూడా అక్కడ దొరుకుతుంది.
శ్రీహరి గారికి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. ఆ ఇంట్రెస్ట్ ని ఇలా లైబ్రరీగా మార్చేశారు, ఉదయం మహాలక్ష్మి ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఆ లైబ్రరీ ఓపెన్ చేస్తారు. మరల మహాలక్ష్మి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన మరుక్షణం లైబ్రరీ క్లోజ్ చేసేస్తారు. ఎక్కువ టైం మహాలక్ష్మితోనే గడుపుతుంటారు. పేరుకే మహాలక్ష్మి కోడలు కానీ కూతురు కంటే ఎక్కువ.
మహాలక్ష్మి ఆఫీస్ కి వెళ్లేసరికి మీటింగ్ హాల్ బయట తన బెస్ట్ ఫ్రెండ్ అయినా రమ్య తన కోసమే వెయిట్ చేస్తూ ఉంది.
“ఎంతసేపే నీకోసం వెయిట్ చేయసేది ఎప్పుడు లేటే, త్వరగా రావాలి అని తెలియదా..? ఇప్పటికే మేనేజర్ మీటింగ్ కి అంతా సిద్ధంగా ఉందా లేదా అని అడిగి వెళ్లారు. నేనేమో అంత రెడీ అనే చెప్పాను” అని రమ్య చెప్తున్నప్పుడే,
” అబ్బా ఇంకా మేనేజర్ లోపలికి రాలేదు కదా ఎందుకే అంత భయపడతావ్, నేను వచ్చేసాను కదా, పద లోపలికి వెళ్దాం” అని అన్నది మహాలక్ష్మి.
“నీకు మేనేజర్ గురించి ఇంకా పూర్తిగా తెలియదు. చాలా స్ట్రిక్ట్, చిన్న మిస్టేక్ జరిగిన కూడా జాబ్ లో నుంచి తీసేస్తారు తెలుసా..;” అని అన్నది రమ్యా..
“అవునా నిజంగా తీసేస్తారా..! అయినా ఏంటే మేనేజర్ గురించి అంత బిల్డప్ ఇస్తున్నారు. ఎవరైనా మనిషి అన్నాక మిస్టేక్స్ చేస్తారు ఆ మిస్టేక్స్ కి జాబ్ లో నుంచి తీసేస్తారా..?” అని వెటకారంగా అన్నది..
“అవునా తీసేస్తారా అని నువ్వు అనటం కాదు, ఇప్పుడు నువ్వు ఇనీషియేట్ చెయ్యే ప్రాజెక్టులో ఏదైనా మిస్టేక్ రాని అప్పుడు నీకే తెలుస్తుంది. ప్రాజెక్టు ఉంటుందా లేదా..? ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటారు. అసలు ఆడపిల్లలకి ఈ జాబు ఇది అవసరమా ఇంట్లో కూర్చొని వంట చేసుకోక అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి వాడి ముందుకు నువ్వు వెళ్తున్నావ్ గుర్తుపెట్టుకో నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో” అని అన్నది రమ్య.
“ఏంటే నన్ను తెగ భయపెడుతున్నావ్. నేను భయపడే రకం కాదు భయపెట్టే రకం. ఇప్పటివరకు ఆ మేనేజర్ ఒక్కసారి కూడా నాకు ఎదురుపడలేదు ఇప్పుడు ఎదురు పెడుతున్నాడు అంటే అతని ఫ్యూచర్ ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించుకో” అని అంటూనే “అయినా ఏంటే మన ఆఫీసులో ఇప్పటివరకు చాలామంది మేనేజర్ గురించి నీలానే మాట్లాడారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆ మేనేజర్ ని చూసే ఆ అదృష్టం నాకు దక్కలేదు” అని మహాలక్ష్మి అంటుంటే,
” చూస్తే ఏం చేస్తారేంటి..?” అని మహా ని పైనుంచి కింద వరకు చూస్తూ అన్నది రమ్య.
“సింపుల్ నాకు ఎలాగూ ఈ జాబ్ చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చిన్న మిస్టేక్ కాదు పెద్ద బ్లండర్ మిస్టేకే చేసి ఈ ఆఫీసులో నుంచి ఎంచక్కా బయటికి వెళ్లిపోతాను” అని నవ్వుతూ మీటింగ్ హాల్ లోపలికి వెళ్ళిపోయింది..
“ఏంటి..?” అన్నట్లుగా రమ్య నోరు తెరుచుకుని బయటే నిలబడిపోయింది.
“ఏంటే అక్కడే ఉన్నావ్ లోపలికి రా..? అని మహాలక్ష్మి మీటింగ్ హాల్ లోపలికి వెళ్లి తన ప్లేసులో కూర్చుని ఇంకా తనతో పాటు రాని రమ్య వెనకే ఉండటంతో పిలిచింది.
హమ్మో దీనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ వచ్చి మహాలక్ష్మి పక్కన కూర్చుంది.
“నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావ్ మరి గణేష్ ఎక్కడ..?” అని చుట్టూ చూస్తూ అడిగింది మహాలక్ష్మి.
“వస్తున్నాను అన్నాడు ఇంకా రాలేదేంటో” అని రమ్య అంటున్నప్పుడే మేనేజర్ మీటింగ్ హాల్ లోపలికి ఎంటర్ అయ్యాడు.
మీటింగ్ హాల్లో నాలుగు టీం లీడర్స్ వాళ్ల టీమ్ మెంబర్స్ తో కలిసి కూర్చొని ఉన్నారు అందులో మహాలక్ష్మి కూడా ఒకటి.
మీటింగ్ హాల్లో ఉన్న అమ్మాయిలు అందరూ కూడా నోరు తెరుచుకొని కళ్ళు పెద్దగా చేసుకొని వచ్చిన మేనేజర్ వైపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే అంత అందంగా ఉన్నాడు అమ్మాయి కలలు రాకుమారుడు ఉన్నట్లే ఉన్నాడు.
సిక్స్ ఫీట్ హైట్ తో, కండలు తిరిగిన బాడీతో, స్టైలిష్ కళ్ళజోడు పెట్టి, హెయిర్ నీ చేత్తో వెనక్కి అనుకుంటూ లోపలికి అడుగుపెట్టిన మేనేజర్ నుండి చూపు ఎవరు తిప్పుకోలేకపోయారు. ఆఖరికి మహాలక్ష్మి కూడా ఆ మేనేజర్ వైపు అలానే చూస్తూ ఉంది.
మేనేజర్ వెనకే వయసు పైబడిన పిఏ వస్తూ అమ్మాయిలు అందరూ మేనేజర్ వైపు చూస్తూ ఉండటం గమనించి అయిపోయారు ఈరోజు, వీళ్ళందరి పరిస్థితి ఏంటో అని మనసులో అనుకున్నారు.
కొనసాగుతుంది..
మాక్సిమం నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చాలా వరకు కామెడీ ఉంటుందండి అలా అని స్టోరీ సాగదు అని కాదు స్టోరీ వెళ్తూనే ఉంటుంది కానీ కామెడీ ఎక్కువగా ఉంటుంది కొత్తగా ట్రై చేస్తున్నాను ఆదరిస్తారు అనుకుంటున్నాను…
Swipe left/right or tap the sides to turn pages