భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 1
ఒక అబ్బాయి చూడడానికి తెల్లగా, చాలా అందంగా 5.9 ఎత్తు,మంచి ఫిట్ బాడీ తో ఏ అమ్మాయికి అయినా సరే ఇట్టే నచ్చేలా ఉంటాడు….
అతని పేరు “విక్కీ” అతను అందగాడే కాదు చదువులో కూడా మంచిగా ఫస్ట్ క్లాస్ లో టాపర్ లా ఉండేవాడు…
అతను బి టెక్ లాస్ట్ ఇయర్ చదివేటప్పుడు వాళ్ళ కాలేజ్ లో కొత్తగా జాయిన్ అయింది ఒక అమ్మాయి….
ఆ అమ్మాయి చూడడానికి ఎంతో అందంగా, పసుపు పచ్చని మేని ఛాయతో, చక్కని శరీర సౌష్టవంతో,అనకువగా, ఎంతో పద్దతిగా, మహాలక్ష్మి ల ఉంది….
ఆ అమ్మాయి పేరు “వినీల”
వినీలా b. Tech 3rd ఇయర్ లో ముందు చదివే కాలేజ్ లో ఏదో ప్రాబ్లెమ్ అని కాలేజ్ చేంజ్ అయి విక్కీ కాలేజ్ లో జాయిన్ అవుతుంది…..
వినీలా ని చూసి చూడగానే విక్కీ కళ్ళు మెరిసిపోయాయి…
ఆమె అందానికి తొలి చూపులోనే విక్కీ ఫిదా అయిపోయాడు…తనని చూస్తూనే ఏమన్నా ఉందా ఈ అమ్మాయి… ఎలా అయిన సరే తనని నా ప్రేమలో పడెయ్యాలి….
త్వరలోనే నా దాన్ని చేసుకోవాలి అని గట్టిగ ఫిక్స్ అవుతాడు..అనుకున్నదే తడవుగా విక్కీ అతి కొద్ది రోజుల్లోనే వినీలా ని సీనియర్ గా పరిచయం చేసుకుంటాడు….
విక్కీ సీనియర్ అవడంతో వినీల కూడా అతనికి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతూ విక్కీ ఏం అడిగిన చెప్తూ ఉండేది….
విక్కీ కూడా వినీల దగ్గర చాలా పద్దతిగా, మంచిగా మాట్లాడేవాడు….
అలా కొద్ది రోజులలోనే వినీల, విక్కీ క్లోజ్ అయిపోయారు…విక్కీ గురించి కాలేజ్ లో మంచి పేరే ఉండడం, అండ్ విక్కీ తనతో మంచిగా బిహేవ్ చేయడం తో వినీల విక్కీ ని క్లోజ్ ఫ్రెండ్ గా ట్రీట్ చేసేది…
విక్కీ మాత్రం వినీల ని లవ్ చేస్తు ఉండేవాడు…. బట్ అతను వినీల కి ఆ విషయం చెప్పలేకపోతున్నాడు…
ఎక్కడ తన లవ్ మేటర్ చెప్తే వినీల తనతో ఫ్రెండ్షిప్ కూడా మానేస్తుందేమో అని విక్కీ బయపడి తన ప్రేమను మనసులోనే దాచేస్తాడు…
అలా రోజులు గడుస్తూ ఉన్నాయి…. చిన్నగా వినీల కి కూడా విక్కీ మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి..
ఎంతయినా అందగాడు…. బుద్దిమంతుడు తనతో చాలా బాగుంటాడు… తనని ఎంతో కేరింగ్ గా చూసుకుంటాడు…
సో ఇంతకంటే ఒక అమ్మాయికి ఇంకేం కావాలి విక్కీ లాంటి వాడు లైఫ్ పాట్నర్ అయితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటూ ఉంటుంది మనసులో ….
అలా ఇంకొద్ది రోజులు గడిచిపోయి విక్కీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యాయి….అది లాస్ట్ ఎక్సమ్ రాసిన రోజు…
ఈరోజుతో ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి….సో నేను రేపటి నుండి కాలేజ్ కి కూడా రాను కాబట్టి ఈరోజు ఎలాగైనా వినీలా కి నా ప్రేమ విషయం చెప్పాలి అని ఫిక్స్ అవుతాడు విక్కీ …
తను అలా అనుకున్న వెంటనే వినీలా కి కాంటీన్ లో కలుద్దాం త్వరగా రమ్మని మెసేజ్ చేస్తాడు…వినీలకి కూడా అప్పుడు క్లాస్ లేకపోవడంతో వెంటనే కాంటీన్ కి వెళ్తుంది….
ఆమె రాగానే విక్కీ ముందు కాసేపు నార్మల్ గా మాట్లాడి ఇంక ఏదైతే అదవుతుంది అనుకుని వినీల కి ప్రపోజ్ చేసేస్తాడు….
సడెన్ గా విక్కీ ఐ లవ్ యూ చెప్పడంతో వినీల ముందు షాక్ అయిన,, తన కి కూడా విక్కీ అంటే ఇష్టం ఉండడంతో అతని ప్రపోసల్ ని ఆక్సిప్ట్ చేస్తు ఐ లవ్ యూ టూ విక్కీ అని చెప్తుంది నవ్వుతు ….
వినీల తన ప్రేమ ని ఒప్పుకోగానే విక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు…
థాంక్యూ విన్నీ…థాంక్యూ సో మచ్ రా… నేను అసలు ఎక్సపెక్ట్ చేయలేదు నువ్వు ఇంత త్వరగా నా ప్రేమను ఆక్సిప్ట్ చేస్తావ్ అని…నౌ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అంటూ వినీల ని హగ్ చేసుకుంటాడు….
వినీల కూడా నవ్వుతూ నాకు చాలా హ్యాపీగా ఉంది విక్కీ… నాకు కూడా ఎప్పటినుండో నువ్వంటే చాలా ఇష్టం.. నీకు నేనంటే ఇష్టం అని నాకు తెలుసు…
నువ్వు ఎప్పుడెప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్తావా,,నేను లవ్ యూ టు చెప్దామా అని వెయిటింగ్ తెలుసా అంటూ తను కూడా విక్కీ చుట్టు చేతులు వేసి హగ్ చేసుకుంటుంది…
అలా కాసేపు ఇద్దరు అక్కడ కూర్చుని కాఫీ తాగి విక్కీ తన ఇంటికి, వినీల తన క్లాస్ కి వెళ్ళిపోతారు….
విక్కీ తన b.tech లాస్ట్ ఇయర్ కూడా కంప్లిట్ అవడంతో కాలేజ్ కి రావడం లేదు…
వినీల కి ఇంకా ఒన్ ఇయర్ ఉండడం వల్ల కాలేజ్ కి రాక తప్పలేదు..
విక్కీ కాలేజ్ కి రాకపోవడంతో వినీల విక్కీని బాగా మిస్ అవుతుంది… విక్కీ కూడా సేమ్ వినీల ని మిస్ అవుతున్నాడు…
.
ముందు అయితే ఇద్దరు ఒకరి ప్రేమ ఒకరికి చెప్పుకోకున్న కాలేజీ లో ఫ్రీ టైమ్ లో ఎప్పుడు ఒకేచోట ఉండేవారు…
ఒకర్ని ఒకరు చూసుకుంటూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ కాలం గడిపేవారు….
continued….
Swipe left/right or tap the sides to turn pages