New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మీనాక్షి… నేను కాదు,, ఆమె…. – 2

మీనాక్షి… నేను కాదు,, ఆమె…. – 2

మీనాక్షి… నేను కాదు,, ఆమె….-2

 

 

జోసెఫ్ అపుడే ఫ్లైట్ దిగాడు హైదరాబాద్ లో….. చెన్నై కి ఫ్లైట్ కోసం చూస్తున్నాడు…. అప్పుడే ఫోన్ రింగ్ అయింది స్క్రీన్ మీద  డాడ్ అని ఉంది…. 

 

 

జోసెఫ్ కాల్ లిఫ్ట్ చేసి…. చెప్పండి డాడ్ అంటాడు…. 

 

 

నీకు,, ఏం అయిన పిచ్చి ఆ?? అసలు,, ఏదో చిన్నప్పుడు నేను చెప్పిన కథ నీ నమ్మి అక్కడకి వరకు వెళ్తావా??? అయిన నీకు ఆ కథ చెప్పి తప్పు చేశాను అనిపిస్తుంది జోసెఫ్…. 

 

 

అది,, కథ కాదు డాడ్…. నా మనసుకి అనిపిస్తుంది అది నిజం అని… అది తెలుసుకోకుండా నేను రాను అంటాడు….

 

 

మరి,, అమీలియా విషయం ఏంటి??

 

 

చెప్పాను కదా డాడ్…. ఆ విషయం అంత తెలుసుకొని ఏ వస్తా…. ఆ శాపం గురించి మొత్తం కన్నుకోకుండా నేను ఇండియా నుండి రాను డాడ్….  అమీలియా కి నేను చెప్పాను తన విషయం నేను చూసుకుంటా…. ప్లీజ్ నన్ను ఆపాలి అని చూడకండి…. బాయ్ డాడ్…. ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు జోసెఫ్….

 

 

………..

 

ఆదిత్య: సందీప్ కనుకున్నావా??? 

 

 

సందీప్: లేదు,, సార్… కన్నుకోలేకపోయాము…. చాలా వరకు ఆ ఏరియా లో రీసెర్చ్ చేశాము సార్….. 

 

 

ఆదిత్య: సరే,,, నేనే వెళ్తా అక్కడకి అన్ని అరేంజ్మెంట్స్ చెయ్యి అంటాడు….

 

 

సరే అని సందీప్ అక్కడ నుండి వెళ్ళిపోయాక…… 

 

ఆదిత్య కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు….. ఒక రెండు నెలలు క్రితము…. ఆదిత్య తమిళనాడు వెళ్తాడు…. ఆదిత్య నానమ్మ అంటే సంజయ్ అమ్మగారు ఉండే ఊరికి వెళ్తాడు… తిరుచిరాపల్లె కి….

 

ఆదిత్య: ఏంటి నానమ్మ?? నాన్న అక్కడ ముంబై లో బిసినెస్ పెట్టి ఎంత డెవలప్ అయ్యాడో తెలుసా?? నువ్వు ఇక్కడ ఎందుకు అక్కడకి రా అంటాడు…

 

 

దానికి కామాక్షి సమాధానం ఇస్తూ…. లేదు రా ఆదిత్య… నేను తమిళనాడు వదిలి రాలేను… ఇంకా ఎలాగో నేను ఎక్కవ రోజులు బతకను అని నాకు తెలిసిపోయింది నిన్ను ఇక్కడకి పిలిపించింది నీకు ఒక పని అప్పగించడానికి….

 

 

చెప్పండి నానమ్మ అంటాడు ఆదిత్య…

 

 

కామాక్షి: అదే,, రా మన వంశం కి ఒక శాపం ఉంది.. ఈ విషయం నేను మీ నాన్న కి చెప్పలేదు… ఒకవేళ చెప్పిన కూడా వాడు ఆస్తి, డబ్బు ఇంకా సంపాదించాలి అని అనుకుంటూ ఇవి అన్ని పట్టించుకోడని అర్థం అయ్యి నీకు చెప్తున్న రా… నువ్వు కన్నుకోవాలి దీనికి ఒక సమాధానం…

 

 

ఆదిత్య: ముందు అది ఏంటో చెప్పు నానమ్మ…

 

 

దానికి ఆమె సమాధానం ఇస్తూ… ఒక రెండు వందల సంవత్సరాల క్రితం…. మధురై నీ పాలించే రాజు మన వంశం వాడే రా…. అప్పుడు ఈ భారత దేశాన్ని ఆంగ్లేయులు పాలిస్తున్న రోజులు అవి…. అప్పుడు ఏం జరిగింది అని సరిగా నాకు అయితే తెలియదు…. కానీ,, మీనాక్షి అమ్మవారికి కోపం వచ్చి శాపం ఇచ్చారు అంట… అమ్మవారు అలా ఇద్దరికి ఇచ్చరూ అంట…. ఒకటి మన వంశం వాళ్ళకి అని మాత్రం తెలుసు….. 

 

 

ఆదిత్య: ఏంటి అమ్మమ్మ అది…

 

 

కామాక్షి: అది ఏంటి అని సరిగ్గా…నాకు కూడా తెలియదు రా…. కానీ,, ఆ శాపం గురించి కన్నుకోకుండా… నువ్వు పెళ్ళి మాత్రం చేసుకోవదు రా అంటుంది….

 

 

ఆదిత్య: అలా,, ఎందుకు??

 

 

తెలియదు ఆదిత్య… మీ తాత చనిపోయేటపుడు మాత్రం నాకు అదే చెప్పాడు… ఆదిత్య కచ్చితంగా ఆ శాపం ఏంటో కన్నుకుంటాడు అని నాకు అనిపిస్తుంది… ఇంకో విషయం ఆ శాపం ఏంటో కన్నుకొని ఆ శాపం నుండి విముక్తి పొందకుండా పెళ్ళి చేసుకోవదు అని నీకు చెప్పమని నాకు చెప్పాడు ఆదిత్య…

 

 

ఆదిత్య: ఆది ఏంటి అని తాత నీ కన్నుకోవాల్సింది కదా  నానమ్మ నువ్వు…..

 

 

అడిగాను రా…. ఆయన ఏదో చెప్పాలి అని అనుకోని చెప్పేలోపు చనిపోయాడు రా…. నువ్వు మాత్రం ఆ శాపం ఏంటి అని కనుకో…. అది కన్నుకొని విముక్తి పొందిన తర్వాతనే పెళ్లి చేసుకో… అంత వరకు చేసుకొను అని మాట ఇవ్వు…. ఇది నా చివరి కోరిక…..

 

 

సరే నానమ్మ నీకు మాట ఇస్తున్న అని అంటాడు……

 

 

ఆలా మాట ఇచ్చాక…. ఆమె ఆదిత్య చేతిలోనే పడిపోయి చనిపోయింది…. 

 

 

ఆ తర్వాత ఒక నెల సందీప్ కి చెప్పి మధురై కి పంపించి చాలా ట్రై చేస్తాడు ఆదిత్య ఆ శాపం గురించి కన్నుకోవడానికి…. కానీ ఫలితం లేకపోయింది…. 

 

 

అలా గతం నుండి ప్రస్తుతానికి వస్తాడు ఆదిత్య…..

 

 

ఆదిత్య ఫోన్ తీసుకొని సంజయ్ కి ఫోన్ చేస్తాడు….

 

సంజయ్: ఏంటి రా ఇలా ఫోన్ చేశావు??

 

అదే,, నాన్న… చిన్న బిజినెస్ వర్క్ ఉంది చెన్నై వెళ్తున్న నేను  ఒక రెండు మూడు వారాలు అక్కడ ఉండాల్సి వస్తుంది… ఎలాగో,, వెళ్తున్న చుట్టూ ఉన్న ప్లేస్ అదే కొన్ని డేస్ పాండిచ్చేరి లో ఉంట ఆఫీస్ స్ట్రెస్ ఎక్కవ అయింది…. ఆ బిజినెస్ మీటింగ్ అవ్వగానే కొన్ని డేస్ రిలాక్స్ అవ్వాలి అని ఉంది….

 

 

 

సంజయ్: హ్మ్మ్…. సరే,, జాగ్రత్త గా వెళ్ళి రా….. అని ఫోన్ పెట్టేస్తాడు….

 

 

 

సందీప్: సార్,,, అన్ని రెడీ…. 

 

 

 

ఆదిత్య: సరే… నాన్న కి బిసినెస్ మీటింగ్ మీద చెన్నై వెళ్తున్న అని చెప్ప… తరవాత పాండిచ్చేరి అని చెప్పా… నువ్వు కూడా అలానే చెప్పు…. అండ్ ఇంకో విషయం ఇక్కడ నుండి చెన్నై కి ఫ్లైట్ లో… చెన్నై నుండి మదురై కి ట్రైన్ టికెట్ బుక్ చెయ్యి….

 

 

 

సందీప్: ఒకే సార్……

 

 

 

To be continued…….