మీనాక్షి… నేను కాదు,, ఆమె…. – 3
మీనాక్షి… నేను కాదు,, ఆమె….-3
జోసెఫ్ చెన్నై లో ఫ్లైట్ దిగి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు… ఇంకా ట్రైన్ రావడానికి టైమ్ ఉంది అని అనుకోని…. కొంచం సేపు చిన్నపుడు వాళ్ళ నాన్న స్టీవెన్…. అసలు,, ఏం చెప్పాడు అని గుర్తు చేసుకుంటు తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు….
నాన్న నాకు చెప్పింది…. మా వంశం వాళ్ళు కొన్ని సంవత్సరాలు క్రితం మధురై లో ఉండే వాళ్ళు అని…. అప్పుడే అమ్మవారు మాకు శాపం ఇచ్చారు అని మాత్రం చెప్పాడు…. అసలు ఎందుకు ఇచ్చారు.?? నిజంగా నాన్న అన్నట్టు అది కేవలం కల్పిత కథ అయితే కాదు కదా.!!! ఒకవేళ అలా అనుకుందాం అనుకున్న… కానీ,, నా మనసు ఎందుకో ఆ విషయం నిజం అని చెప్తుంది….
అలా ఆలోచిస్తూ ఉంటే ట్రైన్ వచ్చి ఆగింది… ట్రైన్ రాగానే ఎక్కాడు….
తన ఎదురు సీటు లో కూర్చున్న అబ్బాయి వైపు చూస్తూ…. హాయి… ఐ ఆమ్ జోసెఫ్… ఫ్రమ్ ఇంగ్లాండ్ అంటాడు….
దానికి ఆ అబ్బాయి… హాల్లో… ఐ ఆమ్ ఆదిత్య వర్మ…. అందరూ ఆదిత్య అంటారు… ఫ్రం ముంబై…. CEO of AD technologies…….
జోసెఫ్: మధురై కి వెళ్తున్నారా??
ఆదిత్య: హ్మ్మ్… అవును బ్రో…… మీరు కూడా మధురై కే నా??
అవును అని జోసెఫ్ తన ఫోన్ ఓపెన్ చేసి అమీలియా తో చాట్ చేస్తూ ఉంటాడు….
జోసెఫ్ మనసులో ఇతను ఇండియన్ ఏ కదా…. పైగా మధురై వెళ్తున్నాడు… మధురై కి వెళ్తున్నాడు మనకి ఏం అయిన హెల్ప్ అవుతాడు ఏమో!! ఆ విషయం గురించి అడిగితే అని అనుకుంటూ…. మళ్ళీ,, వద్దు… వద్దు.. ఈ విషయం నా అంతకు నేను ఏ కన్నుకుంటే బెటర్….
ఆదిత్య: బ్రో,,, ఒక డౌట్ అడగచ్చా???
జోసెఫ్: ఆ అడగండి బ్రో….
ఆదిత్య: మీరు ఇంగ్లాండ్ అంటున్నారు… కానీ,, మీకు తెలుగు ఎలా వచ్చు… ఎంత తెలుగు నేర్చుకున్న అలా అంత నిర్మల్ గా తెలుగు మాట్లాడలేరు కదా…. పైగా అంత క్లియర్ గా మాట్లాడుతున్నారు.?? పైగా చూస్తూ ఉంటే కొంచం ఇండియన్ లా ఉన్నారు…
జోసెఫ్: ఓహ్,, అదా… మా నాన్న స్టీవెన్ ఫ్రమ్ ఇంగ్లాండ్…. అమ్మ మహా లక్ష్మీ ఇండియన్… పైగా అమ్మ నేటివ్ తెలుగు… సో,, అలా తెలుగు నాకు బాగా వచ్చు.. ఇండియా ఎప్పుడూ రాలేదు… ఫస్ట్ టైమ్ అంటాడు…. మా అమ్మ చెప్పినట్టు ఇండియా చాలా బాగుంది…
ఆదిత్య: మీ అమ్మగారిని కూడా తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది…..
జోసెఫ్: మా అమ్మ లేదు బ్రో…. షి ఇస్ నో మోర్…. లాస్ట్ ఇయర్ చనిపోయారు….
ఆదిత్య: ఓహ్… ఐ ఆమ్ సారీ….
పర్లేదు అని…. సైలెంట్ అయిపోతారు ఇంకా ఇద్దరు….
…………………………………
తమిళనాడు లో….. ఒక మారుమూల గ్రామం కి దగ్గర లో ఉన్న అడవి లో…
భైరవ: సూర్య… నువ్వు వెళ్ళాలి మధురై కి… ఆ మణి కచ్చితంగా కావాలి…. ఆ మణి లేకుండా మనం అనుకున్నది సాధించలేము…. ఈ పూజ ఫలించాలి అంటే ఆది మన దగ్గర ఉండాలి నీకు తెలియదు… ఆ మణి కి పంచ భూతాలు నీ అదుపు చేసే శక్తి ఉంది…
సూర్య: కానీ,, అది ఎక్కడ ఉందో మనకి తెలియదు కదా గురువు గారు….
భైరవ: అందుకు ఏ నిన్ను పంపించేది… నువ్వు వెళ్ళి అది ఎక్కడ ఉందో కన్నుకోని తీసుకుని రా….
సూర్య: అది లేకుండా కుదరదు ఆ గురువు గారు??….
భైరవ: మన ప్రధాన లక్ష్యం ఏంటి??
సూర్య: పంచ భూతాలు నీ అదుపు చేయడం….
మరి అలా అదుపు చేయాలి అంటే మనకి ఆ మణి సహాయం కావాలి…. అది లేకపోతే మనం ఏం చేయలేము…. ఒకవేళ మనం ఏది అయినా పూజ చేసిన అది ఫలించదు….
సరే,, గురువు గారు…. నేను వెళ్తాను… రేపు పొద్దునే వెళ్ళి తీసుకొని వస్తాను….
భైరవ: వూరికే,, వెళ్ళి తీసుకొని రావడానికి అది ఏం అయిన అంగడి లో దొరికే వస్తువు ఆ?? దొరకడానికి నీకు ఎన్ని రోజులు పడితే అని రోజులు అక్కడే ఉండి తీసుకుని రా… అర్థం అయింది ఆ?? ఆ మణి లేకుండా వచ్చావు అని అనుకో నేను ఏం చేస్తానో నాకు ఏ తెలియదు…. వెళ్ళు…..
సూర్య: అలాగే,, గురువు గారు….. నేను ఎక్కడ ఉండాలి మధురై లో….
భైరవ: నాకు తెలిసిన స్నేహితుడు వున్నాడు ఒక అతను….ఇలాంటి పనులు లో ఆయన నీకు సహాయం చేస్తాడు…. అతని దగ్గర ఉండు….
సూర్య తన ఇంట్లోకి వెళ్ళి…. ఏదో చిన్న చిన్న తంత్ర పూజలు నేర్పిస్తాడు అవి చేసి కొంచం డబ్బులు సంపాదించాలి అని నేను అనుకొని ఈయన దగ్గర శిష్యుడు గా చేరితే…. అది తీసుకొని రా… ఇది తీసుకొని రా… అక్కడకి వెళ్ళు…ఇక్కడకి వెళ్ళు….అని చంపుతున్నాడు…. అని అనుకుంటూ బట్టలు సర్దుకుంటున్నాడు……
To be continued……
Swipe left/right or tap the sides to turn pages