అక్కా, నేను పాపని ఇంట్లోకి తీసుకెళ్తాను. అంతా అయిపోయాక మీరు పిలవండి, తనని పంపిస్తాను అంటూ వైదేహిని తీసుకొని అక్కడి నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయారు ఆవిడ. ఇక్కడ ఒక గంట పాటు మాటలు జరిగిన తర్వాత పెళ్లి మూడు నెలల తర్వాత జరపాలని ముహూర్తం కూడా మాట్లాడేసుకున్నారు ఇరు కుటుంబ సభ్యులు. ఈ విషయం వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కూతుర్ని ఇంటికి పిలిచి తనకి చెప్పారు. “అదేంటి, మూడు నెలల్లో పెళ్లా అమ్మా?” అంటున్న వైదేహి మాటలని మధ్యలోనే అడ్డుక…