New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
శాడిస్ట్ లవ్ 💕 – 3

శాడిస్ట్ లవ్ 💕 – 3

 

రూప నీ ఆ బాత్ టబ్ లోనే వదిలేసి … బయట నుంచి వాష్ రూం డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆర్య.

 

 

తల నుంచి నీళ్లు కారిపోతూ అవి రూప కన్నీళ్ళతో కలిసిపోయి అలా మెల్లిగా కిందకి జారిపోతూ ఉంటే … అలాగే బాత్ టబ్ లో కూర్చుని ఏడుస్తూ వాళ్ళ అమ్మ , నాన్న నీ గుర్తు చేసుకుంటూ ఉంది రూప.

 

 

బెంగుళూర్ సిటీ కమీషనర్ ఒన్ అండ్ ఓన్లీ  డాటర్ డేరింగ్ అండ్ డాషింగ్  అల్లరి పిల్ల రూప..రూప చక్రవర్తి.

 

 

డాటర్ ఆఫ్ మారుతి చక్రవర్తి … మారుతి  చక్రవర్తి గారి భార్య మీనాక్షి కుమారి .

 

 

మారుతి , మీనాక్షి గారిది లవ్ మ్యారేజ్ … పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు.

 

 

వాళ్ళ ప్రేమకి గుర్తు వాళ్ళ ఒక్కగానొక్క ముద్దుల కూతురు రూప . 

 

 

మారుతి గారు ఆ సిటీ కమీషనర్ అయిన కూడా ఇంట్లో మాత్రం మీనాక్షి , రూప దగ్గర పిల్లి .

 

 

ముఖ్యంగా రూప ఏది చెప్తే అది కరెక్ట్ అంటూ చాలా గారాబంగా పెంచారు కూతురిని.

 

 

ఆయన గారాబం తో చాలా అల్లరి పిల్లలా తయారు అయ్యింది రూప… ఎంత అల్లరి చేస్తుందో అంతా డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయి కూడా.

 

 

మారుతి గారి ధైర్యం పునికి పుచ్చుకుంది … ఎంత అయిన కమీషనర్ కూతురు కదా ఆ మాత్రం ధైర్యం , తెగింపు బ్లడ్ లోనే ఉంటాయి కదా మరి.

 

 

కమీషనర్ కూతురు అయిన కూడా సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయి లాగ స్కాలర్షిప్ తో చదువుకొని , హాస్టల్ లోనే ఉంటూ తన ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా బతికింది.

 

 

నేను కమీషనర్ మారుతి చక్రవర్తి కూతురు లాగ కాకుండా నా సొంత కాళ్ళ మిద నిలబడాలి అని అనుకుంటున్నాను…అందుకే నా ఐడెంటిటీ ఎవరికి తెలియకూడదు అని వాళ్ళ నాన్న మారుతి గారి దగ్గర మాట తీసుకుంది.

 

 

ఈ రోజుల్లో  ఆడ పిల్లలు తల్లి తండ్రులు ఇచ్చిన ఆస్తులు చూసుకొని తల పొగరుతో విచ్చల విడిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి ఇచ్చిన ఫ్రీ డం నీ నాశనం చేసుకుంటూ ఉంటే …

 

 

నా కూతురు మాత్రం తన సొంత కాళ్ళ మిద తనే నిలబడాలి అనుకుంటుంది అంటే నాకు చాలా గర్వంగా ఉంది రా..! అంటూ కూతురి ఆలోచనను అభినందించి ఆయన కూడా రూప తన కూతురు అనే విషయం బయటికి చెప్పలేదు.

 

 

కానీ మీనాక్షి గారికి అది నచ్చలేదు…ఉన్న ఒక్కగానొక్క కూతురు వాళ్ళతో ఉండకుండా బయట ఉంటాను అనడం ఆవిడకి బాధగా అనిపించింది కానీ మారుతి గారు కన్విన్స్ చెయ్యడంతో ఒప్పుకుంది.

 

 

రూప సెలవులు ఇచ్చిన అప్పుడు అల్లా బెంగుళూర్ వెళ్లి మారుతి , మీనాక్షి గారిని చూసి వస్తూ ఉంటుంది.

 

 

రూప కి హైదరబాద్ లో సీట్ రావడంతో తను హైదరబాద్ లో వాళ్ళ కాలేజ్ హాస్టల్ లో ఉంటుంది.

 

 

రూప నార్మల్ టైం లో ఎంత అల్లరి చేస్తుందో … ఏదైనా తేడా వస్తె అలాగే తాట కూడా తీస్తుంది.

 

 

తను ఫస్ట్ రోజు కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు తన సీనియర్ ఒకరు తనని కిస్ చేసుకొని ప్రపోజ్ చెయ్యమని చెప్పాడు.

 

 

ముందు వాళ్ళకి భయపడుతున్నట్టు నటిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒకే ఒక్క పంచ్ వాడి పొట్టలో ఇచ్చి … లాగి చెంప మిద ఒక్కటి పీకి …

 

 

” రేయ్ దెడ్ దిమాక్ … ! నేను ఎవరు అనుకుంటున్నావు..? రూప .. రూప ఇక్కడ…నాతో పెట్టుకున్నావ్ అంటే తార్ మార్ తక్కడ్ మార్ అయిపొద్ది.” అని వార్నింగ్ ఇచ్చి…

 

 

నేరుగా ప్రిన్సిపాల్ రూం కి వెళ్లి ఆ సీనియర్ మిద కంప్లయింట్ ఇచ్చి కాలేజ్ లో జాయిన్ అయిన రోజే సీనియర్స్ నీ ఒక ఆట ఆడుకున్న లేడీ సింగం అని పేరు తెచ్చుకొని ఫుల్ పాపులర్ అయిపోయింది కాలేజ్ అంతా.

 

 

ఆ విషయం తెలుసుకున్న మారుతి గారు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు…

 

 

ఇలా చెప్పుకుంటూ వెళ్తే రూప గురుంచి చాల విషయాలు ఉన్నాయి…

 

 

ఇప్పుడు బాత్ టబ్ లో ఉన్న రూప తన నాన్న మారుతి , మీనాక్షి గారు గుర్తు వచ్చి ఏడుపు తన్నుకుంటూ వస్తుంది.

 

 

ఇంకో నాలుగు రోజుల్లో రూప బి. టెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతాయి.. ఆ తర్వాత తను బెంగుళూర్ వెళ్లి ఇంకా అక్కడే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటూ ఏదో ఒక జాబ్ చేసుకోవాలి అని అనుకుంది.

 

 

నిజానికి రూప కి కూడా వాళ్ళ నాన్న లాగ పోలీసు అవ్వాలి అని ఉంది కానీ మారుతి గారు ఎందుకో దానికి ఒప్పుకోలేదు..అందుకే ఇంకా బి. టెక్ లో జాయిన్ అయ్యింది.

 

 

ఇప్పుడు వాళ్ళ అమ్మ , నాన్న దగ్గరికి తను వెళ్ళడానికి అవకాశం లేకుండా చేశాడు ఆర్య…దానికి తోడు తనని బలవంతంగా పెళ్లి చేసుకొని తీసుకొచ్చి అక్కడ పడేశాడు.

 

 

రూప పెళ్లి మిద మారుతి , మీనాక్షి గారు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో రూప కి చాలా బాగా తెలుసు..

 

 

ఇప్పుడు వాళ్ళ ఆశల మిద  నీళ్ళు చల్లుతూ ఆర్య తనని పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చి టార్చర్ చేస్తాను అని బెదిరిస్తూ ఉంటే …

 

 

లైఫ్ లో ఫస్ట్ టైం రూప కి  ఆర్య నీ చూసి భయం మొదలు అయ్యింది…

 

 

మరి రూప ఏం చేస్తుంది…?

 

 

ఇప్పటి వరకు రూప మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుంటున్న ఆర్య కి తను బెంగుళూర్ సిటీ కమీషనర్ కూతురు అని తెలిస్తే అతని రియాక్షన్ ఎంటి..?

 

 

డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండే రూప ఇప్పుడు తన లైఫ్ లోకి వచ్చిన శాడిస్ట్ కమ్ సైకో ఆర్య బాబు నీ ఎదిరించి నిలబడగలదా లేదా అతని చేతిలో తన జీవితం బలి చేసుకుంటుందా..?

 

 

 

ప్లీస్ షేర్ యువర్ ఒపీనియన్ అన్ థిస్ స్టోరీ….

 

 

స్టోరీ చదివి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ 💖💖💖

 

 

కామెంట్స్ ముఖ్యం బిగిలు 🔥🔥

 

 

To be continued….