మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్…
బయట ఏడుస్తూ ఆందోళనగా కూర్చొని ఉంది పద్మావతి.
“ఎక్స్క్యూజ్ మీ! ఇక్కడ పేషెంట్ తరపు మనిషి ఎవరు?” అని ఒక నర్స్ వచ్చి అడగగానే, పద్మావతి భయంగా తలెత్తి చూస్తూ, “నేనేనండి, ఆయనకు ఎలా ఉంది?” అని అడుగుతుంటే, “అర్జెంట్ గా ఈ మెడిసిన్స్ కావాలి” అంటూ ఒక స్లిప్ ఇచ్చి వెళ్ళింది నర్స్.