Crazy ప్రేమమ్ – 2
శివరాం అన్నయ్య వదిన బలరాం, ఆమనిల కూతురు ఆముక్త..
ఆముక్త చిన్నప్పుడే తల్లీ తండ్రి చనిపోవడంతో.. అన్న వదినల మీద ప్రేమతో ఆముక్తని అలా వదిలేయలేక అప్పుడే తనతో పాటు తీసుకొచ్చి పెంచుకుంటూ.. ఆముక్తలోనే అన్నావదినలను చూసుకుంటున్నాడు శివరాం..
శివరాం భార్య సుకన్య వాళ్ళిద్దరికీ ఒక కూతురు సంయుక్త..
ఆముక్త అంటే పెద్దగా రాచి రంపాన పెట్టె కోపాలు, పంతాలు ఏం లేవు గానీ.. సొంత కూతురు కన్నా ఒకింత తక్కువే సుకన్యకి.
అక్కని అక్కా అని పిలవని గీర కాస్త ఎక్కువే కానీ.. మరీ అక్కని చులకనగా చూసేంత పొగరు లేదు సంయుక్తకి..
వీళ్లిలా ఉంటే శివరాం గారికి మాత్రం సంయుక్త ఎంతో ఆముక్త కూడా అంతే..ఇద్దర్ని ఒకేలా చూస్తాడు ప్రేమగా..
శివరాం ఓ ప్రెవేట్ కంపెనీలో మేనేజర్ గా వర్క్ చేస్తుంటే.. భార్య సుకన్య అదే కంపెనీలో తన కింద వర్క్ చేసే ఎంప్లొయ్.. ఇక ఆముక్త బి. టెక్ పూర్తి చేసి, జాబ్ సెర్చింగ్ లో ఉంటే.. సంయుక్త మోడలింగ్ వైపు వెళ్ళింది ఆ దిశగా తనకి ఇంట్రెస్ట్ ఉండడంతో..
శివరాం, సుకన్య ఇద్దరు టిఫిన్ చేసేసి.. లంచ్ కోసం క్యారియర్ కూడా పెట్టేసుకుని ఆఫీస్ కి వెళ్తూ.. ఆముక్తని కూడా టిఫిన్ చేసేయమని చెప్పి వెళ్ళిపోయారు..
ఇంట్లో ఉన్న ముగ్గురు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్లిపోవడంతో ప్రెసెంట్ ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్న ఆముక్త.. కిచెన్ లో సర్ది బయటకు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద ఉన్న పాయసం రారమ్మని పిలుస్తుంటే వెళ్లి.. కళ్ళకి అద్దుకుని ఓ పట్టు పట్టింది ఆముక్త..
అముక్తకి కాస్త దైవ భక్తి ఎక్కువ.. అందునా కార్తీకమాసం అవడంతో ఉపవాసం ఉండి, ఒంటి పూట భోజనమే చేస్తుంది ప్రతీరోజు..
పాయసం తినెప్పుడు గుర్తొచ్చింది అముక్తకి.. పిన్ని మాటలకి అనసూయ గారి మొహం వాడిపోవడం..
“ప్చ్, పాపం పిన్ని మాటలకి ఆంటీ ఎంత ఫీల్ అయ్యారో ఏంటో.. హ్మ్ అప్పుడు మాట్లాడలేదు కదా ఇప్పుడు వెళ్లి, కాసేపు మాట్లాడి వద్దాం.. ఈ బౌల్ ఇచ్చేసినట్టు ఉంటుంది.. అలానే ఆంటీ గారితో మాట్లాడినట్టు ఉంటుంది..!!” అనుకుని సుబ్బరంగా పాయసం తినేసి..
బౌల్ కడిగేసి, అది ఖాళీగా తీసుకెళ్లలేక, ఉదయమ్ తాను దేవునికి ప్రసాదం కోసం చేసిన కేసరి పెట్టుకుని వెళ్ళింది అదే బౌల్ లో..
@@@
ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన శివ్ ఆఫీస్ టైమ్ అవుతుండడంతో ఫాస్ట్ గా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టింది అనసూయ..
శివిన్ ఓ MNC కంపెనలో టీమ్ లీడర్ గా వర్క్ చేస్తున్నాడు.. పుట్టి పెరిగింది అంతా ఊర్లోనే అయినా బీటెక్ కోసం హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత క్యాంపస్ సెలక్షన్ లోనే జాబ్ కొట్టి, అటు జాబ్ చేస్తూనే ఎంబీఏ చేసి, ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యాడు..
హైదరాబాద్ లో మేనత్త ఉన్నా.. ఒంటరిగా రూమ్ తీసుకుని ఉండేందుకు ఇష్టపడతాడు ఎక్కువగా.. వారానికి ఓసారి అత్త దగ్గరకి వెళ్ళొస్తాడు.
లాప్టాప్ బ్యాగ్, ఫోన్ తీసుకుని, “అమ్మా నేను వెళ్తున్నా..!!“ అన్నాడు శివ్..
“శివా టిఫిన్ చేయకుండా వెళ్తావేంట్రా..?? “
“అమ్మా నేను కాంటీన్ తింటానే.. టైమ్ అయిపోతుంది.. జాగ్రత్త బయటికి ఎక్కడికి వెళ్లొద్దు.. నేను వచ్చేవరకు జాగ్రత్తగా ఉండు..!!” అని వెనక్కి తిరిగి తల్లికి జాగ్రత్తలు చెప్తూనే డోర్ ఓపెన్ చేసిన శివ్, ఎదురుగా చేతిలో కేసరి బౌల్ తో నిలబడి ఉన్న ఆముక్తని చూసుకోకుండా ఆమెకి డాష్ ఇవ్వడంతో..
బండలా ఉన్న శివ్ బాడీకి తగిలి వెనక్కి తూలి, తాను తీసుకొచ్చిన కేసరి లోని డ్రైఫ్రూట్స్ తన మీదే పడేసుకుని కింద పడబోతుంటే..
అసలు ముందుకు చూడకుండా గుద్దేసిన శివ్ సడన్ గా ఎదురుగా చూసి, కింద పడబోతున్న ఆముక్తని ఎక్కడ పట్టుకుని ఆపాలో అర్థం కాక.. ఏదైతే అదైందని ముందు చేతికి దొరికిన చోట పట్టుకుందాం అనుకున్న ప్రాసెస్ లో..
నేరుగా ఆమె నడుము దగ్గర పట్టుకుని గట్టిగా ముందుకు లాక్కున్నాడు తన మీదకి.
మొదటిసారి పరపురుషుడి చేతి వేళ్ళు తాకకూడనిప్లేస్ లో తాకడంతో పాపం ఆముక్త ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయింది..
శివ్ లాగిన లాగుడికి, ఎలా అయితే కింద పడిపోతాను అని ఫాస్ట్ గా కిందకి వెళ్లిందో.. అలానే ఏదో బంగీజంప్ లో రివర్స్ బటన్ నొక్కినట్టు అలానే మీదకి వచ్చి, శివిన్ ని అతుక్కుపోతుంటే..
సడన్ గా ఇద్దరి మధ్యలో మరోచేతిని కంకర్రాయిలా అడ్డుపెట్టాడు శివ్..
ఇంకేముంది రకరకాలుగా ఉంది మాస్టారు అన్నట్టు అయ్యింది ఆముక్త పరిస్థితి..
ఒకేరోజులో.. అహహ రెండే రెండు నిమిషాల్లో ఏదేదో జరిగిపోయింది తన ప్రమేయం లేకుండానే..
శివిన్ చెయ్యి నడుముని తాకినప్పుడు కోమాలోకి వెళ్ళినట్టే వెళ్లి జస్ట్ హాయ్ తో పాటు బాయ్ కూడా రెండో నిమిషంకే చెప్పి వచ్చేసినట్టు, శివిన్ చెయ్యి ఆమె యద మీద పడగానే ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసింది షాక్ తో..
ఈ ప్రాసెస్ లో పాపం ఆముక్త తెచ్చిన కేసరికి ముక్తి దొరక్క, ఎవరి దగ్గర ఉండాలో తెలీక, ఎవరి నోట్లో కరగాలో అర్థం కాక, ఇద్దరి మధ్యలో పడి నలిగిపోయింది..
@@@
continued..
Swipe left/right or tap the sides to turn pages