New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Crazy ప్రేమమ్ – 3

Crazy ప్రేమమ్ – 3

ఈ ప్రాసెస్ లో పాపం ఆముక్త తెచ్చిన కేసరికి ముక్తి దొరక్క, ఎవరి దగ్గర ఉండాలో తెలీక, ఎవరి నోట్లో కరగాలో అర్థం కాక, ఇద్దరి మధ్యలో పడి నలిగిపోయింది..

 

 

ఆ నలగడం నలగడం కాస్త శివిన్ షర్ట్ ను కూడా నలిపేసి, కేసరితో కలిపేసి పెంట పెంట చెయ్యడంతో.. ఇంకా కనురెప్పలు కొట్టకుండా బొమ్మలా చూస్తున్న ఆముక్తకి ముక్తి కలిగిస్తూ.. ఆమె షోల్డర్ మీద చెయ్యేసి స్టాండర్డ్ గా నిలబెట్టిన శివ్..

 

 

తనను కోపంగా చూస్తుండగానే.. కొడుకు వెళ్తా అని ఇంకా గుమ్మం దగ్గరే ఉండడం చూసి అనసూయ గారు బయటకు రావడం గమనించిన శివ్.. టక్కున ఆముక్త భుజాల మీద చెయ్యి తీస్తే..

 

 

“ఆముక్త నువ్వెంటమ్మా ఇక్కడ..?? అయినా ఇక్కడివరకు వచ్చి గుమ్మం లోనే ఆగిపోయావే..రా రా.. ” అని కొడుకు వదిలిన చేతిని పట్టుకుని తల్లి లోపలకి లాక్కెళ్తూ..

 

 

“ శివా.. నువ్వెంట్రా ఇంకా వెళ్లకుండా అక్కడే ఆగావ్..??” అని అడుగుతున్న అనసూయ, అప్పటికే లోపలికి వస్తున్న శివ్ షర్ట్ చూసి..

 

“ అరరే.. షర్ట్ ఎలా పాడయిపోయింది..? “ అడిగింది అయోమయంగా.

 

“ అది ఆంటీ.. ఇందాక నేనే చూసుకోకుండా..!!” అని జరిగింది మెల్లిగా చెప్పింది ఆముక్త..

 

“ ఓహ్.. అవునా పర్లేదమ్మా చూసుకోలేదు కదా.. నువ్విలా కూర్చో..!!” అని ఆముక్తని సోఫాలో కూర్చోబెట్టి..

 

“ అరే శివా ఈ అమ్మాయిని గుర్తుపట్టావా..?? నిన్నా.. “ అనసూయ చెప్తుండగానే అసలు పట్టించుకోనట్టు లోపలికి వెళ్లిన శివ్, ఐదు నిమిషాల్లో షర్ట్ చేంజ్ చేసుకుని రూమ్ లోంచి బయటకు వస్తూ..

 

దించిన తల ఎత్తకుండానే తల్లితో మాట్లాడుతున్న ఆముక్తని ఓసారి చూసి, మళ్ళీ ఫోన్ లో తల దూర్చి..

 

“బాయ్ మ్మా..!!” అని ఆముక్తని చూడకుండానే హడావిడిగా వెళ్ళిపోయాడు..

 

 

శివ్ వెళ్లెవరకూ అదురుతున్న గుండెని అరచేతుల్లో పెట్టుకుని.. అతను వెళ్ళాడు అనుకున్నాక ‘ హమ్మయ్య ‘ అని రిలాక్స్ అయింది ఆముక్త.

 

 

 

 

శివ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాక హమ్మయ్య అనుకున్న ఆముక్త అప్పుడు తలెత్తి మాట్లాడడం మొదలు పెట్టింది అనసూయ గారితో..

 

 

ఫస్ట్ తన మనసులో పొద్దున్నుండి ఉన్న డౌట్ నే అడిగేసింది ఆముక్త.

 

“ఆంటీ.. నేను నిన్న గుడిలో కీర్తనలు పాడిన విషయం మీకెలా తెలుసు.?? “ అని అడిగింది.

 

“ఓహ్ అదా.. నిన్న నేను నా కొడుకు ఇక్కడకి వచ్చాం ఈ ఓనర్ గారితో మాట్లాడాలని.. నువ్వు నిన్న కీర్తనలు పాడావే శివాలయం..

 

ఆ శివాలయం మీదుగానే మా ఆడపడుచు ఇంటికి వెళ్తుంటే.. దర్శనం చేసుకుని వెళ్దాం అని, గుళ్ళోకి వచ్చాము..

 

అక్కడ చూసా నిన్ను.. ఎంత మధురంగా పాడావమ్మా.. కాసేపు నేనుంది గుడిలో అన్న విషయమే మర్చిపోయేలా చేసింది నీ గొంతు..!!” మళ్ళీ పొగడ్తల్లో తడిపేసింది అనసూయ.

 

“ థాంక్స్ ఆంటీ..!మీకోసం ప్రసాదం తీసుకోచ్చాను కింద పడిపోయింది.!!”

 

 

“ పర్లేదమ్మా..!!” అంటూ ఆముక్తని వదిలి కిచెన్ లోకి వెళ్లిన అనసూయ.. కొడుకు కోసం వేసిన దోశని ప్లేట్ లో పెట్టుకుని తీసుకోచ్చింది తినమని.

 

 

ఆముక్త మొహమాటంగా వద్దంటున్నా.. అనసూయ మాత్రం ప్రేమగా బతిమాలడంతో.. ఇక తప్పక అనసూయ గారితో మాట్లాడుతూ ఇద్దరూ కలిసి తినేశారు.

 

@@@

 

ఆఫీస్ కి వెళ్లిన శివిన్ పార్కింగ్ లో కార్ దిగగానే.. “హయ్ శివ్..!!” అంటూ వచ్చి హగ్ తో పాటు చీక్ కిస్ కూడా ఇచ్చేసింది ఇషిత.

 

 

“హాయ్ ఇషితా..!!” అని నవ్వుతూ రిటర్న్ హగ్ తో తనని దూరం జరిపిన శివ్ ఎంట్రెన్స్ వైపు వెళ్తుంటే..

 

“శివ్.. శివ్.. శివ్..!” అని అరుస్తూ అతని చేతిని చుట్టేస్తూ..

 

“అప్పుడే లోపలికి వెళ్లి ఏం చేస్తావ్ చెప్పు.. ఎలానూ లాగిన్ అవడానికి ఇంకా టైమ్ ఉంది కదా.. కాసేపు కాంటీన్ కి వెళ్దాం ప్లీ…జ్..!!” అని గారంగా అడిగింది ఇషిత..

 

ఇషిత అతని టీమ్ లో వన్ ఆఫ్ ది మెంబెర్.. ఆమెకి అతనంటే క్రష్..కానీ శివ్ కి మాత్రం ఇషిత పట్ల ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు..

 

జస్ట్ కొలీగ్, టీమ్ మెంబెర్ అండ్ ఫ్రెండ్.. కాబట్టి తనతో జోవియల్ గా ఉంటున్నాడు..అంతకుమించి స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు శివ్ కి ఇషిత అంటే..

 

ఇక ఈ హగ్ లు కిస్ లు అంటే.. మొదట్లో తాను హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందిగానే ఫీల్ అయ్యేవాడు..

 

బట్ పోను పోను ఈ చిన్న చిన్న కిసెస్ పెద్దగా కొంపలంటుకునే తప్పులేం కాదని, తన ఆఫీస్ లో ఉన్న ఫాస్ట్ కల్చర్ కి ఇదంతా కామన్ అని అర్ధం అయ్యి, అదీ కాక, ఎప్పుడు తన చుట్టూ బట్టర్ ఫ్లైస్ లా తిరిగే వాళ్ళు అతను చెప్పినా వినే రకం కాదని సైలెంట్ అయ్యాడు.

 

 

ఆ ఫాస్ట్ కల్చర్ కి తగ్గట్టు, స్మోకింగ్, డ్రింకింగ్ వరకు వంట బట్టించుకున్న శివ్ అంతకుమించి డ్రగ్స్, డేటింగ్ వరకు అయితే వెళ్ళలేదు ఇప్పటివరకు.

 

 

 వద్దన్నా వదలని జండూబామ్ లా తనను అంటుకున్న ఇషితా ఇక వదలదని, పైగా తను కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోవడంతో కాంటీన్ వైపు నడిచాడు శివ్.

 

 

ఈలోగా తన టీమ్ మెంబెర్స్ ఐదుగురు జాయిన్ అవ్వడంతో వాళ్ళతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసి, టైమ్ అవ్వడంతో తన వర్క్ ప్లేస్ కి వెళ్ళిపోయాడు శివిన్.

 

 

వర్క్ విషయంలో ఎంత సిన్సియర్ గ ఉంటాడో తన టీమ్ మెంబెర్స్ తో అంతే జోవియల్ గా ఉంటు వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తూ…

 

 

6 ఫీట్స్ హైట్, హైట్ తగ్గ వెయిట్, పర్ఫెక్ట్ వి షేప్ బాడీ, వైట్ కలర్ స్కిన్ టోన్, కిల్లింగ్ లుక్స్, విశాలంగా ఉండే నుదురు, ఒత్తయిన కనుబొమ్మలు, నల్లటి మీసకట్టు, ట్రిమ్ చేసిన రఫ్ బియార్డ్,అమ్మాయిలు పడి చచ్చే మస్కులర్ ఫిజిక్ తో పిచ్చ హ్యాండ్సమ్ గా ఉండే శివ్ అంటే ఆ ఆఫీస్ లో అమ్మయిలందరికి హాట్ ఫెవరెట్ హల్క్..

 

 

ఆ ఆఫీస్ లోని అమ్మాయిలంతా శివిన్ టీమ్ లో ప్లేస్ కోసం న్యూ ప్రాజెక్ట్ టేకప్ టైమ్ లో ఎంత పరితపిస్తారో లెక్కే లేదు పాపమ్..

 

 

ప్రస్తుతనికి అతని టీమ్ లో ఉన్న అమ్మాయిలను చూసి కుళ్ళకుని చస్తారు కూడా..

 

 

ఈవినింగ్ వరకు వర్క్ లో బిజీగా ఉన్న శివిన్, లాగౌట్ అయ్యాక బయటకు వెళ్తుంటే… ”రేయ్ శివ్.. అప్పుడే ఇంటికెళ్లి ఏం చేస్తావురా.. వీకెండ్ లో ఉండే సండే అంటే ఎలాగూ మాకు టైమ్ ఇవ్వవు..కనీసం ఇప్పుడైనా మాతో బయటకు రావచ్చు కదరా..!!” అంటున్న నిఖిల్ పిలుపుకి ఆగి..నిఖిల్ తన కొలీగ్..

 

“అమ్మ ఉందిరా ఇంట్లో..!!” అన్నాడు శివ్.

 

“అయితే ఏంట్రా.. మనమేమైనా నీ ఫ్లాట్ కి వెళ్తామా ఏంటి.. పబ్ కే కదా..!!” కన్ను కొట్టాడు నిఖిల్.

 

“రేయ్ పోతావ్రరేయ్ నాశనమై పోతావ్.. ఆల్రెడీ నిన్న పీతలా తాగి పడిపోయావంట కదరా..!!” అని శివ్ అంటే..

 

“అందరం కలిసే నాశనం అయిపోదాం పదరా..!!” అన్నాడు ఇంకో కొలీగ్ నరేష్..

 

“ ఛీ.. ఛీ వెధవల్లారా మీతో కలిసి నేను కూడా చెడిపోతున్నారా..!!” అని శివ్ అంటే..

 

“ఉన్నది ఒకటే జిందగీ బావ..అందులో కూడా ఈ పద్ధతులు, పాకుండలు అవసరమా.. పోయి చెడిపోదాం రా బావా..!!” అంటూ బలవంతంగా శివ్ ని లాక్కెల్లి కార్ లో తోసారు ఆ ఇద్దరికీ ఇంకో ఇద్దరు జతకలిసి..

 

శివిన్ తో కలిపి అబ్బాయిలు ఐదుగురు అయితే.. ఇషిత తో పాటు నక్షత్ర కూడా కలిసి ఇద్దరమ్మాయిలతో ఐదుగురు అబ్బాయిలు కలిసి శివ్ కార్ లోనే పబ్ కి స్టార్ట్ అయ్యారు.

 

@@@@

 

continued…