New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Love you forever 💖 – 1

Love you forever 💖 – 1

 

అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పినట్టు చేస్తూ ఉంటాడ్ 40 ఏళ్ల రాజేంద్ర ప్రసాద్ గారు…

 

ఆయనకి చాల ఆస్తులు , డబ్బులు , వ్యాపారాలు , షాపింగ్ మాల్స్ ఉన్నాయి.

 

ఆయన ఆస్తి కొన్ని కొట్లుకి ఉంటుంది. కానీ ఆయన మొదటి భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయే సరికి ఇప్పుడు మళ్ళీ అతని డబ్బు నీ ఎరగా వేసి ఇంకో అమ్మాయి నీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు…

 

పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుందా అని ఆశగా , కోరికతో చూస్తూ ఉంటాడు.

 

పది నిమిషాల తర్వాత అతని ఎదురు చూపులు ఫలిస్తూ….అప్పుడే నలుగురు ఆడవాళ్ళు బుట్ట బొమ్మలా ముద్దుగా ఉన్న 20 ఏళ్ల ఒక కుందనపు బొమ్మని తీస్కొని వచ్చి , అతని పక్కన పీటల మిద కుర్చోబెడతారు..

 

ముదురు ఆకుపచ్చ రంగు చీరకి ఎరుపు రంగు బోర్డర్ అంచు తో , సింపుల్ అలంకరణతో , నుదుటిన బాసికం , బుగ్గన చుక్క ఆ అమ్మాయి అందాన్ని ఇంకా పెంచుతూ ఉంటే…..

 

 

పెళ్లికి వచ్చిన అందరు ఆ అమ్మాయి గురించే మాట్లాడుకుంటూ , తనని చూసి జాలి పడుతూ ఉంటారు..

 

 

పీటల మిద కూర్చున్న ఆ అమ్మాయి కళ్ళు కన్నీళ్ళతో నిండి పోయి ,మొహం అంతా పాలిపోయి పెళ్లి కూతురు కళ లేకుండా ఏడుపు మొహంతో ఉంటుంది..

 

 

పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా  రాజేంద్ర గురించి మాట్లాడుకుంటూ ” వాడికి ఈ వయసులో మళ్లీ రెండో పెళ్లి అంట. అది కూడా చుక్కల ఉన్న ఆ అమ్మాయితో ఏంటో అంతా డబ్బు మహిమ . 

 

ఆ పిల్ల కి చూస్తే నిండా 20 ఏళ్లు ఉన్నట్టు కూడా లేవు. ఏంటో చూస్తు చూస్తూ ఆ పసి పిల్ల గొంతు కొస్తున్నాడు ఆ పిల్ల నాన్న. ” అని మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి నీ చూసీ జాలి పడుతూ ఉంటారు.


ఆ అమ్మాయి తండ్రి ఓ పక్కన తూలుతూ నిలబడి రాజేంద్ర మనిషి తో గొడవ పడుతూ ఉంటాడు..

 

” నాకు మీరు కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు 50 లక్షలే చేతిలో పెట్టారు..మిగిలిన డబ్బు ఇస్తేనే నా కూతురు ఈ పెళ్లి చేసుకుంటుంది.

 

 

లేకపోతే ఇప్పుడే నా కూతురు నీ తీసుకొని వెళ్ళిపోతా….” అని చెప్తాడు మత్తుగా మాటలు తడబడుతూ ఉంటే.

 

 

అతని మాటలకి పీటల మీద కూర్చొని , పెళ్లి కూతురిని కోరికతో చూస్తూ ఉన్న రాజేంద్ర ప్రసాద్ చిరాకుగా  అతన్ని చూస్తూ , అతన్ని పక్కకి తీసుకొని వెళ్ళిపోమన్ని అతని మనుషులకి సైగ చేస్తాడు.

” అబ్బా పెళ్లి అయ్యాక ఇస్తాము లే ఇక్కడ గొడవ చెయ్యకు…..అసలే మా సార్ కి ఇలా గొడవలు అంటే నచ్చవు. ముందు ఇక్కడ నుంచి పక్కకి పదా….!  ”  అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నీ మండపం నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు రాజేంద్ర మనిషి.

 

మరో పక్క పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే , ” చదివిన మంత్రాలు చాలు కానీ తాళి కట్టించు ఇంకా ” అని చెప్పిన రాజేంద్ర మాటకి సరే అని తల ఊపి, రాజేంద్ర చేతికి తాళి బొట్టు ఇచ్చి అమ్మాయి మెడలో కట్టమని చెప్తాడు పంతులు గారు.

 

ఆ మాట చెప్పడం ఆలస్యం అనట్టు వెంటనే తాళి తీసుకొని  వంకరగా నవ్వుతూ ఆ అమ్మాయి మెడలో కడతాడు రాజేంద్ర.

 

ఆ తాళి ఆ అమ్మాయి మెడలో పడగానే తన కళ్ళలో నీళ్ళు జల జలా జారిపోతాయి…

 

తన గుండెల మీద పడిన తాళి నీ చూసుకుంటూ రెండు చేతులు నోటికి అడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది…

 

అక్కడ ఉన్న అందరికీ ఆ అమ్మాయి నీ చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతు ఉంటుంది.

 

కన్న తండ్రే తాగుడు కోసం కూతురు నేరెళ్ళ జీవితాన్ని  నాశనం చేస్తూ ఉండడం చూసి … అసలు అలాంటి వాడు ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే అని అతన్ని అసహ్యించుకుంటూ , ఆ అమ్మాయి బాధ నీ చూసి జాలి పడుతూ ఉంటారు.

 

అలా ఒక అరగంట తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కి మిగిలిన డబ్బులు ఇచ్చి……

 

అతన్ని ఇంకా ఎప్పుడు రాజేంద్ర కంటికి కనిపించకూడదు అని వార్నింగ్ ఇచ్చి ,  ఆ అమ్మాయి నీ తీస్కొని తన ఇంటికి కార్ లో స్టార్ట్ అయ్యాడు రాజేంద్ర ప్రసాద్….

 

 

కార్ లో కూర్చొని ఉన్న ఆ అమ్మాయి …తనని డబ్బు కోసం అమ్మిన నాన్న మిద కోపం , మరో పక్క తన లైఫ్ ఏం అయిపోతుందో అనే భయం తో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది….

 

అదే టైం కి మరో ప్లేస్ లో….

 

అతను ఎంతగానో ప్రేమించి , పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయికి ఆక్సిడెంట్ అయ్యింది అని తెలిసి బాధగా ఆమె కోసం ఆఫీసు నుంచి హాస్పటల్ కి స్టార్ట్ అయ్యాడు ఒక అబ్బాయి ..

 

అసలు ఆ అమ్మాయి ఎవరు….?

 

ఆమె కథ ఎంటి….?

 

ఇప్పుడు ఆ రాజేంద్ర ప్రసాద్ చెర నుంచి ఆమె లైఫ్ నీ కాపాడే వ్యక్తి ఎవరు…?

 

To be continued…..