డాక్టర్ చేతిలోకి ఇంజెక్షన్ తీసుకుని కళ్లు రెండు గట్టిగా మూసుకొని ……….. !! అనవసరంగా డబ్బులుకు ఆశ పడి ఇలాంటి పనికి ఒప్పుకున్నాను ………. !! డాక్టర్ వృత్తి లో ఉండి ఇలా చేయటం నిజంగా చాలా తప్పు ……… !! కానీ నాకు డబ్బు అవసరం లేదు ఎంత అవసరం అయినా ఇంకో సారి ఇలాంటి పని చేయకూడదు …….. !! అసలే ఈ వరుణ్ ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం ఏ చిన్న అనుమానం వచ్చినా ………. !! నన్ను బ్రతికుండగానే నాకు నిప్పు అంటిస్తాడు కాబట్టి జాగ్రత్తగా డౌట్ రాకుండా ఈ డ్రగ్ ఈయన బాడీ లోకి ఇన్జెక్ట్ చేయాలి ……… !!
డాక్టర్ వాట్ హ్యాపెండ్ ………. ?? ఎదో ఇంజెక్షన్ చేయాలని అలా ఇంజెక్షన్ చేతిలో పట్టుకుని ఎమ్ ఆలోచిస్తున్నారు ………. ??