పగిలిన మనసు  – 4

పగిలిన మనసు – 4

Sravani Naramala

Author

తనూ ఏడుస్తూ బస్ లో హైదరాబాద్ వచ్చేసి అక్కడి నుంచి హాస్టల్ కు  వెళ్లిపోతుంది ……. ఆ రోజు సండే అవ్వడం తో గీతు అపుడే లేచి ఫ్రెష్ అయి వాళ్ళ అమ్మ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా  తనూ ఏడ్చుకుంటూ రూమ్ లో కి వచ్చి బ్యాగ్ కోపంగా విసిరేసి బెడ్ మీద వెల్లకిలా పడుకొని ఏడుస్తూ ఉండడం గమనించిన గీతు అమ్మ నేను మళ్ళీ కాల్ చేస్త అని చెప్పి కాల్ కట్ చేసి  కంగారుగా తనూ దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చుని తనూ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతుంది …….

తనూ గీతు ను గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంది తప్పా ఎమ్ చెప్పడం లేదు….. గీతు కు ఏమ్ అర్తం కాకపోయినా తనూ ను ఓదారుస్తూ వుంది……  కాసేపటికి తనూ నార్మల్ అవ్వడం చూసి తనకు వాటర్ బాటిల్ తీసుకుని ఇస్తుంది …….తనూ పైకి లేచి కూర్చుని కన్నీళ్లు తుడుచుకుని ఆ బాటిల్ లో వాటర్ కొద్దిగా తాగి పక్కన పెట్టేస్తుంది…….

తనూ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ?? నిన్నే గా వెళ్ళావ్ అప్పుడే వచ్చేసావ్ ఏంటి?

డాడీ ప్రవీణ్ తో నా పెళ్ళికి ఒప్పుకోలేదు అందుకే ఇంట్లో నుండి బయటకు వచ్చేసా అని ఏడుస్తూ చెప్తున్న తనూ ను చూసిన గీతు  షాక్ అయ్యి పైకి లేచి నిల్చుని ఏంటి అంటూ షాకింగ్ గా చూస్తూ అడుగుతుంది…..

నేను చాలా ట్రై చేసానే కన్విన్స్ చేయడానికి కానీ డాడీ ఒప్పుకోలేదు అందుకని……

ఏమ్  మాట్లాడుతున్నావ్ తనూ  అంకుల్ ఒప్పుకోలేదు అని ఇంట్లో నుండి వచ్చేసావా

అవును ☹️☹️ నాకు ప్రవీణ్ అంటే చాలా ఇష్టం తనతో తప్పా వేరొకరితో నా లైఫ్ ఇమాజిన్ చేసుకోలేను అందుకే వచ్చేసా……

పిచ్చి పట్టిందా తనూ నీకేమైనా ముక్కు మొహం తెలియని వాడి కోసం నిన్నే ప్రాణంగా  భావించి  బతికిన  మీ డాడీ ను వదిలేసి వచ్చావా ఆయన నీ కోసం ఎన్ని చేశాడో మర్చిపోయావా

నేను ఎదీ మర్చిపోలేదు & నాకు కూడా రావడం ఇష్టం లేదు గీతు కానీ డాడీ 😭😭 ప్రవీణ్ తో పెళ్లికి ఒప్పుకోలేదు అంటూ తల వంచుకుని మౌనంగా ఏడుస్తుంది……

అందుకని మీ డాడీ ను కాదనుకుని వచ్చేసావా

నాకు ప్రవీణ్ తప్ప ఎవరు వద్దు

ఆ ప్రవీణ్ కోసం ఎవరిని అయిన వదులుకుంటావా ఆఖరికి మీ డాడీ ను కూడా??

అవును నాకు ప్రవీణ్ మాత్రమే ముఖ్యం అని చెప్పి వాష్ రూమ్లో కి వెళ్ళి పోయిన తనూ  ను చూసి షాక్ అవుతుంది గీతు….. తనకు ఎలా రీఆక్ట్ అవ్వలో కూడా తెలియడం లేదు ……. తనూ రెడీ అయి గీతు తో బయటకు వెళ్తున్నా అని చెప్పి ప్రవీణ్ దగ్గరకి వెళ్తుంది ………

గీతు వెంటనే ప్రభాకర్ కు కాల్ చేసి మాట్లాడుతుంది ప్రభాకర్ గుండెలు బాదుకుంటూ ఏడవడం తో గీతు ఆయనకు ధైర్యం చెప్తుంది ……. ప్రభాకర్ ఏమ్ మాట్లాడకుండా తనూ జాగ్రత్త గీతు అని చెప్పి కాల్ కట్ చేయడం తో గీతు  కు ఏమ్ అర్తం కావడం లేదు……  తనూ పూర్తిగా ప్రవీణ్ మాయలో పడింది & ఎం చెప్పిన వినే స్థితిలో లేదు……

మరో వైపు తనూ ప్రవీణ్ దగ్గరకు వెళ్లి మన పెళ్లికి డాడీ ఒప్పుకోలేదు అందుకే ఇంట్లో నుండి వచ్చేసా అని చెప్తుంది …… అది విన్న  ప్రవీణ్ బాధ పడుతూ వున్నట్టు యాక్ట్ చేసి అనవసరంగా మిమ్మల్ని విడదీసాను తనూ నన్ను క్షమించు అని ముసలి కన్నీరు పెట్టుకోవడం తో   తనూ ఏడుస్తూ ప్రవీణ్ ను హగ్ చేసుకుని నీ మంచి తనం చూసి డాడీ నే మళ్లీ ఒప్పుకుంటారు …….

ప్రవీణ్ తన ప్లాన్ సక్సెస్ అయినందుకు తనూ ను ఇంకా గట్టిగా పట్టుకుంటాడు…… తనూ ఇంకా ప్రభాకర్ ను తలచుకుని ఏడుస్తూ వుంటే ప్రవీణ్ తన మూడ్ చేంజ్ చేయడానికి ఆ రోజు మొత్తం తనూ తో టైం స్పెండ్ చేస్తాడు …… తనూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనను ఇంతగా అర్తం చేసుకునే వ్యక్తి తన లైఫ్ లో కి రాబోతున్నాడు అని అలా నైట్ వరకు తిరిగి నైట్ తను ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు ……..

తనూ నవ్వుతూ రావడం చూసి గీతు షాక్ అవుతుంది …     ఇదంతా ఆ ప్రవీణ్ మాయ అని అర్తం చేసుకుని ఇంకేం చేయలేక సైలెంట్ గా ఉండిపోయింది……… తనూ ఆ రోజు నుంచి ప్రవీణ్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వుంటుంది &ప్రభాకర్ కాల్ చేస్తూ వున్న లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ వుండేది …….

తనూ తన కాల్ కట్ చేయడం చూసి ప్రభాకర్ చాలా బాధ పడేవారు ……..  తనూ ఒక్కో సారి హాస్టల్ కు వచ్చేది కాదు గీతు ఫోన్ చేస్తే ప్రవీణ్ లిఫ్ట్ చేసి తను అలసిపోయి పడుకుంది అని చెప్పేవాడు …….. అది విన్న గీతు  కు చాలా కోపం వచ్చేది ఇక తను కూడా ఏమ్ చేయలేక తన పని తను చేసుకుంటూ వుంటుంది……

 

ప్రవీణ్ టైమ్ చూసి తన అసలు రంగు  బయట పెడతాడు …… తనూ మనం ఎలాగో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా నువ్వు హాస్టల్ లో నేను ఇలా ఫ్లాట్ లో వుండడం దేనికి రా??   ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో వుంటే ఇద్దరం హ్యాపీగా వుంటూ అఫీస్ కు కలిసి వెళ్తూ వుండచ్చు అని అంటాడు …….

అందుకు తనూ కూడా ఏమ్ ఆలోచించకుండా ప్రవీణ్ మీద వున్న నమ్మకం తో ఓకే అంటుంది …….తనూ ఓకే అనడం తో ప్రవీణ్ ఆనందానికి అవధులు లేవు ఇక నుండి తనూ తో ఫుల్ గా ఎంజాయ్ చేయచ్చు అని తెగ సంతోష పడతాడు……. గీతు ఎంత బతిమాలినా వినకుండా హాస్టల్ వేకెట్ చేసి ప్రవీణ్ ఫ్లాట్ కి షిఫ్ట్ అవుతుంది …….

మార్నింగ్ ఆఫీస్ కు వెళ్ళడం ఈవెనింగ్ రావడం కలిసి కుక్ చేసుకోవడం ……..నైట్ తనూ ఎంత వద్దు అన్నా ఎలాగోలా తనను కన్విన్స్ చేసి తనూ తో బెడ్ రూమ్ షేర్ చేసుకునేవాడు ……..  ఇదే ప్రతి రోజు జరుగుతూ ఉంటుంది తనూ కూడా కొద్ది రోజులకు ప్రవీణ్ కు అడ్డుచెప్పలేదు & ప్రవీణ్ ను తన భర్త లా ఫీల్ అవుతూ ప్రవీణ్ అడిగింది ఎది కాదనేది కాదు ……

తనూ ను పూర్తిగా తన మాయలోకి తెచ్చుకున్నాడు ప్రవీణ్……  తను ఏమ్ చెప్పిన కాదనకుండా చేసేది …… తనూ తో ఇలా వుంటూనే ప్రవీణ్ బాగా డబ్బు వున్న లావన్య ను కూడా లవ్ చేసేవాడు ………కొద్ది రోజులకు లావణ్య కూడా ప్రవీణ్ ను లవ్ చేయడం స్టార్ట్ చేసింది …..   ప్రవీణ్ లావణ్య ను తనూ తో ఎంజాయ్ చేసినట్టు చేయకుండా తనను మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు…….

అందుకు కారణం లావణ్య దగ్గర వున్న డబ్బు లావన్యా ను మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లో సెటిల్ అవచ్చు అనే ఉద్దేశ్యంతో తనూ కు తెలియకుండా లావణ్య ను మీట్ అవ్వడం తనతో  మూవీస్, రెస్త్రేంట్ & పాబ్స్, మాల్స్ అన్ని తిరిగేవాడు …….  తనూ తో బయటకు వెళ్ళడం పూర్తిగా తగ్గించేసాడు…… తనూ కూడా తన ఆఫీస్ వర్క్స్ వల్ల అంతగా  ఏమ్ పట్టించుకోలేదు …….

 

క్రమక్రమంగా తనూ ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసాడు మార్నింగ్ తను ఒకడే ఆఫీస్ కు వెళ్ళేవాడు & తనూ కూడా ఎదైన ఇంపార్టెంట్ వర్క్ అయ్యుంటుంది అందుకే ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ ఉండేది…… తనూ కాల్స్ చేసిన కట్ చేయడం లేట్ నైట్ ఇంటికి రావడం తను వద్దు అన్న నైట్ మాత్రం దగ్గరికి తీసుకునే వాడు ………మళ్లీ మార్నింగ్ అవుతే ఏమ్ పట్టించుకోకుండా వెళ్ళేవాడు ……..

తనూ కు ఏమ్ అర్తం కావడం లేదు మార్నింగ్ తను మాట్లాడిన మాట్లాడాడు   కానీ 🌃 మాత్రం ఎంత వద్దు అని చెప్పినా వదలడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు……?? ఫోన్ ఎపుడు బిజీ అని వస్తూ ఉంటుంది అంతగా ఎవరితో మాట్లాడుతున్నాడు …….   నేను ఏమ్ చేశానని నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నాడు అని బాధ పడుతూ ఉంటుంది……..

తనూ కు మూడు రోజుల నుండి కళ్ళు తిరగడం వామిట్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది……  తనూ కు ఎందుకో డౌట్ వచ్చి హాస్పిటల్ కు వెళ్లి చెక్ చేయించుకుంటుంది ……  డాక్టర్ తన రిపోర్ట్స్ చూసి తను కన్సీవ్ అయింది అని చెప్తుంది అది విన్న  తనూ షాక్ అవుతుంది డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ తీసుకుని బయటకు వచ్చి ఆటో ఎక్కుతుంది ……..

 

ఎన్ని సార్లు ప్రవీణ్ కు కాల్ చేసినా కట్ చేస్తూ వుంటాడు …… తనూ కు ఏమ్ చేయాలో అర్థం కాలేదు ….. అలాగే  ఫ్లాట్ కు వెళ్లి బెడ్ మీద కూర్చుని తన బొజ్జని ను తడుముకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది ……. తనకు ప్రభాకర్ చాలా గుర్తు వస్తున్నాడు వాళ్ళ నాన్న పట్ల తను చేసిన విషయం గుర్తు రాగానే గట్టిగా ఏడుస్తూ ఉంది……. అపుడే తనకు గీతు నుండి కాల్ రావడం తో కన్నీళ్లు తుడుచుకుని కాల్ లిఫ్ట్ చేస్తుంది ……

ఫోన్ లో గీతు చెప్పిన విషయం విని తనూ నోటి నుంచి మాట కూడా రావట్లేదు షాక్ లో వుండి పోయింది …….