పగిలిన మనసు -2
ప్రీతి, తనూ ఇద్దరు రెడీ అయి ప్రీతి ఫ్రెండ్ బర్త్డే పార్టీ రెస్టారంట్ లో జరుగుతూ వుండడం వల్ల ఇద్దరు క్యాబ్ బుక్ చేసుకుంటారు……. !! అది రాగానే ఇద్దరు క్యాబ్ లో రెస్టారెంట్ కు స్టార్ట్ అయ్యారు ……. !! క్యాబ్ ఒక రిచ్ రెస్టారెంట్ ముందు ఆగగనే ప్రీతి నే క్యాబ్ కు అమౌంట్ పే చేసి తనూ ను రెస్టారెంట్ లోపలికి తీసుకుని వెళ్తుంది ……!!
తనూ రెస్టారెంట్ మొత్తం చూస్తూ ముందుకు నడుస్తూ ……. !! అమ్మో ఈ రెస్టారెంట్ ఎంత రిచ్ గా వుందో అని ఫస్ట్ టైమ్ అంత పెద్ద రెస్టారెంట్ చూడ్డం తో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది……..!!
ఏయ్ తనూ ఏంటి అలా చూస్తున్నావ్ ……??
ఈ రెస్టారెంట్ చాలా రిచ్ గా ఉంది ప్రీతి నీ ఫ్రెండ్ బాగా రిచ్ అనుకుంటా …..??
హా వాడు చాలా రిచ్ తనూ ……. !!
ఓ… అవునా ఇంతకీ తను ఏమ్ చేస్తూ వుంటాడు ……..??
ఇక్కడే హైదరాబాద్ లో &&&& కంపెనీ లో టీమ్ లీడర్ గా వర్క్ చేస్తూ వున్నాడు ……. !!
నిజమా నీ ఫ్రెండ్ గ్రేట్ ప్రీతి అంత పెద్ద కంపెనీ లో వర్క్ చేస్తున్నాడు……!! ఆ కంపెనీ లో జాబ్ రావడం చాలా కష్టం కదూ ……!! నేను కూడా ఆ కంపెనీ లో జాబ్ ట్రై చేసాను బట్ కొంచెం లో మిస్ అయింది….. !!
వాడు చాలా ట్యాలెంట్డ్ తనూ …….!!
ఓన్లీ ఫ్రెండ్ ఏనా లేక లవ్ లో ఉన్నారా ……..??
హేయ్ నో నో అలాంటిదేం లేదు వుయ్ అర్ జస్ట్ ఫ్రెండ్స్ …….!!
నేను నార్మల్ గా అడిగా ఎందుకంత కంగారు …… !!
ఇట్స్ ఓకే ఎమ్ లేదు కానీ పదా అదిగో అక్కడ వున్నారు మన వాళ్ళు అనగానే …….!! ఓకే అని ప్రీతి తో కలిసి అక్కడికి వెళ్తుంది తనూ…….!? ప్రీతి బొకే తీసుకుని ఆ అబ్బాయికి ఇస్తు హ్యాపీ బర్త్డే ప్రవీణ్ అని విష్ చేస్తుంది……..!!
ప్రవీణ్ నవ్వుతూ థాంక్స్ ప్రీతి అండ్ థాంక్స్ ఫర్ కమింగ్ అంటూ ప్రీతి పక్కనున్న తనూ వైపు చూస్తాడు………
ప్రవీణ్ తను నా ఫ్రెండ్ తనూజ అండ్ తనూ వీడు ప్రవీణ్ నా ఫ్రెండ్ అంటూ ఒకరిని ఒకరికి పరిచయం చేస్తుంది…….
తనూ బొకే తీసుకుని ప్రవీణ్ కు ఇస్తు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ప్రవీణ్ గారు అని విష్ చేయగానే ప్రవీణ్ బొకే తీసుకుని నవ్వుతూ థాంక్స్ తనూజ అండ్ కాల్ మీ ప్రవీణ్ నో గార్లు, బూర్లు ఓకె
తనూజ నవ్వి 😁😁 అలాగే ప్రవీణ్
ప్లీజ్ కూర్చోండి అనగానే ప్రీతి తనూజ పక్కన కూర్చుంటూ వుండగా ప్రవీణ్ సైగ చేయగానే ప్రీతి నవ్వుతూ వేరే చైర్ లో కూర్చుంది ప్రవీణ్ వచ్చి తనూజ పక్కన కూర్చున్నాడు……. ప్రవీణ్ పక్కన కూర్చోవడం చూసి పైకి లేవాలి అని చూస్తుంది తనూ బట్ అలా లేవడం పద్దతి కాదు అని సైలెంట్ గా ఉండిపోయింది …….
ప్రవీణ్ తనూ ను తినేసేలా చూస్తూ ఉన్నాడు అది చూసిన ప్రీతి ప్రవీణ్ ను గమనించి మెల్లగ రేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు కాస్త చూపు మార్చు ……
ప్రవీణ్ నవ్వి ఎవరే ఇది ఇంత అందంగ వుంది ఎప్పుడు చూడనే లేదు అని చిన్నగా గుస గుస గా చెప్తాడు
ష్ రేయ్ మెల్లగ తనూ కి వినిపిస్తుంది…..
అది వినట్లేదు లే ఆ కావేరి వాళ్ళ తో మాట్లాడుతూ ఉంది కానీ నువ్వు చెప్పు ……
నా రూమ్ మేట్ రా పేరు తనూజ &&& కంపెనీ లో జాబ్ చేస్తోంది ……. అది నా టైప్ కాదు పక్కా ట్రెడిషనల్ అంతే కాదు పల్లెటురి అమ్మాయి ……..
అబ్బబ్బా ఏముందే
అది నీకు పడదు రా అనవసరంగా టైమ్ వేస్ట్
అబ్బచ్ఛా ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెల్సు నువ్వు కామ్ గా వుండు ……..
సరే నీ ఇష్టం అని సైలెంట్ గా ఉండిపోయింది ప్రీతి……..
ప్రవీణ్ వెయిటర్ ను పిలిచి తనే ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు ……. అందరు కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా డిన్నర్ చేస్తారు అప్పటికే టైమ్ 7;30 అవ్వడం తో తనూజ ప్రీతి ను పిలుస్తుంది ……
ప్రీతి …..!!
జ్యూస్ సిప్ చేస్తూ ఏంటి తనూ
స్టార్ అవుదాం ప్రీతి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి లేట్ అయితే ఆటోలు కూడా వుండవు …… తను మాటలకు ప్రీతి ప్రవీణ్ వైపు చూస్తుంది తనకు ప్రవీణ్ ఏదో సైగ చేయగానే అయ్యో తనూ నీకు చెప్పనే లేదు కదా ఇవాళ నేను హాస్టల్ కి రావడం లేదు పెదమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ……
అవునా సరే ప్రీతి నేను వెళ్తాను
ఒక్క దానివే ఎలా వెళ్తావ్ అంటూ ప్రవీణ్ అని ప్రవీణ్ ను పిలవగానే ఏమ్ తెలియనట్టు ఏంటి ప్రీతి అంటూ వీళ్ళ దగ్గరకు వస్తాడు ప్రవీణ్……
ప్రవీణ్ నువ్వు ఏమ్ అనుకోకుండా తనూ ను కొంచెం హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తావా …… ఈ టైమ్ లో ఆటో, క్యాబ్ అంటే సేఫ్ కాదు పైగా తనూ ముందే చాలా ఇన్నోసెంట్ ……
యాహ్ నో ప్రాబ్లెమ్ ప్రీతి నేను డ్రాప్ చేస్తాను
థాంక్స్ ప్రవీణ్
ప్రవీణ్ ఫేక్ స్మైల్ ఇస్తు తను ను చూస్తూ ఉండగా తనూ నిన్ను ప్రవీణ్ డ్రాప్ చేస్తాడు వెల్లు అంటూ తన వైపు చూడగా నో ప్రాబ్లెమ్ ప్రీతి నేను వెళతాను అని పైకి లేస్తుంది …….
కానీ తనూ నువ్వు ఒక్క దానివే
నో ప్రాబ్లెమ్ యూ గాయ్స్ కారియన్ అని చెప్పి వెళ్లిపోతుంది అది చూసిన ప్రీతి ప్రవీణ్ వైపు చూస్తూ చెప్పానా నేను అది నీకు పడదు అని అనగానే ప్రవీణ్ నవ్వుతూ తన బైక్ కీస్ పాకెట్ నుండి తీసుకుని నేను ఇవాళ తనూజ ను నా బైక్ లో ఎక్కించుకుంటా & వన్ వీక్ లో దాన్ని పడేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు అది చూసిన ప్రీతి నవ్వి మిగిలిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంది…….
తనూజ బయటకు వెళ్లి కొద్ది దూరం నడవగానే తనకు ఆటో కనిపిస్తుంది ……. ఆ ఆటో వాడి దగ్గరకు వెళ్లి అడ్రస్ చెప్పి ఎంత అవుతుంది అని అడగ్గానే వాడు తనూజ చెయ్ పట్టుకుని అసహ్యంగా మాట్లాడుతూ వుంటాడు …….తన చుట్టూ పక్కల ఎవరు వుండరు తనూజ కు వాడిని చూస్తుంటే బయంగ అనిపిస్తూ ఉంటుంది……..
వాడి పట్టు నుండి తన చెయ్ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ వుంది కాని వాడు అస్సలు వదలడం లేదు తనూజ ను బలవంతంగా ఆటో ఎక్కిస్తూ వుంటాడు ….. తనూజ వాడి నుండి పారిపోవడానికి ప్రయత్నించిన వాడు వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు …… అప్పుడే అక్కడికి బైక్ మీద వచ్చిన ప్రవీణ్ అది చూసి ఈ సీన్ నాకు యుస్ అయ్యేలా వుంది అని అనుకుని బైక్ స్టాండ్ వేసి కోపంగా ఆటో డ్రైవర్ కాలర్ పట్టుకుని లాగి వాడి చెంపలు వాయిస్తాడు …….
వాడు ప్రవీణ్ ను చూసి బయపడి ఆటో లో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ….. ప్రవీణ్ తనూజ దగ్గరకు వెళ్లి బుజం మీద చేయి వేయడమే తనూ ప్రవీణ్ చేయి పట్టుకుని ఏడుస్తూ ఉంది
ఏయ్ తనూజ రిలాక్స్ నీకేం కాలేదు
తనూ వెక్కి వెక్కి ఏడుస్తూ నువ్వు టైం కు రాకపోయుంటే ఏమ్ అయ్యేది ప్రవీణ్ యూ సేవ్ మై లైఫ్ థాంక్ యూ అంటూ ఉండగా ఆ సిచుయేషన్ ను అడ్వాంటేజ్ గా తీసుకున్న ప్రవీణ్ తనూజ ను హగ్ చేసుకుని వెన్ను నిమురుతూ ఇట్స్ ఓకే తనూ ఇప్పుడు ఏమ్ అయింది నేను వచ్చాను కదా ఎడవకు అని తన కన్నీళ్లు తుడుస్తాడు ……
తనూ ఇబ్బందిగా ప్రవీణ్ నుండి దూరం జరిగి థాంక్స్ ప్రవీణ్ యూ మేడ్ మై డే థాంక్స్ ఏ లాట్ అనగానే
ఇట్స్ ఓకే తనూ నౌ వుయ్ అర్ ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇవ్వగానే తనూ కూడా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తుంది ……
నువ్వు ఈ టైమ్ లో ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు కమ్ ఐ విల్ డ్రాప్ యూ …… తనూ కి కూడా ఇందాక జరిగిన ఇంసిడేంట్ వల్ల ఇంకేం చేయలేక ఓకే అని అంటుంది అది విన్న ప్రవీణ్ యా ప్లాన్ సక్సెస్ అని నవ్వుకుని బైక్ స్టార్ట్ చేసాడు…. తనూ వన్ సైడ్ ఎక్కి కొంచెం దూరం లో కూర్చోడం చూసి నవ్వుతూ బైక్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నాడు ప్రవీణ్…..
తనూ కి బైక్ వెళ్ళే స్పీడ్ కి బయం వేసి దగ్గరగా జరిగి కూర్చుంది….. ప్రవీణ్ బైక్ ను హాస్టల్ దగ్గర ఆపగనే బైక్ దిగిన తనూ నవ్వి థాంక్స్ ప్రవీణ్ అంటూ ప్రవీణ్ వైపు చూస్తుంది….. ఇట్స్ ఓకే 😊😊 గుడ్ నైట్ తనూ అనగానే
గుడ్ నైట్ అని చెప్పి వెళ్లిపోతుంది తనూ ప్రవీణ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ……
💦💦💦💦💦💦💦💦💦
మార్నింగ్ 8 అవుతూ వుండగా తనూ ఫోన్ మోగుతూనే వుంటుంది ……. సండే అవ్వడం తో తనూజ ఇంకా లేవకుండా అలాగే పడుకుని వుంది ……ఫోన్ రింగ్ అవ్వడం తో కళ్ళు కూడా తెరవకుండా నే కాల్ లిఫ్ట్ చేస్తుంది…… తనూ నిద్ర మత్తులో లిఫ్ట్ చేసి హెలో ఎవరు అని అడగ్గా గుడ్ మార్నింగ్ తనూ అంటూ వినిపించిన మేల్ వాయిస్ కి గుడ్ మార్నింగ్ ఇంతకీ ఎవరు నువ్వు అని ఆవులిస్తూ అడుగుతుంది……
అటు వైపు నుండి నవ్వుతూ ఇట్స్ మీ యార్ ప్రవీణ్ …… ప్రవీణ్ 🤔🤔 అంటూ ఆలోచిస్తూ ఉన్న తనూ ను చూసి ఓ…. గాడ్ అపుడే మర్చిపోయావా దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ తనూ నైట్ పార్టీ లో కలిశాం గుర్తు వచ్చానా అని అడగ్గా హేయ్ ప్రవీణ్ నువ్వా సారీ నిద్రలో వున్నా అందుకే గుర్తు పట్టలేదు …….
ఇట్స్ ఓకే ఎంటి ఇంకా పడుకున్నావా …..?? హా ప్రవీణ్ సండే కదా అందుకే ఇంకా లేవలేదు అవును నా నంబర్ నీకెలా తెలుసు 🤔🤔…..?? ఇష్టం వున్న వాళ్ళ నంబర్స్ ఎలా అయినా తెలుసుకోవచ్చు అని తనలో ఉన్న ఫ్లార్టింగ్ స్కిల్స్ స్టార్ట్ చేయగా ప్రవీణ్ మాటలకు తనూ కు తనకు తెలియకుండానే మొహం లో సిగ్గు వచ్చి చేరుతుంది
నేను మీ హాస్టల్ బయట వెయిట్ చేస్తున్న ఒక 30 మినిట్స్ లో వచ్చే అని కాల్ కట్ చేస్తాడు…… అది కాదు ప్రవీణ్ నేను అంటూ ఉండగా హెలో అబ్బా కట్ చేశాడు అనుకుని పైకి లేచి ఫ్రెష్ అయి రావడానికి వెళ్తుంది తనూ…….!!vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv