పగిలిన మనసు – 3
తనూజ బ్లాక్ & రెడ్ కలర్ చుడీదార్ వేసుకుని హెయిర్ కు చిన్న క్లిప్ పెట్టేసి నుదుటిన చిన్న స్టిక్కర్ కళ్ళకు కాటుక దిద్దుకుని రెడీ అవుతుంది ……. తన మొబైల్ ఇంకా తన వాలెట్ తీసుకుని వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకుని హాస్టల్ బయటకు వస్తుంది…….హాస్టల్ కి కొంచెం దూరం లో ప్రవీణ్ బైక్ మీద కూర్చుని మొబైల్ చూస్తూ కనిపిస్తాడు ……
( యాక్చువల్లి ఆ ప్రవీణ్ వేరే అమ్మాయి తో చాట్ చేస్తూ వుంటాడు 😡😡)
తనూ ప్రవీణ్ ను చూసి నవ్వి ప్రవీణ్ దగ్గరకు వెళ్తుంది….. హేయ్ హాయ్ ప్రవీణ్ నువ్వేంటి ఇక్కడ అని నవ్వుతూ అడుగుతుంది…..!!
తనూ వాయిస్ విని ఫోన్ పాకెట్ లో పెట్టేసి బైక్ దిగి హాయ్ తనూ గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ ప్రవీణ్
ప్రవీణ్ తనూ ను పై నుండి కింద దాకా చూస్తూ ఉన్నాడు
ఎంటి ప్రవీణ్ ఇక్కడ
నీ కోసం వెయిట్ చేస్తున్నా తనూ
ఎందుకు
ఎందుకో తెలియడం లేదు తనూ నాకు ఇలా అనిపించడం ఫస్ట్ టైం …… నైట్ నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళినప్పటి నుండి నువ్వే గుర్తు వస్తున్నావ్ & నీతో మాట్లాడాలి అని నీతో టైం స్పెండ్ చేయాలని నిన్ను చూడాలి అని అనిపిస్తూ ఉంది…….
అందుకే ప్రీతి కు కాల్ చేసి నీ నంబర్ తీసుకుని నిన్ను చూడాలి అని అనిపించింది సో ఇంకేం ఆలోచించకుండా వచ్చేసా
తనూ ప్రవీణ్ చెప్పింది విని మౌనంగా ఉండడం చూసిన ప్రవీణ్ బ్రేక్ ఫాస్ట్ చేశావా అని అడిగినా తనూ ఎమ్ అన్సర్ ఇవ్వకుండా ఆలోచిస్తూ ఉంది అది చూసిన ప్రవీణ్ తనూజ చెయ్ పట్టుకుని ఏమైంది తనూ మాట్లాడవు ఏంటి ??
హా ఎంటి ప్రవీణ్ …. అంటూ తన చెయ్ పట్టుకున్న ప్రవీణ్ చేతి వైపు చూస్తూ ఉంటుంది……
ఏమైంది తనూ హెల్త్ బలేదా అని నుదుటిన చెయ్ పెట్టీ చూస్తాడు ….. ప్రవీణ్ తన మీద అంత కేర్ చూపిస్తూ వుంటే తనూ కు చాలా హ్యాపీగా ఉంది ……
ఫీవర్ ఏమ్ లేదు కదా తనూ ఎందుకలా ఉన్నావ్…..??
ఐ యాం గుడ్ ప్రవీణ్ టెన్స్ అవ్వకు
సరే బ్రేక్ ఫాస్ట్ చేశావా
ఇంకా లేదు మరి నువు
నిజం చెప్పనా తనూ నిన్ను చూడాలి అన్న తొందరలో నాకు ఆకలి కూడా వేయడం లేదు అనగానే తనూ ప్రవీణ్ వైపు అలానే చూస్తూ ఉండిపోయింది……
సరే తనూ రా వెళ్దాం
ఎక్కడికి ప్రవీణ్
చెప్తా గా ముందు బైక్ ఎక్కు వెళ్దాం
సైలెంట్ గా నుంచున్న తనూ ను చూసి ఏమైంది తనూ నా మీద నమ్మకం లేదా అని యాక్టింగ్ స్టార్ట్ చేసాడు అది చూసిన తనూ అయ్యో ప్రవీణ్ అలాంటిది ఏమీ లేదు నువ్వే లేకపోతే నైట్ నా లైఫ్ ఏమ్ అయ్యేదో ఎంటో అలాంటిది నీ మీద నమ్మకం లేకపోవడం ఎంటి …??
మరి అయితే నాతో రా తనూ అని అడుగుతున్న ప్రవీణ్ వైపు చూస్తూ ఇంకేం మాట్లాడకుండా బైక్ ఎక్కి కూర్చుంది …….
ప్రవీణ్ సైడ్ మిర్రర్ నుండి తనూ ను చూసి నవ్వి నిన్ను ఎక్కడ ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసే అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసాడు…… ప్రవీణ్ తనూజ ను ఒక మంచి రెస్టారెంట్ కి తీసుకు వెళ్ళి అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ బ్రేక్ ఫాస్ట్ చేస్తారు …….. ప్రవీణ్ తన మాటలతో మెల్లగ తనూ కు బాగా క్లోజ్ అయ్యాడు …….. తనూజ కూడా ప్రవీణ్ మాటలకు బాగా అట్రాక్ట్ అయిపోయింది ……
తర్వాత తనూజ ను షాపింగ్ మాల్ కి తీసుకు వెళ్ళి తను వద్దు అంటున్నా వినకుండా తనూజ కు మొత్తం మోడర్న్ డ్రెస్సెస్ తీయిస్తాడు తర్వాత ఇద్దరు అక్కడి నుండి మళ్లీ మధ్యాహ్నం లంచ్ చేసి ఈవెనింగ్ వరకు సిటీ మొత్తం తిరగేసి తనను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు…….
తనూజ ప్రవీణ్ వెళ్ళే వరకూ చూసి తను వెళ్ళిపోయాక హాస్టల్ లోపలికి వెళ్తుంది ……. తను తీసుకున్న డ్రెసేస్ అన్ని సర్దేసి వాష్ రూమ్లో కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి నిద్రపోతుంది ……. ఈవెనింగ్ 8 అవుతూ వుండగా తనకు మెలకువ వస్తుంది ……అయ్యో ఇంత సేపు పడుకున్నా ఎంటి అని పైకి లేచి బెడ్ షీట్ ఫోల్డ్ చేసి పెట్టేసి బెడ్ మొత్తం నీట్ గా సర్దేసి ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది ……ప్రీతి డిన్నర్ కు వెళ్దాం రా అని పిలవగానే ఇద్దరు కింద మెస్ కు వెళ్లి తింటారు ……
తనూజ తింటున్నంతా సేపు ప్రీతి ప్రవీణ్ గురించి చెప్పి తనూ బ్రెయిన్ కంప్లీట్ గా వాష్ చేస్తుంది …..తనూజ ప్రవీణ్ గురించి ఆలోచిస్తూ తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉంది …… ప్రీతి అది చూసి ప్రవీణ్ కు మన ప్లాన్ సక్సెస్ అని మెసేజ్ చేయగానే ప్రవీణ్ అది చూసి నవ్వుకుంటూ ప్రీతి కు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు అది చూసిన ప్రీతి హ్యాపీగా ఫీల్ అవుతుంది…….
తను, ప్రీతి ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసి రూమ్ లోకి వచ్చి కాసేపు మాట్లాడుకుని ఎవరి బెడ్ మీద వాళ్ళు పడుకుంటారు ……తనూజ కు రోజు నైట్ ప్రభాకర్ & గీతు తో మాట్లాడ్డం అలవాటు సో ఇప్పుడు కూడా మాట్లాడదాం అని మొబైల్ తీసుకుంది….. కానీ అందులో ప్రవీణ్ నంబర్ నుండి మిసిడ్ కాల్ చూసి నవ్వుతూ తనకు కాల్ బ్యాక్ చేస్తుంది ….. తన కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా ప్రవీణ్ తన నుండి కాల్ రావడం తో నవ్వుతూ లిఫ్ట్ చేస్తాడు …………
ప్రవీణ్ తన మాయ మాటలు తో తనూజ తో మాట్లాడుతూ వున్నాడు ……. మెళ్ళి మెల్లిగా తనూజ కూడా ప్రవీణ్ కు అట్రాక్ట్ అయి పోయింది ……. ఇద్దరు అలా 3 వరకు మాట్లాడుతూనే వుంటారు తనూ టైమ్ చూసి ఇప్పటికే లేట్ అవుతుంది ఇక పడుకో ప్రవీణ్ అని చెప్పి కాల్ కట్ చేసింది……. ప్రవీణ్ కూడా తను తో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ నిద్ర పోయాడు……
తనూజ మార్నింగ్ లేచి రెడీ అయి బ్రేక్ ఫాస్ట్ చేసి హాస్టల్ బయటకు రాగానే తన కోసమే వెయిట్ చేస్తున్నా ప్రవీణ్ కనిపిస్తాడు తనూజ నవ్వుకుంటూ ప్రవీణ్ దగ్గరకు వెళ్తుంది…….
గుడ్ మార్నింగ్ ప్రవీణ్
గుడ్ మార్నింగ్ తనూ
ఏంటి నువ్వు అఫీస్ కు వెళ్ళలేదా
వెళ్తున్నా తనూ నిన్ను డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్తా
తనూ నవ్వి ప్రవీణ్ బైక్ ఎక్కుతుంది …… ప్రవీణ్ తనని అఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు అలా రోజు మార్నింగ్ ప్రవీణ్ డ్రాప్ చేయడం ఈవెనింగ్ పిక్ చేసుకోవడం రొటీన్ గా మారిపోయింది……. తనూ కూడా ప్రవీణ్ కు చాలా దగ్గర అయిపోయింది ఎంత అంటే ప్రవీణ్ తో మాట్లాడకుండా & తనను చూడకుండా వుండలేనంత
వన్ వీక్ లోనే ప్రవీణ్ తన ట్యాలెంట్ మొత్తం చూపించి మొత్తానికి తనూ ను పడేశాడు ……
తనూజా ఈ వన్ వీక్ లో ఒక్క సారి కూడా ప్రభాకర్ & గీతు కు కాల్ చేయలేదు ……. వాళ్ళు చేసినా కూడా వాళ్ళ కాల్స్ కట్ చేసి ప్రవీణ్ తో మాట్లాడుతూ వుండేది …… ప్రభాకర్ తన కూతురు బిజీగా ఉంది అని ఊరికే వుండే వాడు & గీతు కూడా వర్క్ టెన్షన్ లో వుండి వుంటుంది అని పెద్దగా పట్టించుకోలేదు …….తనూజ ప్రవీణ్ లవ్ కు ఓకే చెప్పడం తో ప్రవీణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు……
రోజు ఇద్దరు అఫీస్ కు వెళ్ళిన కూడా ఇద్దరు గంటలు గంటలు మాట్లాడుతూ వుండే వారు ……తనూజ మెల్లగ తన డ్రెస్సింగ్ స్టయిల్ అండ్ హెయిర్ స్టయిల్ తో పాటు లైఫ్ స్టైల్ కూడా మొత్తం చేంజ్ చేసింది ….. తనూ ను అలా చూసి హాస్టల్ లో చాలా మంది షాక్ అయ్యారు ……ప్రవీణ్ తనూ రోజు బాగా ఎంజాయ్ చేస్తూ వుండేవాళ్ళు …….
గీతు పెళ్లి అవ్వగానే హాస్టల్ కి వచ్చేస్తుంది తనూ నైట్ 8 అవుతూ వున్న హాస్టల్ కి రాదు అది చూసిన గీతు
కి చాలా టెన్షన్ గా అనిపిస్తూ ఉంటుంది కాల్ చేసిన లిఫ్ట్ చేయట్లేదు ……. బాల్కనీ లోకి వెళ్లి కాల్ చేస్తూ వుంటుంది అప్పుడే తనకు కింద తనూ ఎవరో అబ్బాయిని హగ్ చేసుకోవడం చూసి గీతు షాక్ అవుతుంది……
తనూ గీతు ను చూసి నవ్వుతూ వచ్చి హగ్ చేసుకుని ఎప్పౌడు వచ్చావ్ ఎలా ఉన్నావ్ అని అడుగుతూ ఉన్నా గీతు అన్సర్ ఇవ్వకుండా కోపంగా ఎవరే వాడు ఇందాక నిన్ను బైక్ లో డ్రాప్ చేశాడు ….. పైగా నువ్వు వాడిని హగ్ చేసుకున్నావ్ ఇంత లేట్ నైట్ వరకు ఎక్కడికి వెళ్ళావ్??
ఈ మధ్య నాకు కాల్ సరిగ్గా చేయకపోతే ఎదో వర్క్ లో వున్నావ్ అని అనుకున్నా కానీ చాలా మంది కొత్త వ్యక్తుల ద్వారా నువ్వు ఇలా మారిపోయావ్ అని అనుకోలేదు ……అయినా నువ్వేంటి ఆ హెయిర్ స్టయిల్ ఎంటి చినిగి పోయిన ప్యాంట్ వేసుకోవడం ఎంటి తనూ అని కోపంగా చూస్తు అంటుంది …….
తనూ చాలా కూల్ గా ఇది ఇప్పటి ట్రెండ్ గీతు ఇలానే వుండాలి ……..నువ్వు కూడా చేంజ్ అవ్వు ఎప్పటికీ ఒకేలా వుండకూడదు వుయ్ హ్యవ్ టు చేంజ్ ……. అడిగావ్ కదా ఎవరు అని తన పేరు ప్రవీణ్ నేను తను లవ్ చేసుకుంటూ వున్నాం …….. ఇప్పటి వరకు తన తోనే వున్నా అని రెక్లెస్ గా చెప్పేసి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ……
గీతు తనూ అన్సర్ కి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయింది నేను చూస్తోంది తనూ నే నా అని ……తనూ ఫ్రెష్ అయి రాగానే రా తనూ తిందాం నీ కోసం అమ్మ స్పెషల్ గా చేసి పంపింది అనగానే సారి గీతు నేను ఆల్రెడీ ఫుల్ గా బిర్యాని తినేసి వచ్చాను అని చెప్తుంది అది విన్న గీతు బాధగా తినకుండా అలానే పడుకుంటుంది ……తనూ అదేం పట్టించుకోకుండా ప్రవీణ్ కు కాల్ చేసి మాట్లాడుతూ ఎప్పటికో పడుకుంటుంది……
మార్నింగ్ కూడా గీతు ను ను వదిలేసి ప్రవీణ్ తో బైక్ మీద అఫీస్ కు వెళ్తుంది …… అఫీస్ లో వర్క్ చేసుకుంటూనే బ్లు టూత్ పెట్టుకుని ప్రవీణ్ తో మాట్లాడుతూ ఉంది…… గీతు ఎంత మాట్లాడించాలి అని ట్రై చేసినా పొడి పొడిగా మాట్లాడుతూ వుండేది …… గీతు కు ప్రవీణ్ మంచి వాడు కాదు అని తెలిసి తనూ తో చెప్తుంది …..
అది విన్న తనూ కోపంగా గీతు ను తిట్టేసి నీ లిమిట్స్ లో నువ్వు వుండు అని చాలా హర్శ్ గా చెప్తుంది….. గీతు తనూ మాటలకి చాలా బాధ పడుతుంది & తనూ గీతు ను పూర్తిగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది……. అది చూసిన గీతు కు చాలా బాధగా వుండేది తనూ కు సారి చెప్తుంది ఇంకెప్పుడూ అలా అనను అని చెప్పగానే ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ కదా అని ఇట్స్ ఓకే ఇంకెప్పుడూ ప్రవీణ్ గురించి అలా అనకు అని చెప్పి ఇద్దరు ముందు లానే మాట్లాడుతూ వున్నారు…..
తనూ ఈ మధ్య అసలు హాస్టల్ కి రావడం లేదు వచ్చినా లేట్ నైట్ వస్తోంది …… కొన్ని సార్లు అయితే ప్రవీణ్ ఫ్లాట్ లో నే వుండి పోయేది ప్రవీణ్ మెల్లగ తన మాయ మాటలు చెప్పి తనూ తో ఒకటై పోయాడు ……
తనూ ఇక ఈ విషయం ప్రభాకర్ కు చెప్పి తనను ఒప్పించాలి అని ఊరికి వెళ్తుంది …….
అప్పటికే గీతు ద్వార ప్రవీణ్ గురించి నిజం తెలుసుకున్నా ప్రభాకర్ తనూ మీద చాలా కోపంగా వున్నాడు…..తనూ వెళ్ళగానే చాలా రోజుల తర్వాత కూతురు ను చూడ్డం తో ప్రభాకర్ తనూ మీద వున్న కోపాన్ని కూడా మర్చిపోయి తనతో కబుర్లు చెప్తూ వున్నాడు.. …… ఇద్దరు తినేసి హాల్ లో సోఫాలో కూర్చుని మాట్లాడుతూ వున్నారు……. ప్రభాకర్ కు తోట లో పని వుంది అని తనూ ను రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు
తనూ ప్రవీణ్ తో మాట్లాడుతూ వుంటుంది కాసేపు అయ్యాక పడుకుంది ……. సాయంత్రం ప్రభాకర్ రాగానే టీ చేసి వెళ్లి ఇచ్చి ప్రవీణ్ గురించి వాళ్ళ ప్రేమ గురించి చెప్తుంది …….ప్రభాకర్ కోపంగా టీ కప్ నేలకు వేసి కొట్టి తనూ ను లాగి పెట్టీ చంప మీద కొడతాడు……..
నిన్ను చదివించింది అడ్డమైన వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు ……. నీకు ఎప్పుడు ఎవరితో పెళ్లి చేయాలో నాకు తెలుసు నీకు నెలలో పెళ్లి అది కూడా నేను చూసిన అబ్బాయి తో అని చెప్పి ఇదిగో అబ్బాయి ఫోటో పేరు సూర్య చెన్నై లో సాఫ్టవేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు ……..
చాలా మంచి వాడు ఎటువంటి చెడ్డ అలవాటు లేదు పైగా ఒక్కడే కొడుకు నిన్ను బాగా చూసుకుంటారు …….. నువ్వు ఇక ఏ జాబ్ చేయనవసరం లేదు ఇంట్లోనే వుండు & వారం రోజుల్లో నిశ్చితార్థం నెల రోజుల్లో పెళ్లి అని కోపంగా చూస్తూ చెప్తాడు …….
తనూ ఏడుస్తూ నేను చచ్చినా ప్రవీణ్ ను తప్ప మరెవ్వరి నీ పెళ్లి చేసుకోను నాకు ప్రవీణ్ కావాలి అంటూ గట్టిగా అరిచి చెప్తుంది….
నీ పెళ్లి సూర్య తో జరిగి తీరుతుంది
నేను చేసుకొను అని మొండిగా అంటున్న కూతురి వైపు చూస్తూ కొంచెం శాంతించి నేను చెప్పేది విను తనూ ఆ ప్రవీణ్ మంచి వాడు కాదు తల్లి అని చెప్పబోతున్న ప్రభాకర్ వైపు చూస్తూ చాలు ఆపండి డాడీ నూరేళ్ళు బ్రతక వలసిన దాన్ని నాకు తెలియదా నేను ఎవరితో హ్యాపీగా ఉంటానో తను మంచి వాడు ……
నేను చెప్పినా వినవా అని అంటున్న ప్రభాకర్ వైపు చూస్తూ ఈ విషయం లో వినను అని కోపంగా చెప్తున్న తనూ వైపు చూస్తూ సరే నేను కావాలో వాడు కావాలో తేల్చుకో ప్రొద్దున వరకు టైమ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు……
తనూ ఏడుస్తూ రూమ్ లోకి వెళ్తుంది…… మార్నింగ్ అవ్వగానే ప్రభాకర్ తనూజ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాడు …… తనూజ లగేజ్ తీసుకుని బయటకు వచ్చి నాకు ప్రవీణ్ మాత్రమే ముఖ్యం అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది….. అది చూసిన ప్రభాకర్ వున్న చోటే కుప్ప కూలిపోయి కూతురు ను చూసి ఏడుస్తూ వున్నాడు …….
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇవాళ తనను కాదని ఎవరో ముక్కూ మొహం తెలియని వాడి కోసం తనను కాదని వెళ్ళింది అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వున్నాడు …….. తను పెళ్లి చేసుకుంటే వచ్చే ఆవిడ ఎక్కడ తనూ ను సరిగ్గా చుసుకొదో అని తనూ కోసమే బ్రతికిన తండ్రిని కాదని ప్రవీణ్ కోసం వెళ్ళింది అని ప్రభాకర్ ఏడుస్తూ ఉన్నాడు…… తనూ నే లోకంగా బతికిన ప్రభాకర్ ఇప్పుడు తనూ కూడా తన స్వార్థం తను చూసుకుని ప్రభాకర్ ను ఒంటరి చేసి వెళ్లి పోయింది