వలయం – 1
వలయం
“ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే మాటల్లో చెప్పలేనంత, నీకు తెలుసా ఉదయ్ ఈ మేనేజర్ పోస్ట్ కోసం నేను సుమారు ఐదు సంవత్సరాలుగా వెయిట్ చేశాను, ఇప్పుడు నా ఆశలు ఫలించి ఆ మేనేజర్ పోస్ట్ నాకు వచ్చింది” అని మెరిసే కళ్ళతో తన భర్త ఉదయ్ తో చెప్పింది నిధి.
“నువ్వు చెప్పేది నిజమా..? నీకు మేనేజర్ పోస్ట్ వచ్చిందా..?” అని ఉదయ్ కూడా ఎక్సైట్మెంట్తో నిధి భుజం మీద రెండు చేతులు పెట్టి కుదిపేస్తూ అడిగాడు..
“అవును, ఈరోజే నాకు మెయిల్ వచ్చింది వెంటనే ఈ విషయం నీకు చెప్పాలి అనుకున్నాను. కానీ ఆఫీసులో వర్క్ ఉండడంతో అది కూడా ఇంపార్టెంట్ అవ్వడంతో నీకు చెప్పలేకపోయాను, ఇప్పుడు నువ్వు నన్ను పికప్ చేసుకోవడానికి రావడంతో క్షణం కూడా నా ఆనందాన్ని ఆపుకోలేక నీతో చెప్తున్నాను” అని అతడి బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్పింది నిధి.
అతను కూడా ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా హత్తుకొని “నిజంగా ఇది చాలా గుడ్ న్యూస్. కాబట్టి మనం పార్టీ చేసుకోవాల్సిందే” అని అతను కన్ను కట్టి అల్లరిగా అన్నాడు.
అతని మాటలకి ఆమె సిగ్గుతో ముడుచుకుపోయి “సరే సరే పద బయటికి వెళ్దాం, ఈ రోజంతా క్షణం కూడా నిన్ను వదిలిపెట్టకుండా నా ఆనందాన్ని నీతో పంచుకోవాలి” అని అన్నది నిధి.
సరే పద అంటూ తను బైక్ ఎక్కి కూర్చుని ఆమెను తన వెనుక కూర్చోబెట్టుకొని బైక్ స్టార్ట్ చేశాడు ఉదయ్..
నిధి అతడు నడుము చుట్టూ రెండు చేతులు వేసి వీపు మీద తల ఆనించి కళ్ళు మూసుకుంది.
అతడు ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని ముద్దు పెట్టి బైక్ స్లో గా డ్రైవ్ చేస్తున్నాడు.
అలా కరెక్ట్ గా 20 నిమిషాల జర్నీ తర్వాత నిధి కళ్ళు తెరిచి “ఉదయ్ నెక్సస్ మాల్ లో నాకు చిన్న పని ఉంది. ప్లీజ్ లోపలికి తీసుకొని వెళ్తావా..?” అని ఆమె అతడి నుంచి దూరం జరగకుండానే అడిగింది.
సరే అంటూ అతను నెక్సెస్ మాల్ లోనికి బైక్ ని టర్న్ చేశాడు.
అలా ఇద్దరు నెక్సస్ మాల్ లోనికి ఎంటర్ అయ్యి సరదాగా 20 నిమిషాలు తిరిగారు. ఆ తర్వాత అతడిని కమల్ వాచ్ స్టోర్ లోపలికి తీసుకొని వెళ్ళింది నిధి..
ఆమె ఎందుకు తనని తీసుకొని వెళ్ళిందో అర్థం చేసుకున్న ఉదయ్ ఆమె చేతిని పట్టుకుని “ప్లీజ్ ఇప్పుడు ఇదంతా అవసరమా..?” అని అన్నాడు.
“చాలా అవసరం” అని అక్కడ ఉన్న వాచెస్ అన్ని చూస్తూ ఉంది.
చివరికి తనకి టు వాచెస్ నచ్చాయి. సిల్వర్ కలర్ చైన్ ఉన్న వాచ్ బాగా నచ్చింది, దాని పక్కనే ఉన్న బ్లాక్ కలర్ లెదర్ బెల్ట్ తో లోపల రౌండ్ షేప్ లో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్న వాచ్ కూడా తనకి బాగా నచ్చింది.
అవి రెండు తీసి ఉదయ్ ముందు పెట్టి “ఈ రెండింటిలో నీకు ఏది బాగా నచ్చింది, ఇవి కాదు అనుకుంటే నీకు నచ్చింది తీసుకో” అని చెప్పింది నిధి..
“ప్లీజ్ నిధి ఇప్పుడు ఇవన్నీ నాకేమీ వద్దు, చెప్తే వినవు నువ్వు హ్యాపీగా ఉన్న ప్రతి సారి నాకు ఏదో ఒకటి కొనిస్తావ్, చూసావా ఇప్పుడు నా వంటి మీద ఉన్న ప్రతిదీ కూడా నీ ఆనందానికి గుర్తుగా కొన్నదే. ఈ చైన్, ఈ బ్రాస్లైట్ అన్ని నువ్వు నాకు కొనిచ్చినవే. ఇప్పుడు ఇది అవసరమా ప్రతిసారి నువ్వు నాకు కొనివ్వటమే కానీ ఒక్కసారి కూడా నేను నీకు కొనివ్వలేదు ఇలా ప్రతిసారి నీ దగ్గర తీసుకుంటుంటే నాకు కష్టంగా ఉంటుంది” అని అన్నాడు ఉదయ్.
“ఎందుకు నువ్వు అలా అనుకుంటావ్, ఏ ఎప్పుడు భర్త కొనిస్తుంటే భార్య తీసుకోవాలా, ఏ భార్య ఆనందంతో కొనిస్తుంటే భర్త తీసుకోకూడదా..? అలాంటి రూల్ రాజ్యాంగం ఏమైనా ఉన్నాయా? అయినా నువ్వు ఎందుకు కష్టంగా ఫీల్ అవుతావు, నా ఆనందానికి గుర్తు తీసుకో. ఇప్పుడే పెట్టుకో, ప్రతిరోజు పెట్టుకో అని నేను చెప్పను, నీకు నచ్చినప్పుడే పెట్టుకో, ప్లీజ్ వద్దు అని చెప్పద్దు నాకోసం” అని అతని గడ్డం పట్టుకుని రిక్వెస్ట్ చేసింది నిధి..
ఆమె అంతగా రిక్వెస్ట్ చేయడంతో అంతకుమించి ఆమె ఆనందం కోసం అని చెప్పటంతో కాదు అనలేక “సరే నీ ఇష్టం నీకు నచ్చింది తీసుకో” అని అన్నాడు ఉదయ్..
“అయితే ఇది తీసుకో” అంటూ సిల్వర్ కలర్ చైన్ ఉన్న వాచ్ తీసుకుని అతడి చేతికి పెట్టింది. అది అతని చేతికి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వటంతో చాలా బాగుంది కదా అనే మురిపంగా అతని వైపు చూసి అడిగింది.
ఆమె తనకి కొనడం ఆనందంగానే ఉంది కానీ ఆ ఆనందాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నాడు, ఎందుకో మరి.
ఆ వాచ్ కి మనీ పే చేసేసి, వాచ్ అతనికి పెట్టి బయటకు వచ్చి ఆ మాల్ లోనే ఒక గంట సేపు తిరిగి ఆ తర్వాత ఫుడ్ కోర్ట్ లోనికి వెళ్లి ఒక ప్లేస్ లో ఇద్దరు కూర్చున్నారు.
అది కూడా ఎదురెదురుగా ఒకరి పక్కన ఒకరు కూర్చోవడం కంటే కూడా ఎదురుగా కూర్చుని ఒకరి కళ్ళల్లోనికి ఒకరికి చూసుకోవడం అంటే వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం.
అలాంటి మూమెంట్‌ని స్పెషల్ గా ఫీల్ అవుతారు.
“ఏం తింటావు” అని అడిగింది నిధి.
ఉదయ్ నోరు తెరిచే లోపే శ్రీనిధి “పిజ్జా నీకు పిజ్జా అంటే చాలా ఇష్టం కదా, అదే ఆర్డర్ చేయనా” అని అడిగింది నిధి..
ఉదయ్ నవ్వుతూ “నా ఇష్టాలు ఏంటో నీకు బాగా తెలుసు, నేను ఎప్పుడు ఏం తినాలి అనుకుంటున్నానో కూడా కరెక్ట్ గా చెప్పేస్తావ్, ఓకే” అని చెప్పాడు.
నిధి నవ్వుతూ వెళ్లి పిజ్జా ఆర్డర్ చేసి వచ్చి అతని ఎదురుగా కూర్చుని తన ఆఫీసు విషయాలు మాట్లాడింది.
20 నిమిషాలకి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ రావడంతో వెళ్లి తీసుకొని వచ్చింది నిధి.
అలా ఇద్దరు కూడా ఒక్కొక్క పీస్ తీసుకొని తింటూ ఉన్నారు.
“అవును ఉదయ్, నువ్వు ఏదో కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నావు కదా ఈసారి ఏం బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నావు” అని నవ్వుతూ అడిగింది.
” ఎందుకు పదేపదే బిజినెస్ అంటూ గుర్తు చేసి నన్ను ఏడిపిస్తావు” అని అలకగా అన్నాడు ఉదయ్.
శ్రీనిధి అతడి ఫేస్ రియాక్షన్స్ కి నవ్వుతూ పైకి లేచి వంగి అతడి బుగ్గ పట్టుకుని గట్టిగా లాగే “అదేంటో నీ ఫేస్ లో ఇలాంటి రియాక్షన్స్ కనిపిస్తుంటే చాలా బాగుంటుంది. సర్లే అవన్నీ వదిలేయ్ కానీ, ఏం చేయాలి అనుకుంటున్నావ్ త్రీ ఇయర్స్ గా ఖాళీగా ఉంటున్నావ్ నువ్వు ఇలా ఉంటున్నందుకు నాకేమీ ప్రాబ్లం లేదు. కానీ ఏదో ఒక బిజినెస్ చేయాలి అనుకొని నువ్వు నష్టపోతుంటేనే నాకు చాలా బాధగా ఉంది..
మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాని ముందు వెనక ఆలోచించి చేస్తే బాగుంటుంది. అందుకే ఇకపైన నువ్వేం చేయాలి అనుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను. కాకపోతే ఒక క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకో” అని అన్నది నిధి..
సరే అలాగే అని అప్పటికే తినడం అయిపోవడంతో లేచి నిలబడ్డాడు ఉదయ్.
నిధి కూడా లేచి సరే పద వెళ్దాం అని అన్నది.
కాసేపు అలా బయట తిరిగి ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు
ఇంటిలో పేపర్స్ అన్ని చెల్లాచెదురుగా పడి ఉండడం చూసిన నిధి వెనక్కి తిరిగి ఉదయ్ వైపు ఒక్క క్షణం చూసి ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్ళింది.
అక్కడ కూడా సింక్‌లో పాత్రలు ఉండటం చూసి ఈ ఉదయ్ ఎప్పటికీ మారతాడో ఏంటో,
తన ఫ్రస్టేషన్ ఏ విధంగా ఉందో ఇల్లు చూసి చెప్పవచ్చు అని అనుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసి ఆ తర్వాత హాల్లో ఉన్న పేపర్స్ తీస్తుంది.
అందులో ఏదో బిజినెస్ గురించి ఐడియాస్ అలానే కొన్ని డ్రాయింగ్స్ కనిపించడంతో ఏదో కొత్త బిజినెస్ గురించి ఆలోచిస్తున్నట్లుగా ఉన్నాడు.
సర్లే ఈసారైనా తను కరెక్ట్ వే లో వెళ్తే బాగుంటుంది అని అనుకొని ఆ పేపర్స్ అన్ని తీసి ఒక ఫైల్ లాగా పెట్టి కబోర్డ్ లో పెట్టేసింది నిధి.
ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిపోయింది.
అప్పుడే ఉదయ ఆమె దగ్గరకి వచ్చి “
“ఏంటి అప్పుడే నిద్ర పోవటానికి సిద్ధమవుతున్నావా..?” అని అల్లరిగా అడిగాడు..
“అవును ఈరోజు బాగా అలసిపోయాను నిద్ర వస్తుంది” అని అన్నది.
“నీ నిద్రను చెడగొట్టేయడానికి నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి” అంటూ ఆమెతో హ్యాపీగా టైం స్పెండ్ చేశాడు.
నిధి కూడా ఉదయ్ తో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసింది. కానీ ఆమె ఫేస్ అంతా డల్ గా ఉండటం గమనించిన ఉదయ్ “ఏమైంది” అని అడిగాడు..
“మనిద్దరం ఇలా ఒంటరిగా బ్రతకడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అమ్మానాన్న ఎలాగో మన పెళ్లికి ఒప్పుకోలేదు, కనీసం అత్తయ్య మామయ్య అయినా ఒప్పుకుని ఉంటే బాగుండేది. కానీ వాళ్లు కూడా మన పెళ్లికి ఒప్పుకోలేదు. ఇలా జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాము ఏమో అని భయంగా అనిపిస్తుంది. పలకరించడానికి ఒక మనిషి అన్నా ఉంటే బాగుంటుంది కదా” అని అన్నది నీది.
ఉదయ్ రెండు నిమిషాలు ఏమి మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత ఆమెను మరింత దగ్గరగా తీసుకొని “నువ్వేమీ కంగారు పడొద్దు మనకి పిల్లలు పుడితే కచ్చితంగా మన పేరెంట్స్ మన దగ్గరకు వస్తారు, మనకోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా వస్తారు కదా” అని అన్నాడు ఉదయ్.
“మన పెళ్లి అయి ఇప్పటికే మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటివరకు నేను ప్రెగ్నెంట్ కాలేకపోయాను ఫీచర్లో ప్రెగ్నెంట్ అవుతానో లేదో అన్న భయం పెరిగిపోయింది” అని బెంగగా బాధతో అన్నది నిధి..
కొనసాగుతుంది.
స్టార్టింగ్ స్టోరీ చాలా స్లోగా ఉన్నట్లే అనిపిస్తుంది ఇది చిన్న షార్ట్ ఫిలిం లాంటిది. స్టోరీ చదువుతుంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలానే ట్విస్టులు కూడా చాలా కనిపిస్తాయి. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చదివిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి..
Swipe left/right or tap the sides to turn pages