రౌడీ మామ – 1
వీరమాచర్ల నిలయం అని బయట పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డ్ కనిపిస్తూ ఉంటే ఆ ఇంటి గేట్లు తీసుకుని లోపలికి అడుగు పెట్టింది 21 ఏళ్ల అమ్మాయి
ప్రతి అడుగులో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అడుగులో అడుగు వేసుకుంటూ గేట్ దగ్గర నుంచి ఇంటి వైపు అడుగులు వేస్తుంది
ఆమె గేట్ నుంచి ఇంటి ఎంట్రెన్స్ వరకు దగ్గర దగ్గర ఒక పావు కిలోమీటర్ ఉంటుందేమో చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న వాతావరణం
ఆమె అక్కడికి రావడం అది మొదటిసారి కాదు కానీ ఎందుకో ఇప్పుడు అక్కడికి అడుగు పెట్టాలి అంటేనే ఆమె కాళ్లు వణికిపోతున్నాయి
ఇంటి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లేసరికి ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా అనిపించింది కుడి కాలు ముందుగా లోపలికి అడుగుపెట్టి ఇంటి లోపటికి వెళ్ళింది ఆ అమ్మాయి
అమ్మమ్మ అమ్మమ్మ అంటూ హాల్లో నుంచే తన అమ్మమ్మని పిలుస్తూ ఉంటే ఆమె పిలుపుకి గబగబా వంట గదిలో నుంచి అక్కడికి వచ్చారు 57 ఏళ్ల సుజాత గారు
అమ్మ వైదేహి ఎలా ఉన్నావే అంటూ పరుగున మనవరాలి దగ్గరికి వచ్చి తనని గుండెలకి హత్తుకున్నారు సుజాత గారు
నేను బాగున్నాను. అమ్మమ్మ నువ్వెలా ఉన్నావ్ తాతయ్య ఎలా ఉన్నారు అడిగింది వైదేహి
మేము కూడా బాగున్నాం తల్లి మా దిగులు ఎంత నీ గురించే అసలు ఎలా ఉండే పిల్లవి ఎలా అయిపోయావు అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే మీ మావయ్య చూస్తే నిన్ను చంపేస్తాడు అన్నారు సుజాత గారు భయంగా
మావయ్య ఊర్లో లేడు అమ్మమ్మ అందుకే నేను ధైర్యం చేశాను అంది వైదేహి
అయ్యో ఎండన పడొచ్చావ్ ముందు కూర్చో అంటూ మనవరాలినీ కూర్చోబెట్టి లోపలికి వెళ్లి నీళ్లు తీసుకొచ్చి మనవరాలికి ఇచ్చారు సుజాత గారు
ముందు ఈ నీళ్లు తాగు అంటూ మనవరాలికి నీళ్లు అందించి అక్కడి నుంచి తిరిగి లోపలికి వెళ్లి తినడానికి పట్టుకొని వచ్చారు
మనవరాలి పక్కనే కూర్చుని తనకి గోరు ముద్దలు కలిపి పెడుతూ ఉన్నారు సుజాత గారు
నేను తిన్నాను అమ్మమ్మ ఇదిగో అమ్మ నీ కోసమని నీకు ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి చేసింది ఇది ఇవ్వడానికే వచ్చాను అంటూ చక్కెర పొంగలి బాక్స్ సుజాత గారి చేతిలో పెడుతూ ఉండగానే ఎక్కడి నుంచి వచ్చాడో కానీ నేరుగా వచ్చి ఆ బాక్స్ తీసుకొని నేలకేసి కొట్టాడు ఒక 30 ఏళ్ల వ్యక్తి
నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి అడుగు పెడతావు అడిగాడు అతను కోపంగా వైదేహి వైపు చూస్తూ
అతన్ని అక్కడ ఊహించని వైదేహి భయంగా సుజాత గారి చేతిని పట్టుకుంటే అతను మాత్రం వైదేహి నీ బలవంతంగా పక్కకి లాగి సిగ్గు ఉండాలి మనిషికి అన్నాడు కోపంగా
కన్నయ్య ఏం మాటలవి నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాలేదు కన్నయ్యా అయినా తను ఇక్కడికి రావడానికి సిగ్గు ఉండాలా అసలు తనకి ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది నువ్వు కూడా తనని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పే అధికారం లేదు అన్నారు సుజాత గారు కోపం గా
అమ్మ ఈ విషయంలో నువ్వు కలగ చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అంటూ తల్లికి కోపంగా చెప్పేసి వైదేహి వైపు చూస్తూ ఏంటి ఇక్కడ ఏమైనా బొమ్మలాట జరుగుతుంది అనుకుంటున్నావా మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపో అన్నాడు విరాట్ { విరాట్ వీరమాచర్ల }
వైదేహి కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా కళ్ళల్లో నీళ్లతో విరాట్ వైపే చూస్తూ ఉంటే
విరాట్ మాత్రం వైదేహి వైపు కనీసం చూడకుండా వెళ్ళు ఇంకొక్క సెకండ్ నువ్వు ఇక్కడే కనిపిస్తే నిన్ను చంపేస్తాను అన్నాడు విరాట్ కోపంతో ఊగిపోతూ
అంత కోపం ఉన్న వాడివి నా మెడలో ఈ పసుపుతాడు ఎందుకు కట్టావు మావయ్య అడిగింది వైదేహి విరాట్ తన మెడలో కట్టిన మంగళసూత్రాన్ని తీసి విరాట్ కి చూపిస్తూ
చెప్పు మావయ్య నేనంటే ఇష్టం లేకుండానే నా మెడలో ఈ మూడు ముళ్ళు వేసావా నేనంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావ్ అడిగింది వైదేహి
కేవలం మీ నాన్న మీద పగతో సమాధానం వచ్చింది కదా అయినా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావ్ ఏంటి అసలు తప్పులు చేసింది మీరు … మీరు చేసిన తప్పుల్ని ఇప్పటికీ మేము మోస్తూనే ఉన్నాం ఇంకా ఎక్కువ మోసే ఓపిక సహనం రెండు మాకు లేవు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ వైదేహి రెక్క పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి తోసేసాడు విరాట్
విరాట్ అలా తోసేయడంతో కింద పడిపోయింది వైదేహి
అమ్మ వైదిహి అంటూ బయటికి వెళ్లాలి అని చూసిన సుజాత గారి చేయి పట్టుకొని ఆపేశాడు విరాట్
వైదేహి మాత్రం కన్నీళ్ళతో విరాట్ వైపే చూస్తూ ఉంది
——–continues…………….
వైదేహి కి విరాట్ కి అప్పుడే పెళ్లి కూడా అయిపోయిందా అసలు వీళ్ళ కథ ఏంటి చూద్దాం ముందు ముందు ఎపిసోడ్స్ లో
Swipe left/right or tap the sides to turn pages