రౌడీ మామ – 2
విరాట్ అలా తోసేయడంతో గుమ్మం అవతల నేల మీద పడిపోయింది వైదేహి
అమ్మ వైదిహి అంటూ బయటికి వెళ్లాలి అని చూసిన సుజాత గారి చేయి పట్టుకొని ఆపేశాడు విరాట్
వైదేహి మాత్రం కన్నీళ్ళతో విరాట్ వైపే చూస్తూ ఉంది
విరాట్ కనీసం ఆమె వైపు చూడకుండానే తన మొహం మీదే డోర్ వేసేశాడు
ఎందుకు మావయ్య నేను చెయ్యని తప్పుకి నాకు ఈ శిక్ష అనుకుంటూ మెల్లగా లేచి తన మోచేతిని చూసుకుంది
మోచేయి మొత్తం గీరుకుపోయి రక్తం కారుతూ ఉంటే తను కట్టుకున్న చీర పైటతో ఆ దెబ్బ ని క్లీన్ చేసుకుని వెనక్కి తిరిగి అక్కడి నుంచి బయటికి అడుగులు వేసింది
తను బయటికి నడుస్తూ ఉండగానే ఒక కార్ లోపలికి వస్తూ కనిపించింది
కారులో ఉన్న అతను వైదేహి ని చూడగానే కార్ ఆపి బయటకు దిగి అమ్మ వైదేహి ఎప్పుడొచ్చావు తల్లి అడిగారు అతను ఆప్యాయంగా
తాతయ్య అంటూ ఆయన్ని హగ్ చేసుకుంది వైదేహి
వెళ్ళిపోతున్నావా ఏం రా అడిగారు ఆయన
నన్ను కట్టుకున్న భర్తే నాకు ఈ ఇంట్లో ఉండే స్థానం అర్హత లేదు అని బయటకి గెంటేసాక ఇంకా ఏ అధికారంతో ఇక్కడ ఉండమంటావు తాతయ్య అడిగింది వైదేహి బేలగా
క్షమించు తల్లి ఈ విషయంలో ఈ తాతయ్య ఉన్నా కూడా లేనట్టే అయిపోయింది అన్నారు ఆయన కంటి నిండా నీళ్లతో
అయ్యో నువ్వేం చేస్తావ్ తాతయ్య ఇది నా కర్మ అంతే ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను అంతే అని ఆయన వైపు చూసి నేను వెళ్తాను తాతయ్య అంది వైదేహి
వెళ్తాను కాదమ్మా వెళ్ళొస్తాను అనాలి ఎప్పటికైనా నువ్వు చేరాల్సింది ఈ ఇంటికే అది గుర్తుపెట్టుకో అన్నారు రాఘవేంద్ర గారు
ఆ నమ్మకం నాకు లేదు తాతయ్య అంటూ కంటి నిండా నీళ్లతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వైదేహి
మనవరాలి బాధ చూస్తూ ఉంటే ఆయనలో కోపం అసహనం పెరిగిపోతూ ఉంటే విరాట్ అనుకుంటూ లోపలికి వెళ్లారు ఆయన
హాల్లో కేవలం సుజాత గారు మాత్రమే కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండటం చూసినా రాఘవేంద్ర గారు
సుజాత నీ కొడుకు ఎక్కడున్నాడు అడిగారు ఆయన కోపంగా
ఏమైంది నాన్న అంటూ పైనుంచి వినిపించింది విరాట్ స్వరం
నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా విరాట్ ఈ ఇంటి కోడలు తను అలాంటి తనని ఇంట్లో నుంచి బయటకు తోసేస్తావా అడిగారు రాఘవేంద్ర గారు కోపంగా
ఆల్రెడీ మీకు లక్ష సార్లు చెప్పాను నాన్న ఇది నా పర్సనల్ విషయం అని ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా నేను తట్టుకోలేను అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు విరాట్
కొడుకు సమాధానానికి డీలా పడిపోయారు రాఘవేంద్ర గారు
ఏంటండీ వీడిలా మాట్లాడుతున్నాడు పాపం అక్కడ అది ఎంత బాధ పడుతుందో ఏంటో అనుకుంటూ బాధపడుతూ ఉన్నారు సుజాత గారు
ఇక్కడ బయటికి వచ్చేసిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది వైదేహి
కూతురు ఎప్పుడెప్పుడు వస్తుందా అని గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉన్నారు వైదేహి తల్లి వసుంధర
గుమ్మం దగ్గర ఆగే సరికి వచ్చి ఆశగా కూతురి వైపు చూసింది
వైదేహి జీవం లేనట్టే క్యాబ్ దిగి అతనికి డబ్బులు ఇచ్చేసి మౌనంగా ఇంటి లోపలికి నడిచింది
వసుంధర కూతురి వెనకే అడుగులు వేస్తూ వైదు అమ్మ వైదు అంటూ పిలుస్తూ ఉన్నా కూడా కూతురిలో ఎలాంటి చలనం లేకపోయేసరికి ఎందుకో భయం వేసింది ఆవిడకి
వెంటనే గబగబా పరుగున వెళ్లి వైదేహి చెయ్యి పట్టుకుని ఆపేశారు వసుంధర
ఏమైందే మావయ్య ఊర్లో లేడు అని తెలుసుకునే కదా వెళ్ళావ్ అడిగింది వసుంధర కూతురి వైపు చూస్తూ
ఏమో అమ్మ నేను వెళ్ళిన కొంతసేపటికి మావయ్య అక్కడికి వచ్చాడు నేను అంత తప్పు ఏం చేశానమ్మ మావయ్య నన్ను ఇంతలా ద్వేషించుకునేలా అడిగింది వైదేహి తల్లి వైపు ఆవేదనగా చూస్తూ
వసుంధర కి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు బాధగా కూతురి వైపు చూస్తూ నీది కాదురా నాది తప్పు అనుకుంటూ ఏం కాదులే మావయ్య ఏమన్నా అన్నాడా
నేను ఆ ఇంట్లో ఉండడానికి వాళ్లతో ఉండడానికి అర్హురాన్ని కాదు అంటమ్మా నేను మావయ్య ని అడిగాను మరి అలాంటప్పుడు నా మెడలో ఈ తాళి ఎందుకు అని దానికి కూడా మావయ్య ఏ సమాధానం చెప్పలేదు అంది వైదేహి గుక్క పెట్టి ఏడుస్తూ
కూతుర్ని హత్తుకొని అలా ఉండిపోయింది వసుంధర
——–continues…………
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ
నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో :-
వసుంధర రూమ్ లోకి వెళ్లిపోయి మంచం మీద కూర్చుని ఏడుస్తూ ఉంది
ఒక అరగంటకి భార్య దగ్గరికి వెళ్ళాడు తరుణ్
భర్త రావటంతో తన కన్నీళ్లు తుడుచుకుంటూ భర్త వైపు చూసింది
ఏంటి నా మీద కోపంగా ఉందా అడిగాడు తరుణ్
లేదండి వైదేహి గురించి ఆలోచిస్తూ ఉంటే భయంగా ఉంది దాని జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది అంది వసుంధర
Swipe left/right or tap the sides to turn pages