New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
╰┈➤𝐀𝐥𝐦𝐨𝐬𝐭 𝐈𝐬𝐡𝐪 ᥫ᭡🪽 – 2

╰┈➤𝐀𝐥𝐦𝐨𝐬𝐭 𝐈𝐬𝐡𝐪 ᥫ᭡🪽 – 2

 

 

 

 

 

 

 

 

ఆరోజు రాత్రి ఏడు గంటలకు…

 

 

ముంబై నగరంలో మేఘాలను తాకుతున్నట్లుగా ఉండే ఆ యాభై అంతస్తుల భవనం టాప్ ఫ్లోర్‌లో వాతావరణం గంభీరంగా ఉంది.

 

 

తన లగ్జరీ క్యాబిన్‌లో కూర్చుని, ఎదురుగా ఉన్న లాప్‌టాప్‌లో ఒక ప్రాజెక్ట్ ఫైల్‌ను అత్యంత సీరియస్‌గా చెక్ చేస్తున్నారు మిస్ నీలాంబరి జైన్.

 

 

 

ఆవిడ ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేదు, కానీ ఆ కళ్లలో ఒక సామ్రాజ్యాన్ని శాసించే పవర్ ఉంది. ఒక్కసారిగా ఆమె చూపు ఫైల్‌లోని ఒక లైన్ దగ్గర ఆగిపోయింది.

 

 

“శేఖర్!” ఆమె గొంతు క్యాబిన్‌లో పదునైన కత్తిలా ప్రతిధ్వనించింది.

 

 

“చెప్పండి మేడమ్,” అంటూ ఆవిడ పర్సనల్ అసిస్టెంట్ (PA) శేఖర్ వణుకుతూ లోపలికి వచ్చాడు. 

 

ఈసారి ఫైల్‌లో ఏ తప్పు దొర్లిందో, ఎవరి తలకాయ ఎగిరిపోతుందో అని అతని మనసు కీడు శంకిస్తోంది. కొద్దిగా వంగి వినయంగా నిలబడ్డాడు.

 

“ఈ ప్రాజెక్ట్ లీడర్ ఎవరు?” ఆమె అడిగిన విధానంలోనే ఒక ప్రమాదం దాగి ఉంది.

 

“ఆ… అది… కౌశిక్, మేడమ్,” అని తడబడుతూ చెప్పాడు శేఖర్.

 

“కౌశిక్? కౌశిక్ అంటే నాకెలా తెలుస్తుంది శేఖర్? ఈ కంపెనీలో పనిచేసే చిన్న చిన్న ఎంప్లాయీస్ పేర్లు గుర్తుపెట్టుకునేంత టైమ్ నాకు లేదు ,” చాలా సీరియస్ లుక్‌తో, ఎంతో ఇరిటేషన్‌గా అంది నీలాంబరి

 

 

“కానీ మేడమ్, మీరే కదా నిన్న…” అని అతను తనను తాను డిఫెండ్ చేసుకుంటూ మాట పూర్తి చేసేలోపే… 

 

 

నీలాంబరి తన చూపుల్ని లాప్‌టాప్ మీదనుండి శేఖర్ వైపు తిప్పింది. ఆవిడ చిరుతపులిలా చూసిన ఆ ఒక్క చూపుకే శేఖర్ నోట మాట ఆగిపోయింది. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు భయంతో సైలెంట్ అయిపోయాడు.

 

 

 

 

“ఫైర్ హిమ్ నౌ! ఇతన్ని వెంటనే టెర్మినేట్ చేయండి. ఒక టీమ్‌ను ఎలా మేనేజ్ చేయాలో, రిపోర్ట్ ఎలా చెక్ చేయాలో కూడా చేతకాని ఫూల్స్ నా కంపెనీలో ఉండటానికి వీల్లేదు. బ్లడీ ఇడియట్స్… నా మనీ, నా టైమ్ వేస్ట్ చేస్తున్నారు,” అని ఆజ్ఞ జారీ చేసినట్లుగా చెప్పి, వెంటనే లాప్‌టాప్ మూసేసి, తన క్యాబిన్‌కి అటాచ్ అయ్యి ఉన్న పర్సనల్ రెస్ట్ రూమ్‌లోకి కోపంగా వెళ్లి తలుపులు వేసుకుంది.

 

 

 

శేఖర్ వణుకుతున్న చేతులతో లాప్‌టాప్ ఓపెన్ చేసి చూశాడు.

 

అందులో ఒకరు ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒకలా రాస్తే, ఇంకొకరు ప్రాజెక్ట్ ప్లాన్ ఇంకోలా రాశారు. ఆ చిన్న మిస్టేక్ రేపు క్లయింట్ ముందు కొన్ని కోట్ల రూపాయల డీల్ క్యాన్సిల్ అయ్యేలా చేయగలదు.

 

 

 

‘ఇది చూశాక మేడమ్ వాడిని తీసేయడంలో తప్పే లేదు. కనీసం ఫైనల్ చెక్ చేసుకోకుండా ప్రాజెక్ట్ పంపిన ఆ లీడర్ గాడిదే తప్పు’ అని మనసులో అనుకుంటూ, కౌశిక్ టెర్మినేషన్ లెటర్ టైప్ చేయడానికి బయటకు వెళ్లిపోయాడు శేఖర్.

 

 

 

 

అద్దాల గదిలో నిలబడి, ఆ భారీ గ్లాసెస్ నుండి ముంబై సిటీ రాత్రి అందాలను, కింద చీమల్లా కదులుతున్న మనుషులను తీక్షణంగా చూస్తూ ఆలోచిస్తుండగా… 

 

 

నీలాంబరి ఫోన్ మోగింది.

 

నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేసి, “చెప్పండి,” అంది గంభీరంగా.

 

 

“మేడమ్… నేను రాజేంద్రను. అదే… మీ అబ్బాయిని హార్వర్డ్ (Harvard) యూనివర్సిటీలో జాయిన్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి ఫోన్ చేశాను,” అని అవతలి వ్యక్తి ఎంతో వినయంగా అంటుంటే…

 

 

 

“చూడండి మిస్టర్ రాజేంద్ర ! మీరు ఎందుకు ఇన్నిసార్లు నన్ను బ్రతిమాలుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు రోహన్‌ని ఇప్పుడు  విదేశాలు పంపించడం ఏమాత్రం ఇష్టం లేదు,” అని సూటిగా, మొహం మీదే చెప్పేసింది నీలాంబరి.

 

 

 

 

“అలా అనకండి మేడమ్, ఒక్కసారి బాగా ఆలోచించండి. మీ అబ్బాయి ఐక్యూ (IQ) 155! అంటే ప్రపంచంలోనే ఉన్న 1% అతి తెలివైన వాళ్ళలో అతను ఒక్కడు. అంత బ్రిలియంట్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్‌ని ముంబైలోనే చదివించడం దేనికి మేడమ్? పైగా హార్వర్డ్ లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సిటీ మీ అబ్బాయిని తమ దగ్గర జాయిన్ చేయమని స్వయంగా రిక్వెస్ట్ చేస్తోంది. రోహన్ భవిష్యత్తు…” అతను ఇంకా ఏదో చెప్పబోతుండగా నీలాంబరి మాట కట్ చేసింది.

 

 

 

 

“హెన్రీ ఫోర్డ్, మార్క్ జుకర్‌బర్గ్… వీళ్లెవరూ హార్వర్డ్ పాస్ అవ్వలేదు రాజేంద్ర. ఐ నో… హార్వర్డ్ అవకాశం కాదనడం అనేది ఎంత బిగ్ డెసిషన్ అని నాకు తెలుసు. బట్, నా కొడుక్కి ఏం కావాలో, వాడికి ఏది కరెక్టో నాకు మాత్రమే తెలుసు. నేను వాడి ముందు పెట్టబోయేది హార్వర్డ్ కన్నా వంద రెట్లు గొప్పది. నా సామ్రాజ్యం… ఈ AKV(అకిరా వర్చస్వ కార్పొరేషన్ )! ఇట్స్ నాట్ ఏ నార్మల్ కంపెనీ. 

 

 

 

నా సామ్రాజ్యాన్ని రేపు పాలించాలంటే… నా తర్వాత దాన్ని నడిపించేవాడు నన్ను మించి ఉండాలి. వాడు నా కళ్ల ముందే, నా కనుసన్నల్లోనే పెరగాలి. రోహన్ బాధ్యత నాది… మీకు అర్థమైంది అనుకుంటా?”

 

 

 

అని అతను మరో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఖరాఖండిగా చెప్పి ఫోన్ కట్ చేసింది నీలాంబరి. ఒక కొడుకు జీవితాన్ని,  ఫ్రెండ్స్‌ని, అతని భవిష్యత్తుని అణువణువు శాసించే ఒక రాక్షస తల్లి ప్రేమ అది! మరి ఆమె అలా ఎందుకు మారిందో…??

 

ఇంకా ఉంది…..