New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
╰┈➤𝐀𝐥𝐦𝐨𝐬𝐭 𝐈𝐬𝐡𝐪 ᥫ᭡🪽 – 3

╰┈➤𝐀𝐥𝐦𝐨𝐬𝐭 𝐈𝐬𝐡𝐪 ᥫ᭡🪽 – 3

 

 

 

 

 

 

 

 

అదే సమయంలో… ముంబై శివార్లలోని ఒక ప్రైవేట్ రేస్ ట్రాక్.

 

 

చీకటిని చీల్చుకుంటూ ఓపెన్-వీల్ రేసింగ్ కార్స్ (F1 టైప్ కార్లు) చెవులు పగిలేంత సౌండ్ చేస్తూ దూసుకుపోతున్నాయి. 

 

 

ఆ రేస్ ట్రాక్ మధ్యలో ఒక కుర్రాడు నిలబడి భయంతో వణికిపోతున్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కళ్లు మూసుకుని ఉన్నాడు.

 

 

అతని రెండు వైపుల నుండి రెండు కార్లు గాలిని చీల్చుకుంటూ సెకనుకు పది కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయాయి. ఆ కార్ల టైర్ల రాపిడికి వస్తున్న పొగ, మండుతున్న రబ్బరు వాసన ఆ కుర్రాడికి నరకాన్ని చూపిస్తున్నాయి.

 

 

 

ఇంతలో రోహన్ డ్రైవ్ చేస్తున్న మూడో కారు ఆ అబ్బాయి మీదికి ఎక్కించేసేంత స్పీడ్‌గా దూసుకొచ్చింది. కారు బంపర్ ఆ అబ్బాయి కాలికి తగులుతుందేమో అన్నంత దగ్గరగా వచ్చి, కేవలం ఒక అడుగు దూరంలో సడెన్‌గా బ్రేక్ వేసి, కారును రౌండ్‌గా డ్రిఫ్ట్ చేస్తూ పక్కనుండి తిప్పాడు రోహన్.

 

 

అలా చాలాసేపు ఆ కుర్రాడిని రోహన్, దేవాన్ష్, ఆరవ్‌లు తమ కార్లతో చావు చివరంచుల వరకు తీసుకెళ్లినంత పని చేసి… చివరికి ముగ్గురూ ఒక్కసారిగా డ్రిఫ్ట్ చేస్తూ వాడి చుట్టూ కార్లను బ్రేక్ వేశారు. 

 

ఆ దెబ్బకు ఆ కుర్రాడు భయంతో ప్రాణం పోయినంత పనై కింద పడిపోయాడు.

 

 

ఇంతలో స్టాండ్స్ నుండి సైలెంట్‌గా ఇదంతా చూస్తున్న జై, నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ల దగ్గరికి వచ్చాడు.

 

 

కార్లలో ఉన్న దేవాన్ష్, ఆరవ్‌లు డోర్స్ తీసి బయటకు దిగారు. దేవాన్ష్ వెళ్లి కింద పడి వణుకుతున్న ఆ అబ్బాయి కాలర్ పట్టుకుని లాగి, రోహన్ కారు ముందు మోకాళ్ల మీద కూర్చోబెట్టాడు.

 

 

 

కారు ఇంజిన్ ఆపి, నెమ్మదిగా హెల్మెట్ తీసి డోర్ తెరుచుకుని బయటకు వచ్చాడు రోహన్ జైన్ RJ.

 

 

రోహన్ జైన్! చూడటానికి 6’2 ఫీట్ హైట్. ఫారిన్ కలర్‌ని, ఇండియన్ ఫీచర్స్‌ని మిక్స్ చేసి దేవుడు స్వయంగా చెక్కినట్లు ఉంటాడు. ఫెయిర్ స్కిన్ టోన్, కళ్లలోకి చూస్తే ఎవరినైనా లాగేసుకునేంత లోతైన సముద్రం లాంటి బ్లూ ఐస్. గాలికి ఎగురుతున్న మెస్సీ హెయిర్. ప్రెసెంట్ రేస్ సూట్ లో చూడటానికి అల్టిమేట్ స్టైలిష్‌గా ఉన్నాడు.

 

 

రోహన్ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆ అబ్బాయి ముందు నిలబడ్డాడు. జేబులో ఒక చెయ్యి పెట్టుకుని, సైడ్ స్మైల్ చేస్తూ…

 

 

“చెప్పు… ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మొన్న పబ్ బయట ఎవరితోనో అన్నావట… RJ అంటే నాకేమైనా భయమా!అని ఇప్పుడు చెప్పు, భయం లేదా నేనంటే?” అని అడిగాడు. ఆ వాయిస్ లో కోపం లేదు, అరుపుల్లేవు… కానీ గుండెల్లో వణుకు పుట్టించేంత క్రూరమైన గంభీరత ఉంది.

 

 

 

ఆ కుర్రాడు భయంతో ఏడుస్తూ వణుకుతున్నాడు.

 

 

“రేయ్! ఇప్పటికే వాడికి ప్యాంట్ తడిచిపోయింది, వదిలేరా వాడిని,” అని జై కూల్‌గా రోహన్‌కి చెప్పాడు.

 

 

జై… రోహన్ కి బెస్ట్ ఫ్రెండ్. రోహన్ ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, అతని చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేది కూడా నీలాంబరి అతని చిన్నప్పటినుండే డిసైడ్ చేసింది. ఆ విధంగా రోహన్‌కి జై, దేవాన్ష్, ఆరవ్ లు పరిచయమయ్యారు. ముగ్గురూ రోహన్‌కి ఏమాత్రం తక్కువ కాదు. ఆస్తి, అంతస్తు, అందం అన్నీ పీక్స్‌లో ఉన్నవాళ్లే. వాళ్లకి ఆ స్టేటస్ ఉంది కాబట్టే రోహన్‌తో తిరగనిచ్చింది నీలాంబరి.

 

 

 

రోహన్ జేబులో చేతులు పెట్టుకుని అలా నిలబడగానే… 

 

స్టాండ్స్ దగ్గర ఉన్న వాళ్ల బాడీగార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఆ నలుగురికి రేస్ ట్రాక్ మీదే విఐపి చైర్స్ వేశారు.

నలుగురూ దర్జాగా ఒక రాజులు లాగా ఆ అబ్బాయి ముందు కూర్చున్నారు.

 

 

మోకాళ్లపై ఉన్న ఆ అబ్బాయి, చెమట తుడుచుకుంటూ, ఏడుస్తూ… “నాకు… నాకు భయమేస్తుంది RJ , నేను తప్పుచేసాను, ప్లీజ్ నన్ను వదిలేయండి,” అని రెండు చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు.

 

 

రోహన్ ముందుకు వంగి వాడి గడ్డం పట్టుకుని తనవైపు తిప్పుకున్నాడు.

 

“ఏంటి… ఇంత చిన్నదానికే షివర్ అవుతున్నావ్? నీ డేరింగ్ ఏమైంది? ఈ RJ ని చూడగానే అప్పుడే భయం వేసిందా?” అన్నాడు వెటకారంగా నవ్వుతూ.

 

 

 

“అవును… అవును! RJ అంటే ఏంటో ఇప్పుడు నాకు తెలిసివచ్చింది. నన్ను క్షమించు భయ్యా. ప్లీజ్ నన్ను ఇంకేం చేయొద్దు, లీవ్ మీ!” అని భోరున ఏడ్చేశాడు ఆ కుర్రాడు.

 

 

 

రోహన్ కళ్లలో ఒక శాడిస్టిక్ ఆనందం మెరిసింది. తల తిప్పి తన ఫ్రెండ్స్ వైపు ఒక లుక్ ఇచ్చాడు. ఆ చూపులోని అర్థం గ్రహించిన దేవాన్ష్, వెనక ఉన్న తన గార్డ్ చేతిలోంచి ఒక ఎలక్ట్రిక్ షేవింగ్ మెషిన్ (Trimmer) తీసుకుని, మోకాళ్లపై ఉన్న ఆ అబ్బాయి ముందు విసిరాడు. అది వాడి కాళ్ల దగ్గర పడి ఆన్ అయ్యి సౌండ్ చేస్తోంది.

 

 

 

 

ఆ అబ్బాయి దాన్ని చూసి జంకుతూ, కన్నీళ్లతో రోహన్ వైపు చూశాడు.

 

 

“ఐ విల్ లెట్ యు గో…” అన్నాడు రోహన్ చాలా క్యాజువల్‌గా కుర్చీలో వెనక్కి వాలుతూ. “బట్… నువ్వు ఆ షేవర్ తీసుకుని, నీ చేతులతో నీ జుట్టు మొత్తం గుండు గీసుకుంటేనే! లేదంటే ఇక్కడినుండి నువ్వు నడుచుకుంటూ వెళ్లాలా, లేదా కారు టైర్ల కింద నలిగిపోవాలా డిసైడ్ చేస్తా … ఛాయిస్ ఈజ్ యువర్స్!”

 

 

 

 

ఆ మాట విన్న ఆ కుర్రాడికి భూమి కంపించినట్లు అనిపించింది. పబ్లిక్‌గా అది కూడా తన ఫ్రెండ్స్ ముందు గుండుతో తిరగడం ఎంత అవమానమో తలచుకుని, చేసేదేమీ లేక ఏడుస్తూ ఆ ట్రిమ్మర్ చేతిలోకి తీసుకుని తన తల పట్టుకున్నాడు.

 

 

హాయ్ ఫ్రెండ్స్  చిన్న రైటర్ నీ ఎంకరేజ్ చెయ్యండి….💛

 

ఇంకా ఉంది..