అందాల రాక్షసి{2}-124

అందాల రాక్షసి{2}-124

Sravani Naramala

Author

విప్లవ్ నెమ్మదిగా ఆయుష్  దగ్గరకు వచ్చాడు……. !!  ఆయుష్ కళ్ళు మాస్క్ వెనుక నుండి నిప్పులు కురిపిస్తున్నాయి…….. !!  విప్లవ్ ఆ కళ్ళలోకి చూస్తూ ఒక్క క్షణం ఆగిపోయాడు ఆ కళ్ళు చూస్తుంటే ఎక్కడో చూసిన పరిచయం, వెన్నులో వణుకు పుట్టించే తీవ్రత విప్లవ్ కి ఏదో అనుమానాన్ని కలిగిస్తోంది………!!

లుక్ డాక్టర్  ఆపరేషన్ అయ్యాక ఆ కడుపులో ఉన్న బేబీ చచ్చిపోయింది  అని నాకు కన్ఫర్మ్ చేయాలి……. !! ఏ మాత్రం తేడా వచ్చినా నా గురించి తెలుసు కదా మీ ఫ్యామిలీ ఉండదు గుర్తుంచుకో అలాగే వర్క్  త్వరగా అయిపోవాలి…….. !!  ఆ అమ్మాయికి ఏమైనా అయితే నీ ప్రాణాలు ఉండవు జాగ్రత్త ……… !! ఆయుష్ మాస్క్ వెనుక చిన్నగా నవ్వి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ……… !! ఒకే అన్నట్టు తల ఊపి  లోపలికి వెళ్ళిపోయాడు ఆ నెక్స్ట్ మినిట్ ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసుకున్నాయి……… !!