హాల్‌లో అందరి ముందు మున్నా ప్రణవి ల మ్యారేజ్ గురించి అందరికీ చెప్పిన తర్వాత …….. !! ఆయుష్ గంభీరంగా నడుచుకుంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోతాడు………. !! మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నా ముఖంలో మాత్రం ప్రశాంతత కనిపిస్తోంది………. !! విండో పక్కన నిలబడి బయట గార్డెన్ లో కనిపిస్తున్న గ్రీనరి ను చూస్తున్న ఆయుష్ దగ్గరకు ఆషి మెల్లగా నడుచుకుంటూ వస్తుంది…….. !!