కానీ మధు మాత్రం ఇవేం తెలియకుండా స్పృహ కోల్పోయింది!
తల్లి అయితే గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఇప్పటివరకు తండ్రి కన్నీళ్లను చూడని చరణ్ కూడా ఆ క్షణం చూస్తూ కిరణ్ ని కోపంగా ఇంత మందిని ఏడిపించి నువ్వు వెళ్లడం అవసరమారా!
ఆ దేవుడు నన్ను తీసుకొని వెళ్లి ఉన్న బాగు నిండు అసలు నా ప్రేమ విషయం ఎందుకు తెలుసుకున్నావ్ నాకోసం ఎందుకు రావాలనుకుంటున్నావ్?
అని బాధగా కోపంగా అడుగుతుంటే చూడ్డానికి వచ్చిన డాక్టర్స్ బాడీని ఎక్కువ సేపు ఉంచడం మంచిది కాదు, అని చెబితే పద్మ కిరణ్ ముఖాన్ని తన కొంగు కింద దాచుకుంటూ నా కొడుకుని ఎవరు ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు వాడిలాగే అయినా మాతో పాటు ఉంటాడు అని చెబుతుంటే ఆ తల్లి కడుపుకోత చూసిన అందరికీ కళ్ళల్లో నీళ్లు ఆపుకోవటం కష్టమయ్యింది.
కిరణ్ అంతిమయాత్ర మొదలైనప్పుడు కళ్ళు తెరిచిన మధు ఆమె కోసం పాడే ఎత్తకుండా ఐదు నిమిషాలు అలాగే ఉంచితే మౌనంగా వచ్చి అతని దగ్గర కూర్చుని నుదుటిమీద ముద్దు పెట్టుకుని మీరు నాతో పాటు,
ఉంటారని నేను అనుకుంటున్నాను మీకోసం వచ్చేంతవరకు ఈ జీవితాన్ని ఇలాగే గడిపేస్తాను కిరణ్ నాకోసం ఎదురు చూస్తూ ఉంటారా? అని చెప్పి అతని ఎండిపోయిన పెదవుల మీదే ఇంకో ముద్దు పెట్టేసి అతన్ని సమాధి చేసిన మనసుతో కాటికి సాగనంపింది మధు.