శివప్రసాద్ పద్మ వాళ్లకు కూడా మధు బాగా నచ్చేసరికి,
మాట్లాడడానికి నాన్చుతుంటే పంతులు గారే ఇద్దరి వైపు ఉన్న పేరెంట్స్ హావాభావాలు అర్థం చేసుకొని ఇంకా చెప్పండి అయ్యా చూస్తుంటే మీకు అబ్బాయి నచ్చాడు ఇక వీళ్ళకి కూడా అమ్మాయి నచ్చింది త్వరలో మాఘమాసం కూడా రాబోతుంది!
అన్ని ఓకే చేసుకుంటే గట్టిగా నేలలో పెళ్లి చేసేద్దాం అని ఆయనే ముందుకు నెట్టేసరికి,
పద్మ నే ముందు, మాకు అమ్మాయి నచ్చిందండి చక్కగా చాలా సింపుల్ గా ఉంది మా అబ్బాయికి కరెక్ట్ జోడి!
ఇక కట్న కానుకలు అంటే మేము కూడా అంత ఏమీ ఆశించడం లేదు మీరు అమ్మాయికి గోల్డ్ పెట్టాలంటే పెట్టండి నిశ్చితార్థం మీరు జరిపిస్తే పెళ్లి మేము మనకు దగ్గర రేంజ్ లో జరిపిస్తాము చెప్పింది.