New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మళ్లీ నిన్నే-1

మళ్లీ నిన్నే-1

కిరణ్ ఎక్కడ?
ఇంకా స్నానం కూడా చేయలేదా నువ్వు? ఒకవైపు పెళ్లి చూపులకి టైం అయిపోతుంటే ఇప్పుడేం పని పెట్టుకున్నావు రా నువ్వు అంటూ సున్నితంగా కిరణ్ ని కోప్పడుతోంది వాళ్ళ అమ్మ పద్మ.

ఇంకా అరగంట టైం ఉంది కదవే ఎందుకు అప్పుడే తొందర పెడుతున్నావు పేషంట్ స్కాన్ రిపోర్ట్స్ చూస్తున్నా!
అయినా నాది ఎంతసేపు స్నానం చేసి ప్యాంటు చొక్కా తొడుక్కోవడమే కదా నువ్వెళ్ళమ్మ నేను వస్తాను అంటూ తన గదిలోకి వచ్చిన పద్మ కి చెబుతున్నాడు కిరణ్.

అసలు నువ్వు డాక్టర్ అయినప్పటినుండి!
సరిగ్గా బట్టలైనా వేసుకున్నావంట్రా!
ఏ షర్టుకి ఏ ప్యాంటు వేసుకున్నావో కూడా తెలియనంత హంగామా పడిపోతుంటావు ఈరోజు నిన్ను ఖాళీ చేయించి పెళ్లిచూపులు అరేంజ్ చేయడానికి నాకే మూడు నెలలు టైం పట్టింది ఏంటో ఏమో చెప్పాన అక్కడికి మీ నాన్నకు ఈ డాక్టర్ చదువులు అవన్నీ వద్దండి ఏదో 9 కెళ్ళి ఆరుకు ఇంట్లో ఉండే జాబ్ చేసే చదువు చదివిపియండి అని ఎక్కడా ఎడ్యుకేషన్ లోన్లు పెట్టి మరి నిన్ను డాక్టర్ని చేశాడు అని పద్మ మెత్తగా తిట్లు పెడుతుంటే,

స్కాన్ రిపోర్ట్స్ చదవడం పూర్తి అవ్వడంతో పక్కన పెట్టేసిన కిరణ్ అమ్మ భుజం చుట్టూ చేతులు వేసి,
నాన్న నన్ను డాక్టర్ని చేసింది సంపాదించడానికి కాదమ్మా 10 మంది ఆరోగ్యం చూసుకోవటానికి ప్రాణాలు పోయడానికి సరైన అంతగా కోప్పడకు నాకు అక్క లాగా ఉన్నావు కోపం పెంచుకుంటే ముసలిదానివి అయిపోతావు అని చెప్పి స్నానానికి వెళ్లిపోయాడు కిరణ్.

సంబంధం చూసిన పంతులుగారు,
కిరణ్ పద్మ ఇంకా ఆ ఇంటి యజమాని శివప్రసాద్ నలుగురు హాల్లో రెడీ అయ్యారు.

కారులో ఎక్కబోతుంటే ఆపేశారు పంతులు ఏంటమ్మా శుభమా అని పెళ్లి చూపులుకి పోతా నలుగురం ఎలా ఇంకొక రావాలి కదా ఐదు మంది వెళ్తే బాగుంటుంది అని చెప్పగానే, పద్మ చిన్నోడి కోసం కేకలు వేసింది.

బాగా నిద్రపోతున్నట్లు ఉన్నాడు మధ్యలో తల్లి పిలిచిందానికి విసుగ్గా బయటికి వచ్చి ఏంటి మమ్మీ అని ఆవలిస్తూ అన్నాడు చరణ్.

ఒరేయ్ లెక్క తక్కువయింది నువ్వు కూడా మాతో పాటు పెళ్లి చూపులు రారా అన్నయ్య చేసుకోవాల్సిన అమ్మాయిని చూద్దువు అని చెబుతుంటే,

మా నువ్వు మరీ మాట్లాడతావు అక్క పెళ్లి చూపులు జరుగుతుంటే చెల్లిని పక్కన పెట్టిస్తారా ఎవరైనా ఇది కూడా అంతే అన్నయ్య కంటే నేను ఇంకొంచెం హైట్ కలరు బానే ఉంటాను కాబట్టి అమ్మాయికి నేను నచ్చితే అని చెప్పగానే తల్లి సీరియస్గా చూస్తుంటే కిరణ్ మాత్రం ప్రసన్నంగానే చూస్తున్నాడు.

అతని పొట్టలో గుద్ది అయిన మా అన్నయ్యని చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి లే!
కచ్చితంగా నువ్వు నచ్చుతావ్ గానీ నాకు ఇంట్రెస్ట్ లేదురా రావాలనిపించడం లేదు అని చరణ్ అన్నకు నచ్చచెప్పుకుంటుంటే ఇంకా ఏం చేస్తారు పక్కింటి ఆవిడని తీసుకొని పెళ్లి చూపులకి బయలుదేరారు అందరూ.

చక్కటి పొదిరిల్లు వెంకటేష్ సునీతలది.
చిన్న గవర్నమెంట్ ఉద్యోగి అయినా లోన్స్ తీసుకోకుండా పైసా పైసా కూడబెట్టుకుంటూనే వాళ్ళ ఇద్దరి కోసం పైగా పుట్టిన ఇద్దరు పిల్లల కోసం చిన్న ఇల్లును నిర్మించుకున్నారు.

కూతురు మధుమిత తనే ఇప్పుడు మన పెళ్లికూతురు.

బీటెక్ చదివి రెండు సంవత్సరాలయింది!
కానీ ఆమెను బయట సిటీస్ కి పంపించడం ఇష్టం లేక, ఊర్లోనే స్కూల్లో టీచర్గా పంపిస్తున్నాడు వెంకటేష్ తన కూతురిని.

ఇంకా ఒక కొడుకు అతడి ఇప్పుడు బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు కష్టం లేని చదువు పైగా వాళ్ల బడ్జెట్లో వచ్చేది కాబట్టే కొడుకు కూతురు ఇద్దరినీ బీటెక్ జాయిన్ చేశాడు వెంకటేష్.

ఇక కూతురికి ఒంటిమీదకి 24 ఏళ్లు వచ్చేసాయి, పెళ్లి చేసి ఒక మంచి వాడి చేతుల్లో తనలాగే కేరింగ్ గా చూసుకునే అతనికి చెప్పి పెళ్లి చేయాలన్నది వెంకటేష్ ఆలోచన.

సాయి కిరణ్!
ఆ ఊర్లో మరి అందరికీ తెలియకపోయినా కూడా హస్తవాస్తు, ఉన్న డాక్టర్.

తెలిసిన పంతులు గారి ద్వారా కిరణ్ ప్రొఫైల్ వెంకటేష్ గారి వరకు వచ్చింది కానీ ఆయన డాక్టర్ సంబంధం కట్నం ఎక్కువ తీసుకుంటారేమో అని భయపడుతున్నా కూడా ఆ పంతులు గారే వాళ్లు కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్లేనండి అమ్మాయి నచ్చితే వాళ్లకు కట్న కానుకల మీద ఆశయం లేదు అని చెప్పేసరికి మొదటి అడుగుగా పెళ్లిచూపులకు ఒకే చెప్పారు.

మధు!
అమాయకురాలు కాదు సున్నితమైన అమ్మాయి మెచ్యూర్డ్ గర్ల్.
ఎప్పుడు ఏం చేయాలి తండ్రికి ఆసరాగా ఎలా ఉండాలి తల్లికి ఇంటి పనుల్లో ఎలా హెల్ప్ చేయాలి తమ్ముడికి కరెక్ట్ పాత్ ఎలా చెప్పాలి అన్నది ఆమెకు బాగా తెలుసు.

అందుకే ఇప్పుడు ఎక్కువ టెన్షన్ పడకుండా తనదైన స్టైల్ లో సింపుల్ గా పర్పుల్ కలర్ చిన్న బోర్డర్ ఉన్న సారీ కట్టుకొని తనకున్న బంగారు నగలు వరకు మాత్రమే పెట్టుకుంది ఏ హడావిడి లేకుండా పెళ్లి చూపులకి.

కిరణ్ కార్ ఇంటి ముందు ఆగగానే వెంకటేష్ హడావిడి పడుతూ అందరినీ లోపలికి ఆహ్వానించాడు.

అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చున్నాక ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటుంటే కిరణ్ ని ఫోటోలో కంటే రియల్ గా ఇంకా సాఫ్ట్ గా పద్ధతి అయిన వాడిలాగా కనిపించేసరికి కుదిరిపోతే బాగుండు అన్న ఫీలింగ్ వెంకటేష్ సునీతలకు కలిగింది.

పంతులుగారు టైం చూసి ఇక అమ్మాయిని తీసుకురండి అని చెప్పగానే,
మధుమిత ని తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చోబెట్టింది సునీత.

మరి తెలుపు కాదు అలా చామన చాయ కాదు గోధుమపిండి రంగులో ఉన్న ఆమె నడుము వరకు ఉన్న జుట్టు చేతికి సింపుల్గా మూడు మూడు గాజులు ఆడంబరం లేకుండా రెడీ అయిన విధానం మధు ని చూడగానే కిరణ్ స్టెన్ అయిపోయాడు.

అతడికి కావాల్సింది కూడా అలాంటి అమ్మాయి అనిపించడంతో సూటిగా మధుమిత వైపే తన చూపులు సారించాడు అతను.