Mr. ప్రవరాఖ్యుడు – 5
పెద్ద అక్షరాలతో మెరిసిపోతున్న VARMA GROUP OF COMPANIES….
25 అంతస్తులో CEO క్యాబిన్….
లాప్టాప్ లో ఏదో ఫైల్ చూస్తూ కూర్చుని ఉన్నారు మహేంద్ర వర్మ గారు… అప్పుడే డోర్ నాక్ చేసి లోపలికి వచ్చారు జనరల్ మేనేజర్…
” సార్ , ఈ రోజు ఆఫ్టర్నూన్ మీటింగ్ కి సంబందించిన ఫైల్స్ రెడీ చేశాం..మీ సిగ్నేచర్ కావాలి “
” కీప్ థెం ఆన్ ది టేబుల్ ”
” సర్ , వన్ మోర్ థింగ్ , ఈ రోజు మీరు ఫ్యాక్టరీ విసిట్ కి కూడా వెళ్ళాలి ”
లాప్టాప్ నుండి తల ఎత్తకుండానే ” why ” అని అడిగారు మహి గారు
” సార్ , లాస్ట్ వీక్ మీరు అడిగిన ప్రొడక్షన్ రిపోర్ట్ విషయంలో”
” Mr. Rao “
” ఎస్ సార్”
” నేను అడిగింది ప్రొడక్షన్ రిపోర్ట్స్….excuses కాదు.. రెండిటికీ డిఫరెన్స్ తెలుసు కదా”
” సారీ సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ “
” గుడ్ , నౌ లీవ్ “
అతను వెళ్ళిపోయాడు …
మహీంద్రా గారు మళ్ళీ తన పనిలో పడిపోయారు…
#### కాలేజ్
ధీరజ్ బ్యాచ్ మొత్తం క్లాస్ కి వచ్చింది … ధీరజ్ చూపు మాత్రం హీరా పైనే ఉంది …. ధీరజ్ అలా హీరా వైపు చూస్తుండడం అతనంటే ఇష్టం వున్న వాళ్ళ గ్రూప్ అమ్మాయి గమనిస్తుంది … కుళ్ళు మొత్తం కళ్ళల్లోనే తెలిసేలా హీరా నీ పిలుస్తుంది … హేయ్ యు… వైట్ అనార్కలి అంటూ….
హీరా సీనియర్స్ కాబట్టి వెంటనే లేచి నిలబడి ఎస్ సిస్టర్ అంటుంది …
” హే … సిస్టర్ ఏంటీ , కాల్ మీ మేడమ్ ” అని పొగరు గా అంటుంది …
” ఎస్ మేడమ్” అంటుంది హీరా ..
” నీ నేమ్ ?? ”
హీరా మేడమ్
ఎక్కడి నుండి??
పక్కన విలేజ్ నుండి మేడమ్ ..సబ్బవరం ..
ఓహో… పల్లెటూరు బైతు వా … అంటూ ఎగతాళి గా మాట్లాడుతూ … ఓకే…ఇంత పెద్ద కాలేజ్ లో ఫీస్ కట్టి జాయిన్ అయావ అంటుంది థాట్ సీనియర్…
హీరా కొంచెం కూడా తొనకకుండా..”నో మేడమ్ .. స్కాలర్ షిప్” అని చెపుతుంది..
ఓహ్… అనుకున్న… పల్లెటూరు నుంచి వచ్చి అంత ఫేస్ నువ్వెక్కడ కడతావ్ ..?? స్కాలర్ షిప్ తో ఫ్రీ గా చదివేయడానికి వచ్చేశావు..నీ పని బావుంది గా …
హీరా ఒక్క మాట కూడా మాట్లాడలేదు…ఆ సీనియర్ కళ్ళలో కోపం , ద్వేషం మాత్రమే చూస్తూ నిలబడింది… హేయ్ దీపిక … అని బేస్ వాయిస్ తో పిలిచాడు ధీరజ్..
దీపిక మూతి తిప్పి పక్కకి వెళ్ళిపోతుంది…
హై.. హీరా ఐయాం ధీరజ్ అంటూ చేతిని ముందు కి చాపాడు…చాలా కూల్ గా అమాయకంగా…
హీరా ఆ చేతిని పట్టుకోకుండా హాయ్ సార్ అంటుంది.. అక్కడ ధీరజ్ ఈగో హార్ట్ అవుతుందీ బట్ పైకి కనపడకుండా జాగ్రత్త పడుతూ చిన్న స్మైల్ ఇచ్చి తనని కూర్చోమని చెప్పి వాళ్ళు వచ్చిన విషయం చెప్పి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు నేమ్స్ ఇవ్వమని చెప్తారు…ఒక అని కొంతమంది ఇస్తారు … షాలు కూడా ఇస్తుంది డాన్స్ కి …హీరా నీ అడుగుతుంది… ఓకే అని హీరా క్లాసికల్ డాన్స్ కి నేమ్ ఇస్తుంది… ఓహో ఈ అమ్మాయికి క్లాసికల్ డాన్స్ వచ్చ అనీ ఆలోచిస్తూ ఒకే గాయ్స్ ప్రిపేర్ ఫర్ కల్చరల్ యాక్టివిటీస్ అంటూ అక్కడి నుండి వెళ్తూ ఒక సారి వెనక్కి తిరిగి చూసి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుకుని వెళ్ళిపోతాడు …
హీరా కి బోరింగ్ గా ఉంటుంది … హేయ్ షాలిని మనం లైబ్రరీ కి వెళ్దామా అని అడుగుతుంది …
ఒక హీరా లెట్స్ గో..అంటూ లేచి నిల్చుంటుంది …ఇద్దరు కలిసి లైబ్రరీ కి వెళ్తారు …అక్కడ హీరా తనకి కావలసిన బుక్ కోసం వెతుకుంటుంది ..ఆది కనిపించక అక్కడ లైబ్రేరియన్ దగ్గర వర్క్ చేసే కుర్రాడిని అడుగుతుంది …లేదు మేడమ్ ఒక కాపీ నే ఉంది ఆది ఒక సార్ తీసుకున్నారు అని చెప్తాడు … ఓహో ఒకే అని వెనక్కి తిరిగి వెళ్ళేదే మళ్ళీ ముందుకు తిరిగి ఎవరు తీసుకున్నారో చెప్తారా నేను అతనినే అడుగుతా అంటుంది ..అదిగో అక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్న అతనే అని చెప్పి వెళ్ళిపోతాడు..ఆ చూపించిన వైపు వెళ్తూ ఉంటే మళ్ళీ అలజడి స్టార్ట్ ఇద్దరికీ …🤧…ఎదురుగా వెళ్ళి పిలిచే లోపు అతనే ఆమె ప్రెజెన్స్ నీ తెలిసిన వాడిలా బుక్ లో నుండి ఫేస్ పైకి పెట్టి చూసాడు …ఒక్క నిమిషo గుండె ఆగిన ఫీలింగ్ క్యారీ చేశారు ఇద్దరు…కానీ అది పైకి కనపడకుండా దాచేస్తూ నార్మల్ గా ఏంటి అన్నట్లు చురకత్తుల్లంటి చూపు తో చూస్తూ ఉంటే హీరా అయితే తను ఎందుకొచ్చింది కూడా మర్చిపోయి చూస్తూ ఉంటుంది 🤗…అలా వున్నాడు మరి బ్లాక్ షర్ట్ లో హీరో బాబు ….ఆమె అలా చూస్తుంటే లోపల తెలియని అలజడి కమ్మిన దాన్ని అసహనం తో కప్పేస్తూ హలో మిస్ అని హీరా ఫేస్ పై హ్యాండ్ వేవ్ 👋 చేస్తాడు …దానితో ఆమె స్పృహ లోకి వచ్చి నొథింగ్ సార్..అంటూ వడి వడి గా నడుచుకుంటూ షాలు నీ కూడా వదిలేసి పోతుంది …ఆమె అలా తిప్పుకుంటూ పోతుంటే రిషి కి లోపల తీయని సలపరం పుడుతుంది …దానితో గట్టిగా తల విదిలించి మళ్ళీ బుక్ లో మొహం పెడతాడు….
హీరా ఫాస్ట్ గా వాష్ రూం లోకి వెళ్ళి మిర్రర్ లో తనని తాను చూస్తూ ” ఒసేయ్ Heera.. మగాళ్ళను ఎప్పుడూ చూడనట్లు అతని వైపు అలా చూస్తావేంటి?? నీ గురించి అతనేమనుకుంటాడు..అని తిట్టుకుంటూ మళ్ళీ అతని ముఖం గుర్తుకు వచ్చి బుగ్గలు ఎర్రగా చేసుకుంది…లేదు లేదు హీరా యూ కాంట్ డూ థిస్..అంటూ motivate చేసుకుని బయటకి వస్తుందీ….అక్కడా….
మీ
❤️ స్వీటీ ❤️
నచ్చితే follow చేసి comment చేయండి
Swipe left/right or tap the sides to turn pages