ఆకాష్ గాయత్రి చేతిలోని డ్రగ్ ను తీసుకుని దాని వైపు చూస్తూ ………. !! వరుణ్ మొహాన్ని గుర్తు చేసుకుంటూ క్రూరంగా నవ్వుతూ రేయ్ వరుణ్ నువ్వనే వాడివే లేకపోతే ……… !! నాకు ఏ అడ్డు ఉండదు రా నీ వల్లే నేను ప్రేమిస్తున్న అమ్మాయి నాకు కాకుండా పోతోంది ……….. !! నువ్వు కన్న కొడుకు అని తెలిస్తే అమ్మ నాకు దూరం అయ్యి నీకు దగ్గర అవుతుంది……… !! అందుకే నా ప్రేమకు అడ్డుగా ఉన్న నిన్ను లేపేయడానికి నీ కన్న తల్లే నాకు దారి చూపిస్తుంది………. !! నీ తల్లి చేతులతో నే చావబోతున్నావ్ నీ అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పు………. !! అని మనసులో కన్నింగ్ గా నవ్వుకుంటూ నువ్వు చచ్చాక నీ పెళ్ళాం తో నీ ఇంట్లో నీ బెడ్ మీద కాపురం చేసి ………. !! పిల్లల్ని కంటాను ఏమ్ చేస్తావ్ రా నువ్వు ఏమి చేయలేవు అని వంకరగా నవ్వుతాడు……… !!
వర్ష ను జస్ట్ టచ్ చేసాను అని ఆ రోజు నన్ను అందరి ముందు కొట్టి అవమానించి నాలో ఈగో ను నిద్ర లేపావ్ ………… !!!నువ్వు ఈ డ్రగ్ తీసుకున్నాక బ్రతికున్నా చచ్చినట్టే నువ్వు చావక ముందే ……… !! వర్ష ను నీ ముందు ముద్దు పెట్టుకుంటా అప్పుడు ఎమ్ చెస్తావో నేను చూస్తాను అని నవ్వుకుంటూ ఉంటాడు …….. !!
ఆకాష్ ఎమ్ ఆలోచిస్తున్నావ్ అంటూ ఆకాష్ బుజం మీద చెయ్ వేసి అడుగుతుంది గాయత్రి…….. !!