పగిలిన మనసు -1
ఎంటి తల్లి నువ్వు వచ్చి వారం రోజులు కూడా అవ్వలేదు అపుడే వెళ్తాను …….. !! అని అంటున్నావ్ అని దిగాలుగా చెప్తున్నాడు ప్రభాకర్ తన కూతురు తనూజ తో ……… !! తన క్లాత్స్ బ్యాగ్ లో సర్దుతూ నాకు లీవ్స్ లేవు డాడీ మళ్లీ వస్తాను కదా అని ప్రభాకర్ ను బుజ్జగిస్తూ చెప్తూ ఉంటుంది తనూజ……!!
ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావ్ తనూ నాకు చాలా బోర్ గా అనిపిస్తుంది రా …….?? నువ్వు వెళ్ళాక నువ్వే గుర్తొస్తావ్ బాగా అని డల్ గా చెప్తున్న ప్రభాకర్ పక్కన కూర్చుని ……. !! నేను నెక్స్ట్ మంత్ వస్తాను కదా డాడీ నువ్వు ఇలా డల్ గా వుంటే నాకు వెళ్ళబుద్ది కాదు అని బాధ గా చెప్తుంది …….!!
తనూజ డల్ నెస్ ను చూసిన ప్రభాకర్ లేదు తను నేను ఏమ్ బాధ పడ్డం లేదు నువ్వు మళ్లీ వస్తావు కదూ ……??
షూర్ గా వస్తాను డాడీ ఒకే నా ప్లీస్ మీరు ఇలా డల్ గా ఉంటే నేను వెళ్లలేను…… !! కాస్త స్మైల్ ఇస్తూ చెప్పండి అప్పుడు నేను హ్యాపీగా వెళ్తాను……!!
ప్రభాకర్ చిన్నగా నవ్వుతూ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా దగ్గర కనీసం వారం రోజుల అయిన వుండాలి
ఒకే డాడీ డెఫినెట్ గా ఉంటాను ఒకే నా…..!
అలా అయితే ఒకే …….. !! సరే తను రా బొంచెద్దువు మళ్లీ ఎర్లీ మార్నింగ్ బస్కే నువ్వు వెళ్లిపోవాలి …….!!
తనూజ ప్రభాకర్ ను చూసి నవ్వి సరే డాడీ వెళ్ళి ఫ్రెష్ అయి రా ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం…… !! ఈ లోపు నేను అన్ని తీసుకుని వస్తాను అని ప్లేట్స్, వాటర్ తో పాటు తను చేసిన డిన్నర్ కూడా తెచ్చి పెడుతూ ఉంటుంది…….
ప్రభాకర్ ఫ్రెష్ అయి రాగానే తనూజ ప్రభాకర్ కు డిన్నర్ వడ్డించగానే ……. !! ప్రభాకర్ గోరు ముద్దలు కలిపి ప్రేమగా కూతురు కి తినిపిస్తూ ఉంటే ……. !! తన తండ్రి పెడుతున్న ముద్దలను తింటూ తన తండ్రి కి తినిపిస్తూ కబుర్లు చెప్తూ ఉంది తనూజ…….!!
( ప్రభాకర్ సాధారణమైన మధ్యతరగతి కుటుంబం లో పుట్టిన రైతు బార్య పేరు సంగీత తనూజ పుట్టిన 3 సంవత్సరాల తరువాత సంగీత హెల్త్ ఇష్యూస్ కారణంగా చనిపోతుంది .
అప్పటి నుండి తనూజా నే ప్రభాకర్ ప్రపంచం & తనూజ కు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండు తానే అందిస్తూ కూతురు ను అల్లారు ముద్దుగా పెంచాడు.
బంధువు లు అందరు ఎన్ని సార్లు పెళ్ళి చేసుకోమని చెప్పిన కూడా వినే వాడు కాదు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ తనూజ ను ఎక్కడ కష్ట పెడుతుందో అని పెళ్లి చేసుకో లేదు .
ప్రభాకర్ పెద్దగా చదువుకోలేదు నా లాగ నా కూతురు కూడా చదువుకొకుండా వుండకూడదు అని కస్టపడి తనూజ ను చదివించాడు .
తనూజ కు ప్రభాకర్ ఏ ప్రపంచం తండ్రికి నచ్చని పని అసలు చేసేది కాదు తనూజ అడగక ముందే అన్ని తన కల్ల ముందు పెట్టేవాడు ప్రభాకర్
తనూజ కస్టపడి చదువుతూ మంచి మార్క్స్ తెచ్చుకుని బీ. టేక్ వరకు చదివి కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి జాబ్ తెచ్చుకుంది .
తనూజ కు జాబ్ వచ్చిన విషయం తెలిసి ప్రభాకర్ చాలా చాలా సంతోషించాడు ఊర్లో మొత్తం స్వీట్స్ పంచి .
తనూజ కు జాబ్ వచ్చిన విషయం చెప్తాడు తండ్రి ఆనందం చూసి తనూజ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది
తనూజ కు జాబ్ హైదరబాద్ లో రావడం వల్ల నెలకు ఒక సారి ఊరికి వచ్చి తండ్రి ను చూసి తనకు వచ్చే సాలరీ కూడా తన నీడ్స్ కి కావలసిన అమౌంట్ తీసుకుని మిగిలింది తన,తండ్రి కి ఇస్తు వుంటుది
ఇప్పుడు కూడా అలాగే వచ్చింది తనూజ వచ్చినప్పుడు ప్రభాకర్ ఎంత సంతోషిస్తాడు వెళ్ళేటపుడు అంత బాధ పడతాడు)
ఇద్దరు బోంచేసి కాసేపు కూర్చుని మాట్లాడుకుని తర్వాత ఇద్దరు మార్నింగ్ లేవాలి అని ఎర్లీ గా పడుకుంటారు …….. !! మార్నింగ్ 4 గంటలకు లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసి ప్రభాకర్ కోసం టిఫెన్ & లంచ్ కూడా ప్రిపేర్ చేస్తుంది తనూజ…. !!
అవి అయ్యాక రెండు కాఫీ కప్పులతో ప్రభాకర్ దగ్గరికి వచ్చి ఒకటి ప్రభాకర్ కి ఇచ్చి మరోటి తను తీసుకుని నవ్వుతూ……. !! ప్రభాకర్ తో మాటలు చెప్తూ ఉంటే అవి ఉంటూ తనూ ఇచ్చిన కాఫీ తాగుతూ వున్నాడు ప్రభాకర్…. !!
ప్రభాకర్ కాఫీ తాగుతూ నువ్వు అచ్చం మీ అమ్మ లాగే పెడతావు తనూ నిన్ను ఇలా చూస్తూ వుంటే మీ అమ్మ ను చూసినట్టే ఉంది తను 😢 నిన్ను ఇలా చూసుంటే మీ అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో
డాడీ ప్లీజ్ మీరు ఇలా బాధ పడకండి నేను చూడలేను 😞😞 నాకు అమ్మ లేకపోతే ఏంటి అమ్మ ప్రేమను మరిపించే మీరున్నారు కదా అది చాలు నాకు
ప్రభాకర్ కన్నీళ్లు తుడుచుకుని అల ఏమ్ లేదు తను నేను ఇంకెప్పుడు బాధ పడను సరేనా వెళ్లి స్నానం చే బస్ కు టైమ్ అవుతోంది అని చెప్పగానే తనూ కాఫీ కప్స్ తీసుకుని అవి క్లీన్ చేసి స్నానం చేయడానికి వెళ్తుంది
కాసేపటి తర్వాత తనూజ స్నానం చేసి రెడీ అయి తన లగేజ్ తీసుకుని హల్ లో కి వస్తుంది …….ప్రభాకర్ టిఫెన్ బాక్స్ లో పెట్టేసి తనూజ కు ఇస్తు మర్చిపోకుండా తిను అని చెప్పి వాటర్ బాటిల్ కూడా పెట్టేస్తాడు తర్వాత ప్రభాకర్ , తనూజ ఇంటికి లాక్ వేసి బైక్ లో బస్టాండ్ కు స్టార్ట్ అయ్యారు…..
15 నిమిషాలు తర్వాత బస్ రాగానే ప్రభాకర్ లగేజ్ బస్ లో పెట్టేసి కూతురు కి జాగ్రత్తలు చెప్తూ వున్నాడు…… ఈ లోగా కండక్టర్ బస్ స్టార్ట్ అవుతుంది అని అరవడం తో బస్ దిగి తనూ ఉన్న వైపు చూడగా విండో సైడ్ నుండి తనూజ ప్రభాకర్ కు భై చెప్తుంది …… డ్రైవర్ బస్ స్టార్ట్ చేయగానే తనూజ కనుమరుగు అయ్యే వరకు భై చెప్పి తాను వెళ్ళిపోగానే ప్రభాకర్ కన్నీళ్లను తుడుచుకుని బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ……
తనూజ సీట్ కు ఆనుకుని కళ్ళు మూసుకుని కొద్ది రోజుల డాడీ ఆ తరువాత నిన్ను తీసుకుని హైదరాబాద్ కి వెళ్ళి అక్కడే ఏదైనా ఫ్లాట్ తీసుకుని మిమ్మల్ని మహా రాజు లా చూసుకుంటా అని అనుకుంటూ వుంటుంది…….
ప్రభాకర్ ఇంటికి వెళ్లి తనూజ కు కాల్ చేస్తాడు
ప్రభాకర్ నుండి కాల్ రావడం తో తనూజ కన్నీళ్లు తుడుచుకుని నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేస్తుంది…..
హెలో తనూ
చెప్పు డాడీ ఇంటికి వెళ్ళిపోయావా
ఇప్పుడే వచ్చాను తనూ నీకు సీట్ కంఫర్ట్ గానే ఉంది కదా
హా కంఫర్ట్ గానే ఉంది డాడీ నువ్వు టిఫెన్ చేసి టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకు
అలాగే తనూ వేసుకుంటా
అన్నట్టు డాడీ నేను లంచ్ కు కూడా చేశాను పొలం నుండి రాగానే తిను వేడి చేసుకుని తిను
అలాగే తను నువ్వు కూడా టైం కి తిను అలాగే హాస్టల్ కి వెళ్ళగానే కాల్ చెయ్
అలాగే డాడీ
సరే తను జాగ్రత్త
సరే డాడీ భై వెళ్ళాక కాల్ చేస్త
సరే తను భై అని చెప్పి ప్రభాకర్ కూడా కాల్ కట్ చేస్తాడు…… తనూజ కూడా కాల్ కట్ చేసి హెడ్ పోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ వుంది…… బస్ హైదరబాద్ లో ఆగగానే తనూజ తన లగేజ్ తీసుకుని బస్ దిగి ఆటో లో హాస్టల్ కి వస్తుంది ……..
రిసెప్షన్ లో హాస్టల్ కు వచ్చినట్టు సైన్ చేసి
తన లగేజ్ తీసుకుని తన రూమ్ కి వెళ్తుంది…….తనూజ రూమ్ లో ముగ్గురు వుంటారు గీతిక, తనూజ & ప్రీతి . గీతిక & తనూజ బెస్ట్ ఫ్రెండ్స్ …… తనూజ రూమ్ లోకి రాగానే తన కోసమే వెయిట్ చేస్తున్న గీతిక తనూజ ను గట్టిగా హగ్ చేసుకుంటుంది& తనూ కూడా కూడా గీతిక ను హగ్ చేసుకుంది……
ఎలా ఉన్నావ్ తనూ, అంకుల్ ఎలా వున్నారు అని అడుగుతూ తనూ చేతిలోని లగేజ్ తీసుకుంటూ అడుగుతుంది గీతిక…… బావున్నాడు గితూ అంటి, అంకుల్ ఎలా వున్నారు అని అడగగా వాళ్ళు కూడా బావున్నారు సరే ఫ్రెష్ అయి రా తను ఆకలిగా ఉంది ……….
హ్మ్మ్ సరే రీచ్ అయినట్టు డాడీ కి చెప్పి వెళ్తా అని ప్రభాకర్ కు కాల్ చేసి రీచ్ అయ్యానని చెప్పు కాసేపు మాట్లాడి తర్వాత గీతు కు ఇస్తుంది ……. తర్వాత ఇద్దరు రెడీ అయి మెస్ కు వెళ్లి డిన్నర్ చేసి కాసేపు పిచ్చా పాటీ కబుర్లు చెప్పుకుని నిద్రలోకి జారుకుంటారు…..
నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్ గా రెడీ అయి బ్రేక్ ఫాస్ట్ చేసి ఎవరి అఫీస్ కు వాళ్ళు వెళ్ళిపోతారు…… తనూ, గీతు ఇద్దరు సాఫ్టువేర్ ఇంజనీర్స్ కానీ కంపెనీస్ వేరే ఇక్కడికి వచ్చాకే ఇద్దరికీ పరిచయం & కొద్ది రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు……. రోజు మార్నింగ్ అఫీస్ కు వెళ్ళడం ఈవెనింగ్ రావడం వచ్చాక కాసేపు మాట్లాడుకుని ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ వుండే వాళ్ళు…….
తనూ ఎప్పుడు బయటకు ఒంటరిగా వెళ్ళేది కాదు ఎప్పుడు గీతు తోడుగా వెళ్ళేది ……తనూ చాలా అమాయకురాలు ఎవరిని అయిన త్వరగా నమ్మేస్తుంది & చిన్న విషయాలకు కూడా చాలా బాధ పడుతుంది…….
అందుకే తనను జాగ్రత్తగా చూసుకోమని గీతు కి ప్రభాకర్ ఎప్పుడు చెప్తూ వుండే వాడు అందుకే గీతు తనూ ను ఎప్పుడు ఒంటరిగా వదిలి వెళ్లదు ……
షాపింగ్ మాల్స్ కు వెళ్ళిన, పార్లర్, రెస్టారెంట్ & మూవీ ఏదైనా సరే ఇద్దరు కలిసి వెళ్లే వాళ్ళు …… అందరు వీళ్ళ మధ్య వున్న ఫ్రెండ్ షిప్ చూసి చాలా ఆశ్చర్య పడేవాల్లు ఇంత వరకు తనూ, గీతిక ఎప్పుడు గొడవ కూడా పడలేదు …… తనూ ను గీతిక చిన్న పిల్ల ను ట్రీట్ చేసినట్టు చాలా బాగా చూసుకునేది ……. అందుకే తనూ కు ప్రభాకర్ తర్వాత గీతిక అంటే నే ఇష్టం వాళ్ళ ఇద్దరు అంటే తనూ కు ప్రాణం …….
రోజులు సరదాగా గడుస్తున్నాయి ఒక రోజు గీతిక వాళ్ళ అమ్మ కాల్ చేసి మీ పెద్దమ్మ కూతురు కు పెళ్లి కుదిరింది…….. లీవ్ పెట్టీ రమ్మని కాల్ చేసి చెప్తుంది గీతిక తనూ ను కూడా పెళ్లికి రమ్మని పిలుస్తుంది కానీ ప్రభాకర్ కోసం తనూ ముందే చాలా లీవ్స్ పెట్టడం వల్ల ఇప్పుడు తనూ కు లీవ్ దొరకదు ….. గీతిక తనూ కోసం పెళ్లి కి వెళ్ళకూడదు అని అనుకుంటుంది కానీ తనూ గీతిక ను బలవంతంగా పంపిస్తుంది ………
గీతిక వన్ వీక్ లీవ్ పెట్టీ వాళ్ళ ఊరికి వెళ్తుంది ……. గీతిక లేక తనూ కు చాలా బోర్ గా అనిపిస్తుంది…….. ఆ లోన్లీనెస్ పోగొట్టు కోవడానికి అందుకు తనూ ఎప్పుడు వర్క్ చేస్తూ బిజీగా వుండేది అపుడపుడు గీతిక తనూ కు కాల్ చేసి మాట్లాడుతూ వుండేది …… తనూ కూడా ప్రభాకర్ & గీతిక తో మాట్లాడుతూ తాను ఒంటరి అనే ఫీలింగ్ తనకు లేకుండా చూసుకుంటూ వుండేది …….
ఆ రోజు వీకెండ్ అవ్వడం తో తను లేట్ గా లేచి ఫ్రెష్ అయి కింద మెస్ కు వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేసి వస్తుంది ……. కాసేపు గీతిక, ప్రభాకర్ కు కాల్ చేసి మాట్లాడి కాస్త వర్క్ వుంటే చేసుకుంటూ వుంటుంది …….తన వర్క్ కంప్లీట్ అయ్యేసరికి 2 అవుతుంది వర్క్ అయ్యాక ఫ్రెష్ అయి వచ్చి ఏమ్ తినాలి అని అనిపించక పడుకుంటుంది …….
ఈవెనింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకుని లాబ్టాబ్ లో వెబ్ సిరీస్ చూస్తూ టైమ్ పాస్ చేస్తూ వుంటుంది….. అపుడే తన దగ్గరకు తన రూమ్ మెట్ ప్రీతి వచ్చి తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ కు రమ్మని ఇన్వైట్ చేస్తుంది…….తనూ కు వెళ్ళాలి అని లేకపోయినా ప్రీతి చాలా సేపు రిక్వెస్ట్ చేస్తూ వుండడం వల్ల ఇక కాదనలేక రెడీ అయి పార్టీ కు వెళ్తుంది …….
పాపం తనూ కు తెలియదు కదా ఈ బర్త్డే పార్టీ వల్లే తన లైఫ్ మలుపు తిరుగుతుంది అని……!!తెలిస్తే నిజంగా వెళ్ళేది కాదు అనుకుంటా ఈ బర్త్డే పార్టీ లో తనకు పరిచయం అయ్యే వ్యక్తి వల్ల సర్వం కోల్పోతుంది అని తెలుసుకోలేక పార్టీ కు వెళ్ళింది …….!!