తనను మిడ్ నైట్ సేఫ్‌గా ఇంటికి తీసుకువచ్చిన అర్జున్ గురించే శ్రీ ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది…….!!
నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీ ఎప్పటిలాగే కాలేజీకి వెళ్తుండగా రోడ్డు పక్కన నుంచున్న అర్జున్‌ను చూసి……….. !! శ్రీ మనసులో తెలియని ఒక స్పార్క్ , తన మొహం లో చిన్న చిరునవ్వు మెరుస్తుంది………. !! కానీ ఆ ఫీలింగ్‌ని బయటకు ఆ ఫీలింగ్ కనిపించనివ్వకుండా సైలెంట్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ అర్జున్ ను క్రాస్ చేసుకుని వెళ్లిపోతుంది ………. !! బట్ అర్జున్ మాత్రం బైక్ మీద నుండి శ్రీ కారును ఫాలో చేస్తూ సడెన్ గా శ్రీ కారుకు అడ్డంగా వెళ్ళి నిలబడతాడు………. !? అర్జున్ రాష్ బిహేవియర్‌కి కోపం వచ్చిన శ్రీ ఫాస్ట్ గా బ్రేక్ వేసి కిందకు దిగి వచ్చి కోపంగా చూస్తూ……… !! చూడండి మిస్టర్ అర్జున్ భట్టాచార్య లాస్ట్ నైట్ మీరు నన్ను సేఫ్ గా మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి హెల్ప్ చేసినందుకు రియల్లీ థ్యాంక్స్………!! బట్ దానర్థం ఇలా నా వెనకాల రావడం, సడెన్‌గా కారుకు అడ్డంగా నిలబడటం చేయమని కాదు……….. !! సీరియస్లీ ఇవన్నీ నాకు అస్సలు నచ్చవు ప్లీజ్, లీవ్ మై ఎలోన్ ఇంకెప్పుడు ఇలా నాకు అడ్డు రాకండి అంటూ సీరియస్‌గా చెప్తుంది శ్రీ……… !!
అర్జున్ తన పాకెట్స్ లో రెండు చేతులు పెట్టుకుని కూల్ గా నవ్వుతూ ఒహో బుజ్జీ రిలాక్స్ అవ్వు ప్లీజ్ ……….. !! ఏంటి నాన్-స్టాప్‌గా తిడుతున్నావు ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా నిజం చెప్పు……….?? నిన్ను ఆ టైమ్ ను సేఫ్ గా తీసుకుని వెళ్ళడం నా రెస్పాన్సిబిలిటీ………….. !! నీ ప్లేస్‌లో వేరే ఏ అమ్మాయి ఉన్నా కూడా నేను డెఫినెట్‌గా హెల్ప్ చేసేవాడిని…………. !! కానీ నా పిల్ల కదా అని కొంచెం ఎక్స్‌ట్రా కేర్ తీసుకున్నాను అంతే తప్ప ……….. !! నీకు నేను హెల్ప్ చేసాను నువ్వు కూడా నన్ను లవ్ చేయాలని డిమాండ్ చేసే చీప్ లేదా నారో మైండెడ్ థింకింగ్ నాకు లేదు బుజ్జెమ్మా…………. !! నిన్న నీ కార్ ను మెకానిక్ గ్యారేజీకి తీసుకెళ్లడానికి నేనే వెళ్లాను కదా ఆ ప్రాసెస్ లో నీ కారు కార్పెట్ మీద నీ కాలి పట్టీ దొరికింది………. !! దాన్నే నీకు హ్యాండోవర్ చేయడానికి వచ్చాను కానీ వేరే ఉద్దేశం తో కాదు డోంట్ మిస్ అండర్‌స్టాండ్ మీ……… !! కావాలంటే ఒకసారి నీ కాలు చూసుకో నేను చెప్పింది అబద్దం కాదని నీకే అర్థం అవుతుంది……… !!