శ్రీ, బిపిన్ ఇద్దరూ చూడ్డానికి ఎంత బాగున్నారో
నిజంగా మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ లా ఉన్నారు ……… !! వీళ్లిద్దరి పెయిర్ చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అంటూ ఇంట్లో పెద్దవాళ్లు మాట్లాడుకోవడం శ్రీ చెవిన పడింది……….. !! ఆ మాటలు వినగానే శ్రీ గుండెల్లో ఒక్కసారిగా ఏదో తెలియని బాధ మొదలైంది………… !! వాళ్లు మాట్లాడుకున్నవి మాటలే అయినా అవి శ్రీ మనసులో మాత్రం చాలా వేదనను రేపాయి……….. !! వాళ్లు అలా బిపిన్ గురించి మాట్లాడినప్పుడల్లా శ్రీ మనసులో అర్జున్ రూపమే మెదులుతుంది……….. !! అంతవరకు పెళ్లి లో ఎంతో సందడిగా, చలాకీగా హుషారుగా తిరిగిన శ్రీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది………. !! మ్యారేజ్ రిచువల్స్ అన్నీ అనుకున్నట్లే ఎలాంటి ఆటంకాలు లేకుండా పుస్ఫుల్ గా పూర్తవుతాయి……….. !! కొత్త పెళ్లికూతురిని ఇంటికి తీసుకొచ్చే సాంప్రదాయ శాస్త్రం కూడా పూర్తవుతుంది ……….. !! బిపిన్& అతని ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా ఇంకొన్ని రోజులు అక్కడే ఉండమని బోపన్నగారు చెప్పడం తో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు………. !!
నెక్స్ట్ డే మార్నింగ్ హాల్‌లో అందరూ కూర్చుని కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుతూ ఉండగా…………. !! బోపన్నగారు శ్రీ, బిపిన్‌ల పెళ్లి టాపిక్ మాట్లాడుతూ అబ్బాయి బిపిన్ చాలా మంచి వాడు వెరీ డిసెంట్ అండ్ ప్రొఫెషనల్………… !! బిపిన్ టాలెంట్‌కి యుఎస్, యుకే వెళ్లే ఆఫర్స్ వచ్చినా ఐ బోర్న్ ఇన్ ఇండియా ఐ షుడ్ సర్వ్ మై కంట్రీ అని ఇక్కడే ఉండిపోయాడు………… !! ఇక ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా చాలా రీచ్ అండ్ రెస్పెక్టబుల్………… !! బిపిన్ పేరెంట్స్ మన అమ్మూని సొంత కూతురిలా చూసుకుంటారు……….. !! మన స్టేటస్‌కి, ఆస్తిపాస్తులకి ఇది పర్ఫెక్ట్ సరిపోయే సంబంధం……….. !! మన అమ్మూ వాళ్ల ఇంట్లో ప్రిన్సెస్ లా ఉంటుంది సో నాకు ఈ మ్యాచ్ బాగా నచ్చింది…………!! మీ అందరికీ కూడా ఓకే అంటే అఫీషియల్‌గా అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు రమ్మని చెప్దాం…………. !!
అది విన్న ఇంట్లో పెద్దలందరూ ఒక్కసారిగా సంతోషంతో మాకు కూడా ఇష్టమే అని చెప్పగానే బోపన్న గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు………. !!