New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రౌడీ మామ – 3

రౌడీ మామ – 3

నేను ఆ ఇంట్లో ఉండడానికి వాళ్లతో ఉండడానికి అర్హురాన్ని కాదు అంటమ్మా నేను మావయ్య ని అడిగాను మరి అలాంటప్పుడు నా మెడలో ఈ తాళి ఎందుకు అని దానికి కూడా మావయ్య ఏ సమాధానం చెప్పలేదు అంది వైదేహి గుక్క పెట్టి ఏడుస్తూ 
కూతుర్ని హత్తుకొని అలా ఉండిపోయింది వసుంధర  
సరిగ్గా అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయ్యారు తరుణ్ 
హాల్లోని భార్య కూతురు పొజిషన్ చూసిన ఆయనకి అనుమానం మొదలైంది 
వైదేహి ఎందుకు ఏడుస్తున్నావ్ అడిగాడు తరుణ్ కూతురి వైపు చూస్తూ 
తండ్రి మాట వినిపించేసరికి ఒక్కసారిగా భయంతో తల్లి నుంచి దూరం జరిగింది వైదేహి 
ఏంటి ఎందుకు ఏడుస్తున్నావ్ అడిగాడు తరుణ్ సీరియస్గా 
నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళావా అడిగాడు. తరుణ్ ఎర్రబడ్డ కళ్ళతో 
ఆ మాటకి వైదేహి భయంతో వనికి పోతూ అది డాడీ మరి అది అంటూ భయంతో నీళ్లు నములుతూ ఉంటే 
చెప్పు అడిగాడు తరుణ్ ఎర్రబడ్డ కళ్ళతో 
అవును అంది వైదేహి తల దించుకొని 
ఆ మాట కి ఒక్క సారిగా కోపంగా కూతురు దగ్గరికి వచ్చి నేను నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు వాడి ఇంటి గడప తొక్కడానికి నీకు ఎంత ధైర్యం అడిగాడు తరుణ్ కోపంగా 
వసుంధర భయంగా భర్త వైపు చూస్తూ ఏవండీ దాన్ని ఏం అనకండి నేనే పంపించాను అంది వసుంధర కూతుర్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో 
ఆ మాట కి ఆయన మరింత కోపంగా భార్య వైపు చూస్తూ ఏంటి నువ్వు పంపించావా మర్చిపోయావా నీ తమ్ముడు చేసిన మర్యాదలు ఘనకార్యాలు పచ్చని పందిట్లో నీ కూతురి మెడలో అమానుషంగా తాళి కట్టి కనీసం తనని తన ఇంటికి కూడా తీసుకెళ్లకుండా ఎక్కడి వదిలేశాడు అలాంటి వాడి ఇంటికి నువ్వు నీ కూతుర్ని పంపించావా అడిగాడు తరుణ్ కోపంగా 
అది కాదండి అంటూ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నా వసుంధర వైపు చెయ్యి చూపించి ఆపుతూ చాలు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో వసు లేదంటే నిన్ను ఎక్కడ కొడతాను అని నాకు భయంగా ఉంది దయచేసి వెళ్ళిపో అన్నాడు తరుణ్ కోపంగా 
బయటికి నువ్వు కూడా వెళ్ళు అంటూ చెప్పడంతో అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది వైదేహి 
వసుంధర రూమ్ లోకి వెళ్లిపోయి మంచం మీద కూర్చుని ఏడుస్తూ ఉంది 
ఒక అరగంటకి భార్య దగ్గరికి వెళ్ళాడు తరుణ్ 
భర్త రావటంతో తన కన్నీళ్లు తుడుచుకుంటూ భర్త వైపు చూసింది 
ఏంటి నా మీద కోపంగా ఉందా అడిగాడు తరుణ్  
లేదండి వైదేహి గురించి ఆలోచిస్తూ ఉంటే భయంగా ఉంది దాని జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది అంది వసుంధర 
ఏం కాదులే వసు నేను చూసుకుంటాను అన్నాడు తరుణ్ భార్యని ఓదారుస్తూ 
ఏమో అమ్మా నాన్న కూడా ఈ విషయంలో మౌనంగా ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు కనీసం వాళ్ళైనా వాడికి బుద్దొచ్చేలా చేయాలి కదా ఇది వాళ్లకి మనవరాలు మాత్రమే కాదు వాళ్ళ ఇంటికి కోడలు కదా అన్నారు వసుంధర భర్తని పట్టుకొని ఏడుస్తూ 
సారీ వాసు నేను కూడా కోపంలో మీ మీద అరెస్ట్ చేశాను కానీ నాకు మీ ఇద్దరి గురించే భయంగా ఉంటుంది వాడు ఏదైనా అంటే నువ్వు తీసుకోలేవు చిట్టి తల్లి తీసుకోలేదు అందుకే మీ ఇద్దరి మీద అరిచేసాను అన్నాడు తరుణ్ 
లేదండి అందులో మాకు మీ మీద మాకు ఉన్న ప్రేమే కనిపించింది తప్ప కోపం ఎక్కడ కనిపించలేదు అంది వసుంధర 
లేదు నేనే ఒకసారి వెళ్లి విరాట్ తో మాట్లాడాలి అన్నాడు తరుణ్ ఏదో నిర్ణయానికి వచ్చినట్టు 
వద్దండి వాడు మిమ్మల్ని ఏమైనా అంటే నేను తట్టుకోలేను అంది వసుంధర భయంగా 
తప్పదు వసు ఎంతైనా మనం ఆడపిల్ల వాళ్ళం మనం ఒక మెట్టు తగ్గిన తప్పులేదు అయినా నేను వెళ్లి అడుగుతుంది నా బామ్మర్దినే కదా బయట వాడిని కాదు కదా వెళ్లి ఒకసారి మాట్లాడుతాను అన్నాడు తరుణ్ 
నేను కూడా మీతో పాటు వస్తాను తరుణ్ అంది వసుంధర 
లేదు బస్సు నువ్వు రావద్దు మళ్లీ వాడు నన్ను ఏమైనా అన్నా నేను పెద్దగా పట్టించుకోను నీ కళ్ళముందు వాడు నన్ను ఏదైనా అంటే ఆ తర్వాత నువ్వు ఎంత బాధ పడతావో నేను ఆలోచించగలను అన్నాడు తరుణ్ 
లేదండి మీ అక్కలే వెళ్తే వాడు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది నేను వస్తే కనీసం నా మొహం చూసి అయినా వాడు తగ్గుతాడు అన్న చిన్న ఆశ అంది వసుంధర 
సరే వెళ్దాం అన్నాడు తరుణ్ 
ఎప్పుడు వెళ్దాం ఇప్పుడే వెళ్దామా అడిగింది వసుంధర 
లేదు ఆల్రెడీ వైదేహి అక్కడికి వెళ్లడం వల్ల ఇప్పుడు వాడు ముందే కోపంగా ఉంటాడు ఈ టైం లో మనం వెళ్లడం కరెక్ట్ కాదు చూసుకుని రేపు ఎల్లుండలో వెళ్దాం సరేనా అన్నాడు తరుణ్ 
అలాగే అంది వసుంధర 
సరే మరి ఇంకా ఈ కన్నీళ్లు ఆపు అంటూ భార్య కన్నీళ్లు తుడుస్తూ తనని ఓదారుస్తూ ఉన్నాడు తరుణ్ 
ఇక్కడ రూమ్ లోకి వచ్చిన వైదేహి డోర్ దగ్గరికి వేసేసుకొని మంచం మీద వాలిపోయి తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది 
ఎందుకు మావయ్య ఎందుకు నీకు నేను నచ్చటం లేదు అంత నచ్చనప్పుడు నేను పిలవగానే ఎందుకు వచ్చావు? ఎందుకు నా మెడలో మూడు ముళ్ళు వేసావ్ నా పెళ్లి ఆపాలి అనుకుంటే నువ్వు ఇంకొక రకంగా అయినా ఆపి ఉండొచ్చు అది కాదు అని నన్ను పెళ్లి చేసుకొని ఆ పెళ్ళిలో నుంచి నన్ను కాపాడే కానీ ఎందుకు నన్ను ఇక్కడే వదిలేసావు మావయ్య 
మేము చేసిన తప్పేంటి అనుకుంటూ బాధపడుతూ ఫోన్లోనే విరాట్ ఫొటోస్ చూస్తూ ఏడుస్తూ ఉంది 
——–continues……………..
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ