లంచ్ ఫినిష్ చేసిన ఆకాష్ హాల్ లో కూర్చుని తన మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు ……….. !! లంచ్ కోసం ఇంటికి వచ్చిన శ్రీరామ్ లంచ్ చేస్తూ ఇంట్లో కాళిగా కూర్చుని తింటున్న కొడుకు వైపు అసహనంగా చూస్తూ ……… !! వీడు అసలేం చేయాలి అనుకుంటున్నాడు ఇండియా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ………. !! అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పడమే కానీ ఎది చేయకుండా ఇలా ఇంట్లోనే టైమ్ పాస్ చేస్తున్నాడు………. !!! అని కోపంగా హ్యాండ్ వాష్ చేసుకుని పైకి లేస్తాడు …………. !!