విలన్ హస్బెండ్{2} -50

Sravani Naramala

Author

రితిక ఎటు కదలకుండా ఆద్య, మాన్య చేతులు పట్టుకోగానే డాక్టర్ తన బ్యాగ్ నుండి ఇంజెక్షన్ తీసి రితిక కు ఇంజెక్ట్ చేయగానే రితిక మత్తుగా ఆద్య వడిలో పడిపోతుంది…… !! ఆద్య, మాన్య కంగారుగా డాక్టర్ వైపు చూడ్డం తో టెన్షన్ అవ్వకండి మేడం అనస్థీషియా ఇచ్చాను ……. !! ఇంకో 12 అవర్స్ దాకా పైకి లేవదు అనగానే ఆద్య రితిక గురించి ఆలోచనలో పడుతుంది…… !! మాన్య డాక్టర్ కి అమౌంట్ పే చేస్తూ కాల్ చేయగానే వెంటనే రియాక్ట్ అయి ఇంత దూరం వచ్చారు థాంక్ యూ సో మచ్ డాక్టర్…… !!

ఇట్స్ మై డ్యూటీ మేడం మీరు ఆద్య మేడం నాకు చాలా హెల్ప్ చేసారు అలాంటి మీరు కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వకుండా ఎలా ఉంటాను…… !! నాకు కూడా గ్రాటిట్యూడ్ చూపించుకునే అవకాశం వచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ రేపు మార్నింగ్ 10 గంటల వరకూ తనకు స్పృహ రాదు…… !! తను కాన్షియస్ లోకి వచ్చాక కాల్ చేయండి వచ్చి చెక్ చేసి తన కండిషన్ చెప్తాను అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు……. !!