విలన్ హస్బెండ్{2} -54

Sravani Naramala

Author

జై కాసేపటికి ఆద్య నుండి జరిగి పైకి లేచి నుంచుంటాడు ఆద్య కూడా పైకి లేచి నుంచోగానే సారి అంటూ జై అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా……. !! ఇందాకే కదా చెప్పాను నువ్వు ఇలా బాధ పడుతూ ఉంటే అక్కడ అత్తమ్మ కూడా బాధ పడతారు అని నువ్వు బాధ పడి అత్తమ్మ ను బాధ పెట్టకుండా డిన్నర్ చెయ్ అంటూ …….. !! తను జై కోసం తీసుకుని వచ్చిన ఫుడ్ ప్లేట్ తన చేతికి అందిస్తూ డోంట్ వర్రీ ఫుడ్ ప్రిపేర్ చేసింది నేను కాదు…… !!  సో నువ్వు ధైర్యంగా తినచ్చు అనగానే జై కి అంత పెయిన్ లోనూ ఆద్య మాటకి తన పెదవులు నవ్వుతూ విచ్చుకుంటాయి ……. !!

హమ్మయ్య నవ్వేశావా నీ సాడ్ ఫేస్ చూడలేక పోయాను మొత్తానికి స్మైల్ ఇచ్చావ్ డిన్నర్ తినేసి పడుకో…….. !! గుడ్ నైట్ అంటూ రూమ్ బయటకు వెళ్ళబోతున్న ఆద్య కి మరో సారి థాంక్స్ పిలిచి మరీ చెప్తాడు జై…… !! నీ నుండి ఇవాళ ఇన్ని థాంక్స్ లు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నెవెర్ బీఫోర్ ఎవర్ ఆఫర్ అనాలేమో నేను…..    !!  అని నవ్వుతూ ఆద్య కూడా డిన్నర్ చేయడానికి వెళ్ళడం చూసిన జై కూడా చిన్నగా నవ్వి……. !! ఆధ్య వెళ్ళిన వైపే చూస్తూ ఇవ్వాళ కొత్తగా కనిపించావ్ అంటూ డిన్నర్ చేస్తూ ఉంటాడు…… !!