నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా నిద్రలేచిన శాన్వి తన పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న శౌర్య వైపు చూస్తుంది……….. !! ఎప్పుడూ మొహాన్ని సీరియస్ గా గంటు పెట్టుకుని చిన్న చిన్న విషయాలకే తనపై అరుస్తూ ఉండే శౌర్య ………… !! ఇప్పుడు ఎలాంటి చిరాకు లేకుండా ప్రశాంతంగా నిద్రపోతుండటంతో శాన్వి కు తెలియకుండానే పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరుతుంది……….. !! ఎప్పుడూ ఇలాగే ఇంతే ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటాడు ఈయన కానీ ఎప్పుడూ గుర్రుమంటూ ఉంటాడు………… !! ఇప్పుడు చూడు ఎంత గుడ్ బాయ్ లా పడుకున్నాడో అయినా ఈయనకు కోపం ఎందుకు అంత త్వరగా వస్తుందో అర్థం కాదు………. !! అని మనసులో అనుకుంటూ మరోసారి శౌర్య ముఖాన్ని చూసి మెల్లగా బెడ్ మీద నుంచి దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది………. !!