New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రణయం – 9
ప్రణయం Premium 5 min read

ప్రణయం – 9

 

ఎపిసోడ్ 9 — తన కూతురెవరు?

 

రాత్రి గడియారం పన్నెండు కొట్టింది.

నరేంద్ర చేతిలో ఉన్న లేఖను మరోసారి చదివాడు. ప్రణిత పుట్టుక గురించి దాచిన నిజం ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచన అతని మనసును కలవరపెడుతోంది.

నాన్నా… నాకు ఒక్క విషయం చెప్పండి. ప్రణిత నా జీవితంలోకి రాకముందే మా ఇద్దరి కుటుంబాల మధ్య ఇంత పెద్ద రహస్యం ఉందా?

రాఘవేంద్ర తల వంచుకున్నాడు.

ఉంది నరేంద్రా. కానీ ఆ రహస్యం గురించి ఇప్పుడు నేను చెప్పలేను.

ఎందుకు చెప్పలేరు? ప్రణిత జీవితం గురించి మాట్లాడుతున్నాం. తనకే తెలియని నిజాన్ని ఇంకెంతకాలం దాచిపెడతారు?

కొన్ని నిజాలు తెలిస్తే మనుషులు బాధపడతారు. మరికొన్ని నిజాలు తెలిస్తే తమ జీవితాన్నే ద్వేషించుకుంటారు.

నరేంద్ర ఆవేశంగా ముందుకొచ్చాడు.

అంటే ప్రణిత తన తండ్రి కూతురు కాదా?

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue