New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కడలి

5 stories Ongoing Love Suspense Crime

సన్నటి నీటి జల్లు కిటికీ కడ్డీల మీద పడి మొహానికి చిరు తుంపర్లు పడుతుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా .ఆమెని దాటి వెనక్కి పోతున్న చెట్లు, పుట్టలు, పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు అన్నీ చూస్తూ చిన్నగా నవ్వుకుంటోంది తను.ఎంత చిత్రమో కదా ఏ కదలిక లేని వాటిని కూడా పరిగెత్తించే శక్తి మన మనసుకే ఉంది కాబోలు...ఏంటో బయల్దేరినప్పుడు ఆమెలో ఉన్న  భయం, కంగారు ఇప్పుడెందుకో ఒక రకమైన అలజడి సృష్టిస్తోంది.జీవితంలో ఏదో సాధించాలన్న తపన ఆమెది.వాటికి కళ్లెం వేసి మెడలో పసుపు తాడుతో ముళ్లేసి ఆమెనో బలి పశువును చేసి ట్రైన్ ఎక్కించారు ఆమె ఇంట్లోని పెద్దవాళ్ళు.పెళ్లి చూపుల్లో అన్నీ వివరంగా చెప్దామనుకుంటే అసలు ఆ తంతే జరిగినవ్వలేదు…

Browse Stories

కడలి

కడలి – 1

సన్నటి నీటి జల్లు కిటికీ కడ్డీల మీద పడి మొహానికి చిరు తుంపర్లు పడుతుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా .   ఆమెని దాటి వెనక్కి పోతున్న చెట్లు, పుట్టలు, పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు అన్నీ చూస్తూ చిన్నగా నవ్వుకుంటోంది తను.   ఎంత చిత్రమో కదా ఏ కదలిక లేని వాటిని కూడా పరిగెత్తించే శక్తి మన మనసుకే ఉంది కాబోలు…   ఏంటో బయల్దేరినప్పుడు ఆమెలో ఉన్న  భయం, కంగారు ఇప్పుడెందుకో […]

7 min 19 views
కడలి

కడలి – 2

ఇప్పటివరకు లేదు కాని ఇప్పుడెందుకో ఆమెకో అనుమానం వచ్చి బుర్రని ఒకటేమైన తొలిచేస్తోంది.   కాని ఎలా దాన్ని నివృత్తి చేసుకోవాలో అసలు అర్దం అవ్వడం లేదు కాని తేల్చుకోవాలి. ఎలా ఎలా అని తెగ ఆలోచిస్తున్న ఆమె బుర్రని  మనసొచ్చి పలకరించింది.   ఏంటో తెగ ఆలోచిస్తున్నావ్?    ఆలోచనైతే ఉంది కాని ఎలా అడగాలో తెలియడం లేదని చెప్పింది థట్ బుర్ర.   ఒక వేళ తెలిసినా అడిగే ధైర్యం ఉందనుకున్నావా నీకని వెక్కిరిస్తోంది […]

3 min 13 views
కడలి

కడలి – 3

అది చూడగానే ఎందుకో మనసంతా మెలిపెట్టినట్టు అనిపించింది ఆమెకు . ఏమరపాటుగా ఎదురుగా ఉన్న అనిరుధ్ ని చూసింది . ఎప్పటినుండి చూస్తున్నాడో తెలియదు కాని ఆమెనే గమనిస్తున్నాడు.   చూపుదించి అతడి ప్లేట్ వంక చూసి తినేసినట్టున్నారు అనుకున్న వంశీ వెళ్దామా అని అడిగింది ఇక అక్కడి వాతావరణం ఆశ్వాదించే మూడ్ లేక.   మారు మాట్లాడలేదు అతడు . చైర్ నుండి లేచి ముందుకు నడుస్తున్న అతడ్ని అనుసరిస్తూన్న వంశిక వెనకున్న హోర్డింగ్ ఓసారి […]

4 min 17 views
కడలి

కడలి – 4

చూస్తూ చూస్తూ రాత్రి కరిగి తెల్లారుతోంది. రాత్రి అనగా వెళ్లిన మనిషి ఇంతవరకు జాడ లేరు. ఒళ్ళంతా కంగారుతో చల్లపడిపోతోంది ఆమెకు.వంశిక దగ్గర ఫోన్ లేక డ్రెస్ మార్చుకొని కిందున్న రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి కాల్ కోసం ఫోన్ అడిగింది.   ఎగాదిగా చూసిన రిసెప్షనిస్ట్ ల్యాండ్ లైన్ ఆమె ముందుకి నెట్టింది.   అతడి నెంబర్ ఆమె దగ్గర లేక  గుర్తున్న ఇంకో నెంబర్ కి కాల్ చేసింది కాని అది స్విచ్ ఆఫ్ వస్తోంది. […]

3 min 9 views
కడలి

కడలి – 5

వంశి ని చూసిన రఘుకి ఆమేదో సైగ చేయగా అన్నయ్య మరేమో ఎలాగో తను చదువుకోడానికి పంపమన్నావ్ కదా. అందుకే…   హా! అందుకు..?   వచ్చే ఆరు నెలల్లో జరగబోయే టోర్నమెంట్ కి మన వంశి సెలెక్ట్ అయింది. నువ్వు ఒప్పుకుంటే వంశీ ఆడడానికి ప్రాక్టీస్ కోసం ఢిల్లీ వెళ్ళాలి అన్నయ్య. ఒప్పుకోవా ప్లీజ్.   అలుసిచ్చా కదాని నెత్తికి ఎక్కకండి ఇద్దరూ.   అది కాదన్నయ్య. నేను చెప్పేది ఓసారి విని నీ నిర్ణయం […]

3 min 4 views