New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
సప్త భావోద్వేగాలు దాటి – 1

సప్త భావోద్వేగాలు దాటి – 1

మొదటి ఎపిసోడ్:-

అర్జున్ ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యువకుడు. అతని స్వస్థలం బెంగళూరు. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా, సరదాగా ఉండే అర్జున్కు కుటుంబ సభ్యులంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తన తల్లిదండ్రుల మాటకు ఎంతో విలువ ఇస్తాడు. చదువులోనూ, స్నేహితులతో కలిసిమెలిసి ఉండటంలోనూ ఎప్పుడూ ముందుంటాడు.

అర్జున్ పుట్టుక వివరాలు 

అర్జున్ 15 ఆగస్టు 2000వ సంవత్సరంలో బెంగళూరులో జన్మించాడు. అతని తండ్రి పేరు రామకృష్ణ, తల్లి పేరు లక్ష్మీదేవి. తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. తల్లి గృహిణి. అర్జున్కు ఒక చెల్లెలు ఉంటుంది. ఆమె పేరు అనన్య. ప్రస్తుతం ఆమె డిగ్రీ చదువుతోంది. అర్జున్ తన చెల్లెలితో చాలా సరదాగా ఉంటాడు. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా, ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు.

 

అర్జున్ తాతయ్య పేరు వెంకటేశ్వరరావు, నానమ్మ పేరు సీతమ్మ. వీరిద్దరూ కుటుంబంలో అందరికీ మంచి సలహాలు ఇస్తుంటారు. కుటుంబ సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ సంతోషంగా జీవిస్తుంటారు.

MBA పూర్తి చేసి హైదరాబాద్ ప్రయాణం

అర్జున్ చిన్నప్పటి నుంచి చదువులో బాగా రాణించేవాడు. బెంగళూరులోనే తన పాఠశాల విద్యను, డిగ్రీని పూర్తి చేశాడు. ఆ తర్వాత MBA చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.

 

MBA పూర్తయిన తర్వాత బెంగళూరులోనే ఉద్యోగం చేయాలని మొదట అనుకున్నాడు. కానీ తన జీవితంలో కొత్త అనుభవాలు పొందాలని, కొత్త ప్రదేశంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

 

ఒకరోజు హైదరాబాద్లోని ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగానికి సంబంధించిన అవకాశం వచ్చింది. అర్జున్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాడు. మొదట తల్లిదండ్రులతో తన నిర్ణయం గురించి మాట్లాడాడు.

తండ్రి రామకృష్ణ కొంతసేపు ఆలోచించి, “నువ్వు జీవితంలో ఎదగాలని అనుకుంటున్నావు కదా! అయితే ధైర్యంగా ముందుకు వెళ్లు. ఎక్కడ ఉన్నా నీ కుటుంబం నీకు అండగా ఉంటుంది” అని చెప్పాడు.

తల్లి లక్ష్మీదేవి మాత్రం కొడుకు దూరంగా వెళ్తున్నాడని కొంచెం బాధపడింది. అయినా అతని భవిష్యత్తు కోసం సంతోషంగా హైదరాబాద్ వెళ్లడానికి అంగీకరించింది.

అలా అర్జున్ తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చాడు.

బెంగళూరులో స్నేహితులతో ప్రేమ గురించి సంభాషణ

హైదరాబాద్కు వచ్చే ముందు అర్జున్ తన చిన్ననాటి స్నేహితులైన రాహుల్, సాయి, కార్తీక్ తో ఎక్కువ సమయం గడిపేవాడు. వీళ్లు నలుగురూ ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు అర్జున్ రాహుల్ సాయి కార్తీక్ కాలేజ్ సెకండియర్ లో ఉన్నప్పుడు ఒకరోజు వీళ్ళకి సీనియర్స్ నుంచి ఒక ఆపద వస్తుంది అప్పుడు కాలేజ్ ఫెస్ట్ ఆఫీస్ లో కాలేజీ యాజమాన్యంతో పాటు స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు సాయి మరియు కార్తీక్ టెస్ట్ సంబంధించినటువంటి ఏర్పాటు పనులలో ఉంటారు సీనియర్స్ అర్జున్ బ్యాక్ చేసినటువంటి మంచి పనులను చూసి తట్టుకోలేక వాళ్లని కాలేజ్ మేనేజ్మెంట్ ముందు పరువు తీయాలని ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేస్తారు ఆ ప్లాన్ లో సీనియర్స్ జూనియర్స్ పర్ఫామెన్స్ చేసేటప్పుడు మ్యూజిక్స్ డీజే సిస్టమ్స్ ని స్టాప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ విషయం తెలుసుకున్న అర్జున్ తన మిత్రులతో కలిసి సీనియర్స్ మీదకి గొడవకు దిగుతాడు ఆ విషయం తెలుసుకున్న మేనేజ్మెంట్ వాళ్ళందర్నీ కలిపి ఒకచోటి కూర్చోబెడతారు అప్పుడు ఆ ఫెస్ట్ కొంతసేపు వరకు ఆగిపోతుంది

అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళని ప్రశ్నించగా సీనియర్స్ వెళ్లి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు అని జూనియర్స్ మీద కంప్లైంట్ చేస్తారు అప్పుడు అర్జున్కి బాగా కోపం వచ్చి సీనియర్లో ఒకడు అయినా లక్ష్మణ్ ని ముక్కు మీద గట్టిగా గుద్దుతాడు అప్పుడు లక్ష్మణ్ కింద పడిపోతాడు అప్పుడు మేనేజ్మెంట్ అర్జుని నువ్వు చేస్తున్న పని ఏమిటి అర్జున్ ఇంత కోపం కష్టపడేంట్ గా ఉండకూడదు అయ్యా ఏదైనా గొడవ జరిగితే కూర్చొని మాట్లాడుకోవాలి గాని ఇలా గొడవ పడడం కరెక్ట్ కాదు అని అర్జున్ కి నచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు అర్జున్ వాడికి నేను నాటిక ప్రేమతో నేను చెప్పాను కానీ వాళ్ళు వినడం లేదు ప్రతిసారి ఏదో ఒకటి ఇలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడని మేనేజ్మెంట్ కి స్పష్టంగా వివరిస్తాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అర్జున్ మాటలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక యూత్ ప్రెస్ మీ ప్రారంభించడం మొదలు పెడతారు అప్పుడు అందరూ చాలా సరదాగా జాలీగా హ్యాపీగా ఆ యొక్క యూత్ ఫెస్ట్ లో పాల్గొని అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత రోజు అర్జున్ మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సాయంత్రం బయటికి వెళ్దామని అనుకుంటారు సాయంత్రం బయటికి వెళ్లే సమయానికి అర్జెంట్కి మధ్యాహ్నం హైదరాబాదులో జాబ్ సెర్చింగ్స్ బాగా ఉన్నాయని దాకా జాబ్ ఆఫర్స్ ఉన్నాయని గ్రోతింగ్ ఉంటదని తనకు అంజన సోషల్ మీడియా సమాచారం ద్వారా తెలుసుకొని హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధంగా ఉంటాడు ఇక ఫ్రెండ్స్ అందరు కలుసుకుందాం అని వాళ్ళు అనుకున్న ప్లేస్ కి సాయంత్రం అందరూ ఒక కేఫ్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.

 

అప్పుడే రాహుల్ ప్రేమ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు.

 

రాహుల్: ఒరేయ్ అర్జున్! మనందరికీ పెళ్లిళ్లు అయ్యే వయసు వచ్చేసింది. మరి నీ లైఫ్లో ఎవరైనా అమ్మాయి ఉందా?

 

కార్తీక్: అవును రా! ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు. ఎవరినైనా లవ్ చేస్తున్నావా?

 

సాయి: నిజం చెప్పు బ్రో! ఏదైనా లవ్ స్టోరీ ఉంటే మాకు కూడా చెప్పాలి.

 

అర్జున్ వాళ్ల మాటలు విని నవ్వుతూ కాఫీ తాగుతూ 

 

అర్జున్: ఒరేయ్! ప్రేమ అంటే నాకు కూడా ఇష్టమే. కానీ ప్రేమ అనేది టైంపాస్ కోసం చేసేది కాదు. మన జీవితంలోకి వచ్చే అమ్మాయి మనల్ని అర్థం చేసుకోవాలి. మన సంతోషంలోనే కాదు, కష్టాల్లో కూడా తోడుగా ఉండాలి అయిన నాకు ఒక అమ్మాయి నచ్చితే డైరెక్ట్ గా పెళ్ళి చేసుకుంటావా అని అడుగుతా 

 

రాహుల్: అంటే నీకు ఇంకా లవ్ లేదన్నమాట!

 

అర్జున్: లేదురా! ఇప్పటివరకు అలాంటి అమ్మాయి నా జీవితంలోకి రాలేదు. ఒకవేళ వస్తే తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. కానీ ప్రేమ కోసం వెతుక్కుంటూ నా జీవితాన్ని మాత్రం మర్చిపోను.

 

కార్తీక్: అబ్బా! పెద్ద ఫిలాసఫీ చెబుతున్నావురా!

 

అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.

 

ఆ తర్వాత అర్జున్ తన హైదరాబాద్ ప్రయాణం గురించి స్నేహితులకు చెప్పుతాడు. స్నేహితులందరూ అతన్ని అభినందిస్తూ, ఎక్కడ ఉన్నా తమ స్నేహం మారదని మాట ఇచ్చారు

 

అర్జున్కు తెలియదు… హైదరాబాద్ ప్రయాణం తన జీవితంలో ఒక కొత్త ఉద్యోగాన్ని మాత్రమే కాదు, తన జీవితాన్నే మార్చే ఒక ఒక సంఘటన జరగబోతుందని. 

 

మిగిలిన భాగం రెండవ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం….?